English | Telugu

కావ్య అవసరాల కోసం డబ్బులు ఇవ్వాలనే రాజ్ ప్లాన్ నెరవేరుతుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -144 లో.. అప్పుని కళ్యాణ్ పోలీస్ స్టేషన్ నుండి విడిపిస్తాడు. అందరు కలిసి కనకం ఇంటికి బయల్దేరుతారు. కళ్యాణ్ కి కనకం కాఫీ చేస్తుంది. ఇది తీసుకొని వెళ్లి కళ్యాణ్ కి ఇవ్వమని అప్పుకి కాఫీ ఇస్తుంది కనకం. నాకు ఇవన్నీ సెట్ కావు.. నాకేమైనా పెళ్లి చూపులు జరుగుతున్నాయా? వెళ్లి నువ్వే ఇవ్వమని అప్పు అంటుంది. అయిన వినకుండా కనకం కాఫీని అప్పుతో పంపిస్తుంది. అప్పు కాఫీ తీసుకొని వస్తుంటే కళ్యాణ్ షాక్ అవుతాడు. ఏంటి నువ్వు తీసుకోని వస్తున్నావా అని కళ్యాణ్ అంటాడు. ఆ తరువాత కళ్యాణ్, అప్పు ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు.

మరొక వైపు తన దగ్గర కొంత డబ్బు ఉంచుకోమని ఎలా చెప్పాలని చేతిలో డబ్బులు పట్టుకొని రాజ్ ఆలోచిస్తాడు. అప్పుడే కావ్య వస్తుంది. ఏంటి చేతిలో డబ్బులు.. మీ అమ్మా నేను చేసిన సాయానికి థాంక్స్ చెప్పింది. మీరు డబ్బుతో థాంక్స్ చెపుదాం అనుకుంటున్నారా? మానవత్వానికి వెల కడుతున్నారా అని కావ్య అనేసరికి.. ఇప్పుడు ఈ డబ్బు ఇస్తే ఇలాగే అనుకుంటుందని ఫోన్ లో రాజ్ వాళ్ళ బాబాయ్ తో మాట్లాడినట్లు మాట్లాడతాడు రాజ్. ఆ తర్వాత డబ్బు ఇక్కడ పెడుతున్నాను నీకు అవసరం ఉంటే యూజ్ చేసుకోమని కావ్యకి రాజ్ చెప్తాడు.

మరొక వైపు అప్పుకి తన ఫ్రెండ్ కాల్ చేసి రమ్మంటాడు. అప్పు వెళ్తుంటే కనకం అడ్డుపడుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్లి మళ్ళీ ఏ గొడవ పెట్టుకోకు నువ్వు అమ్మాయివనే విషయం మర్చిపోకని కనకం అంటుంది. "మనకు గుర్తుందా అప్పు అమ్మాయి అనే విషయం" అని కనకంతో అప్పు వాళ్ళ పెద్దమ్మ అంటుంది. తనకి పెళ్లి వయసు వచ్చింది. మనం దాని గురించి ఆలోచిస్తున్నామా అని అప్పు వాళ్ళ పెద్దమ్మ అంటుంది. నువ్వు అలాంటి విషయం ఇప్పుడు మాట్లాడకని అప్పు అంటుంది. ఆ తరువాత కనకం కళ్యాణ్ కి ఫోన్ చేసి కావ్యకి ఫోన్ ఇవ్వమంటుంది. అత్తారింట్లో తను ఎలా ఉందో కనకం కనుక్కుంటుంది. నేను బాగున్నాను అమ్మా.. ఏదైనా నేను ఇక్కడ చూసుకోగలనని కావ్య అంటుంది.

మరొక వైపు కావ్యకి బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించడానికి బ్యాంకు నుండి ఎగ్జిక్యూటివ్ ని ఇంటికి రమ్మంటాడు రాజ్. అతను ఇంటికి వస్తాడు. ఎక్కడ కావ్య కోసం రప్పించానని అందరికి తెలిస్తే ఏమైనా అనుకుంటారేమోనని అందరికి అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి రప్పించానని రాజ్ చెప్తాడు. ఒక్కొక్కరిగా అందరు తమ వివరాలని ఎగ్జిక్యూటివ్ కి చెప్తారు. కావ్య మాత్రం అక్కడ ఉండదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.