Read more!

English | Telugu

పవన్ కళ్యాణ్ దేవుడికంటే ఎక్కువ నాకు...కనిపిస్తే కాళ్ళ మీద పడతాను

తనకు పవన్ కళ్యాణ్ అంటే దేవుడి కంటే ఎక్కువ అని చెప్పాడు యాదమ్మ రాజు. నీతోనే డాన్స్ శనివారం ఎపిసోడ్ లో యాదమ్మ రాజు-స్టెల్లా ఇద్దరూ కలిసి ఈగ మూవీలో సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మ్ చేసారు. ఐతే ఆ సాంగ్ కి వీళ్ళ డాన్స్ కి పెద్దగా మ్యాచ్ కాలేదు. జడ్జెస్ కి కూడా పెద్దగా నచ్చలేదు. స్కూల్ లో జరిగే ఫంక్షన్ డ్రామాలా ఉందంటూ కామెంట్ చేశారు. ఇకపోతే మిగతా కంటెస్టెంట్ జోడీస్ మాత్రం చాలా తక్కువ మార్క్స్ ఇచ్చారు. యాదమ్మ రాజు చాలా ఫీలవుతూ సైలెంట్ గానే ఇచ్చిన మార్క్స్ ని యాక్సెప్ట్ చేసాడు. ఈ వారం వీళ్లకు, అంజలి జంటకు మధ్య జరిగిన మాటల యుద్ధంతో యాదమ్మ రాజు కొంచెం ఫీలైనట్టే కనిపించాడు.

అందుకే ప్రతీ ఎపిసోడ్ లో హుషారుగా ఉండే రాజు ఈ వారం చాలా డల్ గా డాన్స్ చేస్తూ కనిపించాడు. ఇక ఆ మూడ్ నుంచి వాళ్ళను బయటకు తేవడానికి శ్రీముఖి ట్రై చేసింది వాళ్ళ జీవితంలో ఫ్యాన్ మోమెంట్ ఏమిటి అని అడిగింది. "నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఆయన్ని కలిసే ఛాన్స్ రాలేదు. ఆయన నాకు దేవుడి కంటే ఎక్కువ. మూవీస్ పరంగా కన్నా ఆయన చేసే పనులు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. జానీ సినిమాకు ఫస్ట్ డే ఐదు రూపాయల టికెట్ పెట్టుకుని వెళ్లి మూవీ చూసా. అప్పటికి నాకు ఏమీ తెలియదు. ఇక అప్పటినుంచి  నేను ఊహించుకుంటూనే ఉంటాను" అని చెప్పాడు రాజు. "సడెన్గా పవన్ కళ్యాణ్ నీ ముందుకు వస్తే ఎం మాట్లాడతావ్ " అని అడిగింది శ్రీముఖి " ఎం మాట్లాడను, ఆయన కాళ్ళ మీద పడతాను" అని తన మనసులో పవన్ కళ్యాణ్ గురించి ఉన్న అభిప్రాయాన్ని చెప్పేసాడు. పవన్ కళ్యాణ్ అంటే చాలు యూత్ లో ఒక అట్రాక్షన్, అడ్మిరేషన్ అనేవి ఉన్నాయి. ఆయన్ని అభిమానించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో యాదమ్మ రాజు కూడా ఉన్నాడు.