English | Telugu

ఏంజిల్ లవ్ ప్రపోజల్.. వసుధార షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -811 లో.. వసుధార, రిషి ఇద్దరు సెమినార్ గురించి డిస్కషన్ చేస్తుంటారు. అప్పుడే అక్కడికి ఏంజిల్ వస్తుంది. మా రిషి అనుకుంటే ఏదైనా అయిపోద్ది.. సెమినార్ గురించి ఇప్పటి వరకు అందరూ కాన్ఫరెన్స్ లో మాట్లాడేలా చేశాడని ఏంజిల్ అంటుంది.

నువ్వు ఇంత హ్యాండ్సమ్, టాలెంటెడ్ గా ఉంటావ్.. ఇప్పటివరకు నీకు ఏ అమ్మాయి ప్రపోజ్ చెయ్యలేదా రిషి అని ఏంజెల్ అంటుంది. రిషి మౌనంగా ఉంటాడు. వసుధార మా రిషి బాగుంటాడు కదా.. నువ్వు ఒక సీనియర్ లెక్చరర్ గా కాకుండా, ఒక అబ్బాయిలా చూడు అని వసుధారతో ఏంజిల్ అంటుంది. అవును ఏంజిల్ సర్ బాగుంటారని వసుధార అంటుంది. ఆ తర్వాత " ఐ లవ్ యు అని ఇంత వరకు ఏ అమ్మాయి నీకు చెప్పలేదా రిషి" అని రిషిని ఏంజిల్ అడుగుతుంది. ఏంజిల్ నోటి నుండి ఆ మాట వినగానే వసుధార షాక్ అవుతుంది.

అలా ఏంజిల్ అనగానే.. తనకి వసుధార ప్రపోజ్ చేసిందంతా గుర్తుచేసుకుంటాడు రిషి.. "ఏం అవసరం లేని విషయం మాట్లాడకు ఏంజిల్" అని రిషి అంటాడు. సరే నేను వెళ్తున్నా.. కానీ నిన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో కానీ తనకంటే అదృష్టవంతురాలు ఎవరు ఉండరని ఏంజెల్ చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ అదృష్టవంతురాలు నేనే అని వసుధార తనలో తాను అనుకుంటుంది. మరొక వైపు జగతి, మహేంద్ర ఇద్దరు ఒక హోటల్ లో స్టే చేస్తుంటారు. వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు స్టే చేసే హోటల్ ముందే ఉండి జగతికి ఫోన్ చేస్తాడు శైలేంద్ర. మీరు ఎక్కడ వున్నారో తెలుసుకుందామని కాల్ చేశాను.. నేను కాలేజీకి వెళ్లి ఏమైనా వర్క్స్ ఉంటే చూసుకోవాలా అని శైలేంద్ర కావాలనే అడుగుతాడు. అవసరం లేదని జగతి అంటుంది. మరొక వైపు రిషి వర్క్ చేస్తూ అలాగే హాల్లో పడుకుంటాడు. అలా పడుకున్న రిషిని సోఫాలో పడుకోపెట్టి తన చేతిలో ఉన్న లాప్టాప్ తీసుకొని వెళ్లి తన గదిలో వర్క్ చేస్తుంది వసుధార.

ఆ తర్వాత రిషి మధ్యలో లేచి లాప్టాప్ ఏంజిల్ తీసుకువెళ్లిందా అని అనుకుంటాడు. వసుధార గది దగ్గరికి వెళ్లేసరికి.. తను వర్క్ చేస్తుంటుంది. ఈ టైమ్ వరకు చేస్తే ఆరోగ్యం ఏమవుతుంది.. ఇంప్రెషన్ కోసం చేస్తున్నావా అని రిషి అంటాడు. ఇంట్రస్ట్ ఉంది కాబట్టి చేస్తున్నాని, వర్క్ అయిపోయిందని, ఎవరు చేస్తే ఏంటి వర్క్ అయితే అయిపోయింది కదా అని వసుధార అంటుంది. థాంక్స్ అని రిషి అంటాడు. మరుసటిరోజు ఉదయం వసుధార కాలేజీకి వెళ్లి రిషి సర్ సెమినార్ వినాలని రెడీ అయి హాల్లోకి వస్తుంది. నేను వస్తాను సర్ నన్ను కాలేజీకి తీసుకెళ్లండని అక్కడే ఉన్న విశ్వనాథ్ తో వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.