English | Telugu

ఢీ షోకి తాగేసి వచ్చిన ఆది... షాకైనా శేఖర్ మాష్టర్

  ఢీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో తీసుకున్న కాన్సెప్ట్స్ చాలా వెరైటీగా మంచి ఫన్నీగా ఒక షార్ట్ స్టోరీని ఒక డాన్స్ రూపంలో  చెప్పినట్టుగా ఉన్నాయి. ఇందులో ముందుగా కింగ్స్ ఆఫ్ కరీంనగర్ వెర్సెస్ వాల్తేరు వారియర్స్ పోటీ పడ్డారు. ఇక ఈ షోకి దీపికా పిల్లి అఖిల్ సార్థక్ ని తీసుకొచ్చింది. "ఎవడీడు" అని ప్రదీప్ అడిగేసరికి "మా బావ" అని చెప్పింది  దీపికా.." ఆ డ్యాన్సింగ్ స్టయిలు, ఆ బాడీ లాంగ్వేజ్ ఏమీ లేకపోయినా బావ అన్నావ్ కాబట్టి " అని ప్రదీప్ అన్నాడు. "ఇంకొకాయన ఏడీ" అని శేఖర్ మాష్టర్ అడిగేసరికి  హైపర్ ఆది మందు బాటిల్ చేతిలో పట్టుకుని తాగుతూ వచ్చాడు.

అమ్మోరులో నాగార్జునలా ఉన్నావ్..సర్పంచ్ దోశ ఉంది

జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో  రాకెట్ రాఘవ, వాళ్ళ అబ్బాయి మురారి ఇద్దరూ కలిసి మంచి ఫన్నీ  స్కిట్ చేశారు. అందులో వాళ్ళు వేసిన పంచులు భలే ఫన్నీగా ఉన్నాయి. సోగ్గాడే చిన్ని నాయన మూవీలో అక్కినేని నాగార్జున, అఖిల్ గెటప్స్ లో వైట్ అండ్ వైట్ డ్రెస్ తో చేతిలో కర్రతో కనిపించారు. "నేను ఎవరో తెలుసా సోగ్గాడే చిన్ని నాయనా..అని రాఘవ అనేసరికి ...మరి నేనేమిటి మీ పెద్దనాయననా" అన్నాడు రాఘవ కొడుకు మురారి. దానికి షాకయ్యాడు రాఘవ. "నేను ఈ గెటప్ లో ఎలా ఉన్నాను... మాస్ మూవీలో నాగార్జున గారిలా ఉన్నానా, మన్మధుడు సినిమాలో నాగార్జున గారిలా ఉన్నానా" అని అడిగేసరికి "అమ్మోరులో నాగార్జున గారిలా ఉన్నావ్" అన్నాడు మురారి. " ఆ సినిమాలో నాగార్జున గారు లేరు కదరా అని రాఘవ అనేసరికి నువ్వు కూడా అలా లేవు కదా నాన్న" అన్నాడు మురారి. తర్వాత నాటీ నరేష్ స్కిట్ లో ఒక కమెడియన్ "ఎంఎల్ఏ దోశ ఏమన్నా ఉందా అనేసరికి సర్పంచ్ దోశ ఉంది" అన్నాడు నరేష్...

ఆ రూంలోనే ఒకప్పటి స్టార్ సెలబ్రిటీస్...ఇప్పుడు శ్రీముఖి

నీతోనే డాన్స్ షో జడ్జ్ తరుణ్ మాష్టర్ కొత్తగా స్టార్ట్ చేసిన తన యూట్యూబ్ ఛానల్ కోసం కొన్ని వారాల ముందు రాధా, సదా క్యారవాన్, మేకప్ రూమ్ టూరు చేసి చూపించారు. ఇప్పుడు "చిట్ చాట్ విత్ శ్రీముఖి" పేరుతో ఆమె రూమ్, మేకప్ కిట్, అలాగే ఆమె హెయిర్ స్టైలిస్ట్ ప్రసన్న  అన్ని కూడా చూపించారు. శ్రీముఖికి క్యారవాన్ లేదు కానీ అన్నపూర్ణ స్టూడియోస్ లో సొంత మేకప్ రూమ్ ఉంది అని చెప్పారు.  ఈ స్టూడియోలో సెలబ్రిటీస్ అందరికీ మేకప్ రూమ్స్ కట్టించారు అప్పట్లో. అలా శ్రీముఖికి కూడా ఇక్కడ ఒక స్పెషల్ రూమ్ ఉంది. అది తనకు ఎంతో లక్కీ రూమ్ కూడా అన్నారు తరుణ్ మాష్టర్. శ్రీముఖికి ఈ రూమ్ అంటే చాలా ఇష్టం కూడా. ఇదివరకు చాలా మంది సెలబ్రిటీస్ తమ క్యారవాన్ వచ్చే ముందు ఈ రూమ్ లోనే మేకప్ అవీ వేసుకునేవారు.