English | Telugu

మహేష్ బాబుతో చేయడం చాలా హ్యాపీ...ఈసారి టీవీలో స్ట్రైట్ గా కూర్చుని చూడండి

నీతోనే డాన్స్ షోలో యాదమ్మరాజు జంటకి పవన్-అంజలి జంటకు ఈ శనివారం ఎపిసోడ్ లో చిన్న క్లాష్ అయ్యింది. అంజలి-పవన్ జోడి "శంకర్ దాదా ఎంబిబిఎస్" మూవీ నుంచి ఒక సాంగ్ కి డాన్స్ చేశారు. పెర్ఫార్మెన్స్ అయ్యాక యాదమ్మరాజు-స్టెల్లాని మార్క్స్ ఇమ్మని అడిగింది శ్రీముఖి. వాళ్ళు 8 మార్క్స్ ఇచ్చారు. పవన్ ఎనేర్జి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకేలా ఉంది .. కానీ అంజలి ఎనెర్జీ తగ్గింది అని చెప్పారు. అలాగే ఒక స్టెప్ కూడా అంజలి వేయలేదు అని చెప్పాడు. దానికి శ్రీముఖి "ఓహో మీరు పవన్ లో చిరంజీవిని చూసారు..అందుకే ఆయన పక్కన చేసిన హీరోయిన్ లో ఎనర్జీ తగ్గింది అని అంటున్నారా" అంది.. "అవును" అన్నాడు రాజు. "లేదు ఈ సారి ఎం చేస్తారంటే టీవీలో స్ట్రైట్ గా కూర్చుని చూడండి..అప్పుడు తెలుస్తుంది నా ఎనర్జీ డ్రాప్ అయ్యిందా లేదా అని ఎందుకంటే ఇప్పుడు సైడ్ కి కూర్చున్నారు కదా " అంది అంజలి.

"చూసాక నీ స్టెప్స్ మీద కామెంట్ చెప్తా" అన్నాడు రాజు. "ఈసారికి నుంచి మేము కూడా అయ్యో పాపం అని కాకుండా..ఎక్కడ పూల కుండీ ఎగిరింది, షర్ట్ ఎగిరిందా లేదా, జుట్టు ఎగిరిందా లేదా అని కూడా చూస్తాం" అని అంజలి సీరియస్ గా చెప్పేసరికి "నాకు అనిపించింది చెప్పాను...సారీ" అన్నారు యాదమ్మ రాజు జంట. తర్వాత అందరితో కలిపి చిరంజీవి వీణ స్టెప్ వేయించింది శ్రీముఖి. అలాగే వాళ్ల లైఫ్ లో ఫ్యాన్ మోమెంట్ ఏమిటి అని కూడా అడిగింది "సరిలేరు నీకెవ్వరూలో మహేష్ బాబు పక్కన ఇలా కలిసి నటించిన మోమెంట్ మర్చిపోలేనిది. రాజకుమారుడు టైంలో చేసాను. మళ్ళీ ఇప్పుడు ఈ మూవీలో ఇలా సాంగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. దీనికి శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ. నా ఫస్ట్ మూవీ 16 టీన్స్ టైములో రాకేష్ మాష్టర్ దగ్గర శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ గా చేస్తూ అప్పుడు కూడా ఆయనే కోరియోగ్రఫీ చేశారు." అని తన లైఫ్ లో ఫ్యాన్ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.