English | Telugu

ఫాన్స్ ఉంటే చాలు ఏమైనా చేసేస్తారు..విలన్ అట్రాక్షన్ తో ఉన్న హీరోతో నటించాను

నీతోనే డాన్స్ షో ఈ శనివారం ఎపిసోడ్ లో నటరాజ్ మాస్టర్ - నీతూ జోడి బాలకృష్ణ మూవీస్ లోని సాంగ్స్ కి డాన్స్ వేసి అదరగొట్టేసాడు. ఇక అచ్చంగా బాలకృష్ణను దింపేశారు నటరాజ్ మాష్టర్. ఈ పెర్ఫామెన్స్ కి అందరూ ఫుల్ ఫిదా ఇపోయారు. ఇక రాధ కామెంట్ల వర్షం కురిపించారు.."హీరోస్ లో ఇంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉన్న వ్యక్తిని నేను అసలు చూడలేదు అన్నారు. బాలకృష్ణ గారితో నేను నాలుగైదు సినిమాలు చేసాను. ప్రతీసారి ఆయన తన బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. ఆయన స్పిరిట్ ని, ఆయన ఎనెర్జీని ఇమిటేట్ చేయాలి అంటే అంత ఈజీ కాదు. కానీ నటరాజ్ మాష్టర్ మీరది చేసి చూపించారు." అన్నారు. ఇక కంటెస్టెంట్ జోడీస్ అంత కలిసి 27 మార్కులు ఇచ్చారు నటరాజ్ మాష్టర్ జోడికి. "మీ లైఫ్ లో షేర్ చేసుకునే బెస్ట్ ఫ్యాన్ మూమెంట్" ఏమిటి అని శ్రీముఖి అడిగింది. "బాలకృష్ణ గారితో నేను వర్క్ చేసాను. ఒక 20 సెకండ్స్ మూవ్మెంట్ చూపించాను.

మీకు ఒకే నా లేదంటే మార్చేయనా అని అడిగాను. లేదు. చాల బాగుంది మాష్టర్. లేదు..నేను చేసేస్తా అని వెంటనే నేర్చుకుని స్పాట్ లో చేసేసారు..ఆయన ముందు ఫాన్స్ ఉంటే చాలు ఏమైనా చేసేస్తారు." అని చెప్పారు నటరాజ్ మాస్టర్. తర్వాత రాధను అడిగింది శ్రీముఖి "రాధమ్మ మీ లైఫ్ లో జరిగిన సూపర్ స్టార్ మోమెంట్ ఏమిటి " అని " నేను రజనీకాంత్ గారికి పెద్ద ఫ్యాన్ ని. నేను ఏడవ తరగతి చదివేటప్పుడు "ఆడు పులి ఆట్టం" అని మూవీ వచ్చింది. ఒక రోజు మాకు స్కూల్ చాలా ఎర్లీగా ఐపోయింది. నేను నా ఫ్రెండ్ షీలా థియేటర్ కి వెళ్లి మూవీ చూసాం ..ఆ మూవీలో స్టైల్ గా సిగరెట్ తాగుతూ బైక్ మీద కూర్చున్నతన్ని చూసాను. తర్వాత ఆయన విలన్ అని తెలిసింది ..అలా ఆయన్నే ఇమాజిన్ చేసుకుంటూ వస్తుంటే నా ఫ్రెండ్ అడిగింది ఏమిటి అని..చాలా బాగున్నాడు కదా అని అన్నాను..ఏమే అతను విలన్ అంది నా ఫ్రెండ్..అవన్నీ నాకు తెలీదు. ఫస్ట్ టైం నా లైఫ్ లో విల్లన్ అట్రాక్షన్ తో ఉన్న హీరోతో నేను నటించడం అనేది జస్ట్ ఇమాజిన్..ఆయనతో చేసిన ప్రతీ షూట్ మోమెంట్ నాకు గుర్తుంది." అని చెప్పారు రాధ..


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.