Read more!

English | Telugu

కనకం రీల్ ఫ్యామిలీని కలిసిన రియల్ ఫ్యామిలీ!

నీప అలియాస్ కనకం.. ఈ పేరంటే స్డార్ మా టీవీ ప్రేక్షకులకు సుపరిచితమే. బుల్లితెర ధారావాహికల్లో టీఆర్పీలో నెంబర్ వన్ ర్యాంకింగ్ తో దూసుకెళ్తున్న స్టార్ మా టీవీ సీరియల్ "బ్రహ్మముడి". ఈ సీరియల్ కి ఒక ప్రత్యేక క్రేజ్ ఉంది. ఎందుకంటే ఈ సీరియల్ కథ, కథనం బాగుంటుంది. ఇందులో రాజ్, కావ్య, కనకం, స్వప్న, దుగ్గిరాల ఫ్యామిలీ ఇలా అందరు బాగా నటిస్తున్నారు. ప్రతీ పాత్రకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇందులోని క్యారెక్టర్స్ అన్నీ కూడా సమాజంలో ప్రస్తుతం ‌ఉన్న స్థితిగతులను ప్రతిబింబించేలా ఉండటంతో ప్రేక్షకులు ఈ సీరియల్ కి బ్రహ్మరథం పడుతున్నారు.

ఇందులో కనకం-కృష్ణమూర్తి ల కుటుంబాన్ని మధ్యతరగతి వాళ్ళలాగా చూపించాడు డైరెక్టర్. బ్రహ్మముడి సీరియల్ లో ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్ళు ఉండగా.. ఒక్కో కూతురికి ఒక్కో శైలి ఉంది. అయితే కనకం క్యారెక్టర్ ని అద్భుతంగా మలిచాడు. ఒక మధ్యతరగతి తల్లి తన కూతురి కోసం కనే కలలను ఇందులో చక్కగా చూపిస్తున్నాడు. కనకం తన కూతుళ్ళకు గొప్పింటి కోడళ్లను చెయ్యాలని అనుకుంటుంది. బ్రహ్మముడి సీరియల్ లో నీప శివ అలియాస్ కనకం.. ఈ మద్యతరగతి తల్లి పాత్రలో ఒదిగిపోయింది. కనకం మంచి ఫ్యామిలీ ఎమోషనల్ ని చూపించడమే కాకుండా కామెడీ వెర్షన్ తో ఆకట్టుకుంటుంది. కనకంకి తెలుగులో బ్రహ్మముడి మొదటి సీరియల్ అయినప్పటికి ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. 

కనకం తాజాగా తనకంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ ని క్రియేట్ చేసి అందులో రెగ్యులర్ గా వీడియోలు చేస్తూ తన ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది. "ఫ్యామిలీతో కొత్త ప్రపంచానికి వెళ్ళామంటూ" ఒక వ్లాగ్ చేసింది కనకం(నీప శివ). అక్కడ అక్వేరియంలో ఫ్యామిలీతో కలసి ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత చెన్నైలోని ఒక ఎగ్జిబిషన్ కి ఫ్యామిలీతో కలిసి వెళ్ళింది.‌ అక్కడ సరదాగా పిల్లలతో కలిసి ఆడుతూ ఎంజాయ్ చేసింది. ఇలా ఖాళీ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి అవుటింగ్ కి వెళ్ళి అక్కడ వ్లాగ్ లు చేస్తూ.. తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటుంది కనకం. బ్రహ్మముడిలోని కనకం రీల్ ఫ్యామిలీని, బయట ఉన్న తన రియల్ ఫ్యామిలీ కలవడంతో ఆ అనుభవాలను పంచుకుంది కనకం. ఈ ఫ్యామిలీ మీట్ లో విక్రమాదిత్యతో పాటు హమీద కుడా ఉన్నారు.  నీప తన కుటుంబాన్ని, సీరియల్ లోని కనకం కుటుంబాన్ని కలిసినట్టుగా చేసిన ఈ వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా అత్యధిక వీక్షకాధరణ లభిస్తుంది.