Read more!

English | Telugu

ఫస్ట్ టైం చిరంజీవి గారితో ప్రైవేట్ జెట్ లో ట్రావెల్ చేశా!

నీతోనే డాన్స్ ఈ వీక్ ఎపిసోడ్ లో ఎలిమినేషన్స్ రౌండ్ కూడా ఉంది. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ఎనిమిది జంటల నుంచి ఒక జంట కూడా ఎలిమినేట్ ఐపోయింది. ఐతే రాధా ఇక్కడ శ్రీముఖికి ఒక ట్విస్ట్ ఇచ్చారు. "అందరూ తమ తమ ఫ్యాన్ మూమెంట్స్ ని చెప్పేసారు కానీ ఒక్కరు మాత్రం చెప్పలేదు, చెయ్యలేదు, చూపించలేదు" అని రాధ అనేసరికి "శ్రీముఖి" అని కోరస్ పాడారు సదా, తరుణ్ మాష్టర్. ఇక రాధ సీట్ లోంచి లేచి స్టేజి మీదకు శ్రీముఖి దగ్గరకు వచ్చారు. "నేను ఒక ఫోటో పంపించాను కదా..చూపిస్తారా అని రాధ అడిగేసరికి చిరంజీవితో కలిసి జాటర్ ఫ్లయిట్ లో కూర్చున్న శ్రీముఖి ఫోటోని ప్లే చేశారు. "అందరూ తమ తమ ఫ్యాన్ మూమెంట్స్ చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది కాని ఈ ఫోటో చూస్తే మాత్రం నాకు చాలా కోపం వస్తోంది.

నా చిరు గారిని నేను కలిసినప్పుడు..నీకు తెలుసా శ్రీముఖి...మన డాన్స్ షోలో ఉన్నారు కదా ..తనకు నేనంటే చాలా ఇష్టం..నేనేదో చాలా ఇష్టం అనుకుని అక్కడికి వెళ్తే నీ గురించి మాట్లాడారు" అని స్వీట్ గా శ్రీముఖి మీద కోప్పడ్డారు రాధ. "హబ్బా ఇది చాలు ఈ జీవితానికి. ఐ లవ్ హిం మ్యాడ్ ..రాధమ్మ థ్యాంక్యూ సో మచ్ ఈ మూమెంట్ ని మళ్ళీ గుర్తుచేసినందుకు..నా జీవితంలో ఎన్నో ఫ్లయిట్స్ ఎక్కాను కానీ కానీ ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ జెట్ లో చిరంజీవి గారితో కలిసి ట్రావెల్ చేసాను..నేను చిరంజీవి గారు, కెమెరా క్రూ..ఆయన్ని అలా చూస్తుండి పోయాను రాధమ్మ..ఈ పిక్ గాడ్ ఫాదర్ మూవీ టైంలోది ..." అని చెప్పింది శ్రీముఖి. "ఆయన నీ గురించి చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పారు రాధా. "గాడ్ ఫాదర్" మూవీ టైంలో చిరు ప్రైవేట్ జెట్ లో శ్రీముఖి ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఇందులో చిరు లుక్ ని చూసిన శ్రీముఖి `ఐ లవ్యూ చిరంజీవి గారు.. ఈ లుక్‌లో మీరు చాలా హాట్‌గా ఉన్నారు..మిమ్మల్ని చూసి తట్టుకోలేపోతున్నాను` అంటూ శ్రీముఖి ఓపెన్‌గా ఓ కామెంట్ చేసేసరికి  చిరు సిగ్గుపడిపోయారు. అప్పట్లో శ్రీముఖి కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇక ఈ షో ఫైనల్ లో లీస్ట్ స్కోర్స్ తెచ్చుకున్న జంటలు యాదమ్మ రాజు-స్టెల్లా, సాగర్-దీప మధ్య డాన్స్ కాంపిటీషన్ జరిగింది. ఇక ఇందులో యాదమ్మ రాజు- స్టెల్లా జంట ఎలిమినేట్ అయ్యారు.