Read more!

English | Telugu

మైకేల్ జాక్సన్, అల్లు అర్జున్ డాన్స్ వీడియోస్ చూసి డాన్స్ నేర్చుకున్నా

నీతోనే డాన్స్ శనివారం ఎపిసోడ్ లో కావ్య-నిఖిల్ జంట చేసిన పెర్ఫార్మెన్స్ కి అందరూ షాకైపోయారు. చాలా యూనిక్ గా కొత్తగా చేశారు ఈ జంట. ఇక సదా ఫిదా ఐపోయి త్వరలోనే నిఖిల్ ని బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నట్టు చెప్పింది. తర్వాత మిగతా కంటెస్టెంట్ జంటలంతా మంచి స్కోర్స్ ఇచ్చారు. ఇక శ్రీముఖి వాళ్ల లైఫ్ లో ఉన్న ఫ్యాన్ మోమెంట్ ఏమిటి అని అడిగింది. "నా లైఫ్ లో ఇంకా  ఫ్యాన్ మోమెంట్ అనేది ఇంకా రాలేదు. ఎప్పటికైనా అల్లు అర్జున్ గారిని కలుస్తాను..నేను చిన్నప్పుడు డాన్స్ క్లాస్ కి వెళ్లనే లేదు. మైకేల్ జాక్సన్ గారు, అల్లు అర్జున్ గారి డాన్స్ వీడియోస్ చూసి డాన్స్ నేర్చుకున్నా. కానీ ఏదో ఒక రోజు నేను అల్లు అర్జున్ గారితో స్క్రీన్ షేర్ చేసుకుంటా..

అల్లు అర్జున్ చాలా గట్టి మనిషి..." అని చెప్పాడు నిఖిల్. కాని నీకోసం అల్లు అర్జున్ గారు ఒక సర్ప్రైజ్ పంపించారు అని చెప్పి అల్లు అర్జున్ తో నిఖిల్ దిగిన ఫోటోని ప్లే చేసి చూపించింది శ్రీముఖి. ఇక తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని చెప్పింది కావ్య. ఆమె మాటకు తరుణ్ మాష్టర్ మధ్యలో వచ్చి "కావ్య..పవన్ కళ్యాణ్ నటించిన అక్కడమ్మాయి... ఇక్కడబ్బాయి మూవీలో ఒక సాంగ్ ని ఈ స్టేజి మీదే షూట్ చేసాం. అప్పుడు డాన్స్ చేయడానికి పవన్ కళ్యాణ్ చాలా టెన్షన్ పడిపోయేవారు. ఆ సాంగ్ టైములో నా దగ్గరకు వచ్చి మాష్టర్ గారు మా అన్నయ్య ఇప్పటికే చాలా పెద్ద స్టార్. కానీ నేను హీరోగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా..జనాలు నన్ను యాక్సెప్ట్ చేస్తారా హీరోగా అని అడిగారు..పర్లేదు. నీ లాగే మీ అన్నయ్య కూడా హీరోగా ట్రై చేసేటప్పుడు నేను అసిస్టెంట్ గా చేసాను..కంగారేమీ పడక్కర్లేదు అని చెప్పా...కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ ఇపోయారు " అని అప్పటి ఫ్యాన్ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు తరుణ్ మాష్టర్.