Read more!

English | Telugu

గుప్పెడంత మనసు సీరియల్ లో సరికొత్త ట్విస్ట్.. రిషికి ఏంజిల్ లవ్ ప్రపోజల్?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ అత్యంత ప్రేక్షకాధారణ పొందుతూ రేటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది. అయితే ఈ సీరియల్ గత కొన్నిరోజులుగా రోజుకొక ట్విస్ట్ తో ముందుకు సాగుతుంది. స్క్రీన్ మీద రిషి, వసుధారల లవ్ స్టోరీకి ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. అయితే ఇందులో  రిషి మ్యానరిజంకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని అనడంలో ఆశ్చర్యం లేదు. రిషి, వసుధారల లవ్ స్టోరీని ఫ్యామిలీ మొత్తం ఇష్టపడతారు. కాగా ఈ సీరియల్ ఇప్పుడు ఎమోషనల్ గా మారిపోయింది. ఈ మధ్య గుప్పెడంత మనసు సీరియల్ టైమింగ్ స్లాట్ చేంజ్ పై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. స్లాట్ టైమింగ్ చేంజ్ చెయ్యొద్దంటూ పెద్ద ఎత్తున మా టీవీ యాజమాన్యంకి రిక్వెస్ట్ చేశారు. అయితే గుప్పెడంత మనసు సీరియల్ ప్రోమోలకి కామెంట్ సెక్షన్ లో ఫ్యాన్స్ ఎమోషనల్ కామెంట్స్ చేస్తుంటారు.

అయితే తాజాగా గుప్పెడంత మనసు సీరియల్ రైటర్ చేంజ్ అయ్యాడు. అలాగే ఈ సీరియల్ టైమింగ్ స్లాట్ కూడా చేంజ్ అయింది. అయినా రేటింగ్ మాత్రం తగ్గలేదు. ఇదంతా శైలేంద్ర ఎంట్రీ వల్లే జరిగిందంటూ అతడిపై ట్రోల్స్ కూడా చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సీరియల్ లో కథని కొన్ని రోజులు ముందుకు తీసుకెళ్లారు మేకర్స్. ఆ తర్వాత రిషి అందరికి దూరంగా వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.

విశ్వనాథ్, అతని కూతురు ఏంజిల్ తో కలిసి ఉంటున్నాడు రిషి. ఈ మధ్య వసుధార కూడా గాయాలు అవడంతో రిషి, విశ్వనాథ్, ఏంజిల్ ఇంటికి వస్తుంది. అయితే రానున్న ఎపిసోడ్‌లో రిషికి ఏంజిల్ లవ్ ప్రపోజ్ చేస్తుందని తెలుస్తుంది. దాంతో రిషి, వసుధార ఇద్దరు షాక్ అవుతారు. మరి ఏంజిల్ ప్రపోజల్ ని రిషి అంగీకరిస్తాడా?  ఏంజిల్ కి, వసుధార అసలు నిజం చెప్పనుందా? తెలియాలంటే ఈ సీరియల్ లో తర్వాత జరిగే ఎపిసోడ్స్ ని మిస్ అవ్వకూడదని అర్థమవుతుంది.