Read more!

English | Telugu

అర్జున్ కళ్యాణ్ చేసిన పోస్ట్ తన కోసమేనా!

అర్జున్ కళ్యాణ్.. బాస్ సీజన్-6 తో అందరికి పరిచయమయ్యాడు. శ్రీసత్య గురించి మాట్లాడితే అర్జున్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది. బిగ్ బాస్ లో శ్రీసత్య వెంటే అర్జున్ కళ్యాణ్ ఉంటూ.. తనతోనే ఎక్కువ టైం గడిపేవాడు. అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ ఎంట్రీకి ముందు ఒక వెబ్ సీరీస్ లో యాక్ట్ చేసాడు.. అది కూడా ఎక్కువ పాపులారిటి రాకపోయేసరికి ఎవరికి ఎక్కువగా తెలియలేదు.  ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో బాగా ఫేమస్ అయ్యాడు. శ్రీసత్య కోసం తన గేమ్ ని కొన్ని సందర్బాలలో త్యాగం చేసాడు. ఒకానొక సందర్భంలో బిగ్ బాస్ కి రావడం కూడా.. శ్రీ సత్య వల్లే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు అర్జున్ కళ్యాణ్.

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యాక కూడా శ్రీ సత్య వల్లే బయటకు వచ్చాడంటూ అప్పట్లో ఒక న్యూస్ కూడా వైరల్ అయింది. అయితే తాజాగా జరిగిన బిబి జోడి షోలో అర్జున్ కళ్యాణ్ కి జోడిగా శ్రీ సత్య వస్తుందనే వార్తలు వినిపించిన.. చివరికి వాసంతి కృష్ణన్ తో జత కట్టాడు. మరొక జోడిగా మెహబూబ్ తో శ్రీ సత్య జత కట్టింది. బిబిజోడీలో కూడా శ్రీసత్య, అర్జున్ ల మధ్యలో ఏదో ఉన్నట్లుగా.. జడ్జెస్, యాంకర్ శ్రీముఖి కూడా సరదాగా  ఆటపట్టించారు. కానీ  శ్రీసత్య మాత్రం.. అర్జున్ పై ప్రేమ లేదని, తనొక ఫ్రెండ్ అంటూ చెప్పింది. అయితే ఓ ఇంటర్వ్యూ లో అర్జున్ మాట్లాడతూ.. మా మధ్య ఏం లేదు. బిగ్ బాస్ లో నేను శ్రీసత్య విషయంలో చేసింది ఎంటర్టైన్మెంట్ కోసమే చేసామంటూ చెప్పాడు.  అయితే ఈ ఇంటర్వ్యూకి ముందు.. ఒకానొక సందర్భంలో శ్రీసత్య కోసమే బిగ్ బాస్ కి వచ్చానట్టు, తను ఎక్కడుంటే అక్కడే ఉండాలని అందుకుగాను బిగ్ బాస్ లోకి రావడానికి  చాలా కష్టపడ్డాడని, తనతో కలిసి ఉండటానికి బిగ్ బాస్ షోకి వచ్చినట్టుగా అర్జున్ కళ్యాణ్  చెప్పాడు.

అయితే ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ తో పాటు మరొక కొత్త సోషల్ ఆప్ 'థ్రెడ్స్' వచ్చింది. దీంతో సెలబ్రిటీలంతా దీనిని ఫాలో అవుతూ పోస్ట్ లు చేస్తున్నారు. అయితే అర్జున్ కళ్యాణ్ తన 'థ్రెడ్స్' ఆప్ లో చేసిన ఒక పోస్ట్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు. " ఎవరు అంత బిజీగా ఉండరు. అది వారి వారి ప్రాముఖ్యతను బట్టి ఉంటుంది. ఒకవేళ అవతలి వ్యక్తికి నువ్వు ఇష్డమైతే, వాళ్ళు కచ్చితంగా నీకు మెసెజ్ గానీ కాల్ గానీ చేస్తారు. ఇందులో క్షమించేది, అబద్ధాలు చెప్పేది, హార్ట్ బ్రేక్ అవ్వడమనేది.. అంటూ ఏమీ ఉండవు" అని అర్జున్ కళ్యాణ్ ఆ పోస్ట్ లో చెప్పాడు. అయుతే ఈ పోస్డ్ శ్రీసత్య కోసమే చేసినట్టున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ పోస్ట్ కి విశేష స్పందన లభిస్తుంది.