Read more!

English | Telugu

మహిళల కోసం 'నేను సూపర్ ఉమెన్' త్వరలో

"అభిప్రాయలు మార్చుకోండి సర్ ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి" అంటూ అల్టిమేట్ డైలాగ్ తో ఈ షో ప్రోమో ఎండ్ అయ్యింది. ఇంతకు ఈ మాటలు ఏ షోకి సంబంధించినవి అనుకుంటున్నారా "నేను సూపర్ ఉమెన్" అనే కొత్త షోలోవి ఈ డైలాగ్స్. ఆహాలో త్వరలో ప్రసారం కాబోతోంది ఈ షో. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. 

ఇందులో ఒక అమ్మాయి దుస్తులు మడత పెడుతూ ఉండగా వాళ్ళ ఇంటికి తెలిసిన అంకుల్ వచ్చారు. "గీతా... అంకుల్ వచ్చారు కాఫీ" అని అడిగేసరికి "కాఫీ తర్వాత ముందు కూర్చోమ్మా... అమ్మ అబ్బాయి ప్రశాంత్ యూఎస్ లో లక్షలకులక్షలు సంపాదిస్తున్నాడు. నువ్వు ఊ అను వెంటనే పెళ్ళికి ఒప్పిస్తా" అని సలహా ఇచ్చేసరికి "లేదు అంకుల్ ఇంకా టైం ఉంది పెళ్ళికి.. ఇప్పుడు నా బిజినెస్ గ్రో అవ్వాలి"అని చెప్తుంది. "ఎందుకమ్మా నీకు ఈ బిజినెస్ గొడవలు.. హాయిగా పెళ్లి చేసుకుని ఇద్దరి పిల్లలతో సెటిల్ ఐపో" అని ఆ అంకుల్ సలహా ఇచ్చి తన సెల్ లో కొడుకు ప్రశాంత్ ఫోటోని చూపించాడు. "ఏరోబూట్ అనే రోబోటిక్ కంపెనీలో డెవలపర్ గా పనిచేస్తున్నాడు" అని చెప్పి.. "ఇంతకు నువ్వేం బిజినెస్ చేస్తున్నావమ్మా" అని కాఫీ తాగుతూ అడిగారు అంకుల్. "ఏరోబూట్ అని చిన్న రోబోటిక్స్ కంపెనీ ఉంది అంకుల్ నాకు.. ఇదిగో మాటల్లోనే మీ కొడుకు నాకు కాల్ చేస్తున్నాడు యూఎస్ లో షిఫ్ట్ ఐపోయినట్టుంది..స్టేటస్ అప్ డేట్ కనుక్కుని వస్తాను అంకుల్" అని ఆమె అక్కడినుంచి గర్వంగా లేచి వెళ్తుంటే నాలుక్కరుచుకుని అంకుల్ అలా చూస్తూ ఉండిపోయారు. ఓవరాల్ గా షో థీమ్ ని చాలా అందంగా చెప్పారు. ఆడవాళ్లు అంటే ఇంకా వంటిల్లు, పిల్లలు కాదు ఆ జనరేషన్ మారింది బిజినెస్ లు చేస్తూ కంపెనీలు కూడా నడుపుతున్నారు అనే కాన్సెప్ట్ తో ఈ ప్రోమోని డిజైన్ చేశారు.