Read more!

English | Telugu

సాగర్ డాన్స్ ని రజనీ డాన్స్ తో పోల్చిన తరుణ్ మాస్టర్!

నీతోనే డాన్స్ ఆదివారం ఎపిసోడ్ లో నాలుగు జంటలు డాన్స్ లు అదరగొట్టేశాయి. ఇందులో సాగర్ -దీప జోడి డాన్స్ కి జడ్జెస్ అంతా ముద్దులిచ్చేశారు. స్ప్లిట్ పర్సనాలిటీ కాన్సెప్ట్ తో వీళ్ళు  చేసిన డాన్స్ స్టేజి మీద మంచి కలర్ ఫుల్ గా ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించింది.  ఇక సదా ఐతే రియల్లీ లవ్ యు గైస్ అని చెప్పేసారు. అసలు ఏం తినొచ్చారు మీరు ఈరోజు. చాలా అద్భుతంగా డాన్స్ చేశారు అని అన్నారు.  ఇక జడ్జి రాధా ఐతే తాను ఎలా చెప్పారో అలాగే చేశారని కాంప్లిమెంట్ ఇచ్చేసారు. ఇద్దరి ఈక్వల్ గా డాన్స్ చేసారని చెప్పారు. సాగర్ గుడ్ డైరెక్టర్ మాత్రమే కాదు బ్యూటిఫుల్ స్టూడెంట్ అని కూడా చెప్పారు రాధ.

దానికి సాగర్ కూడా ఆ కాంప్లిమెంట్ ని యాక్సెప్ట్ చేసి ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇదే అని చెప్పారు.  ఇక తరుణ్ మాష్టర్ సాగర్ దీప డాన్స్ కి ఫిదా ఇపోయారు కానీ పేపర్ లో సగం పీస్ మాత్రం చింపుతా నెక్స్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ ఇంకా బాగుండాలి అప్పుడు పేపర్ ఫుల్ చింపేస్తాను అన్నారు. సాగర్ డాన్స్ చూస్తుంటే ఎలా ఉందంటే రజనికాంత్ గారు ఫుల్ డాన్స్ ఒకేసారి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అని చెప్పారు. ఇక సాగర్ డాన్స్ కి అమరదీప్ జోడి 8  మార్క్స్, శివ్ జంట 9 మార్క్స్, ఆట సందీప్ జంట 10 మార్క్స్ ఇచ్చేసారు. గత ఎపిసోడ్ లో ఎలాగైనా ఆట సందీప్ మాష్టర్ నుంచి ఫుల్ మార్క్స్ తీసుకుంటాను అని అన్నారు. అలాగే ఈ వారం ఫుల్ మార్క్స్ సంపాదించుకున్నారు. ఇక  గత ఎపిసోడ్ లో ఈ జంటల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. కానీ ఈ వారం మాత్రం వీళ్ళు హగ్ చేసుకుని కనిపించారు. దానికి శ్రీముఖి కూడా ఆశ్చర్యపోయింది. "సాగర్ దీప జోడి చాలా ఎనర్జిటిక్ గా చేశారు. ఎక్కడా ఎనెర్జీ డ్రాప్ ఐనట్టు కనిపించలేదు. ఎలా ఐతే శివ్ జోడి కం బ్యాక్ పెర్ఫార్మెన్స్ తో ఎలా వచ్చారో మీరు కూడా అలాగే వచ్చారు. కానీ దీప డాన్స్ మాత్రం ఇంకా అద్దిరిపోయింది" అని సందీప్ మాష్టర్ చెప్పేసరికి దీప స్టేజి మీద ఏడ్చేసింది. ఇకసాగర్ ని చూసాక ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి అని కోరింది శ్రీముఖి.