Read more!

English | Telugu

సుమ ఉంటే బీపీ టాబ్లెట్స్ అవసరం లేదు

సుమ అడ్డా షోకి త్వరలో రాబోయే గెస్టులతో జరిగిన షూటింగ్ ని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది సుమ. ఇక ఈ షోకి సింగర్ సునీత తన కొడుకు ఆకాష్ నటించిన మూవీ 'సర్కార్ నౌకరి' ప్రమోషన్స్ లో భాగంగా వచ్చారు. అలా షూటింగ్ గ్యాప్ లో సుమ-సునీత మధ్య చిన్న చిట్ చాట్ లాంటిది జరిగింది. 

డిఫరెంట్ కంటెంట్ తో ఈ మూవీ వస్తోంది.. చూడండి అని చెప్పింది సుమ. "సుమ నువ్వు నా సెంటిమెంట్.. సుమ ఉంటే బీపీ టాబ్లెట్స్ అవసరమే లేదు" అంటూ తన ఫ్రెండ్ గురించి పొగిడేశారు సునీత. "సుమకి మరి..ఈ టాబ్లెట్స్ అస్సలే అవసరం లేదు..నో షుగర్, నో బీపీ, నో కొలెస్ట్రాల్..హ్యాపీగా మన ఇద్దరం ఇలాగే ఉండాలి  " అని చెప్పింది సుమ. "అసలు టైం గడుస్తున్నా కూడా ఇలాగే ఉండిపోయాం. మన వయసు కూడా పెద్దగా పెరగడం లేదు" అని సుమ కామెడీగా అనేసరికి "మన పిల్లలు మాత్రం తాటి చెట్లలా పెరిగారు" అంది సునీత. "మన జీవితాలు పార్లల్ గా వెళ్తున్నాయి. ప్రతీ విషయంలో ఎవరో ఒకరం ముందు వెనకగా వెళ్తూనే ఉన్నాం...మా అబ్బాయి సినిమా వచ్చేసింది.. ఇక మీ అబ్బాయి రోషన్ ఫిలిం రావాలి..."అని సునీత అనేసరికి "ఫస్ట్ కోడలు మాత్రం నీకే వస్తుందిలే" అంది సుమ సెటైరికల్ గా. తర్వాత  షూటింగ్ టైములో  ఏ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేస్తుందో చూపించింది. ఇక ఈ షూటింగ్ మొత్తం ఆకలి ఆకలి అంటూ అరుస్తూనే ఉంది సుమ...బ్రేక్ కావాలి బ్రేక్ కావాలి అంటూ ఫైనల్ గా టీం మొత్తాన్ని తీసుకెళ్లి ఫుల్ గా ఫుడ్డు లాగించేసింది. 

సుమ, సునీత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్..సుమ ఇండస్ట్రీకి ముందుగా వస్తే ఆ తర్వాత సునీత ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి వీళ్ళ జర్నీ ఇప్పటివరకు అలా కొనసాగుతూనే వస్తుంది. యాంకర్ సుమ  ఎక్కడ ఉంటే అక్కడ మాటల ఊట ...సింగర్  సునీత ఎక్కడ ఉంటే అక్కడ పాటల తోట.