Goru Chikkudu Kaya Coconut Curry
గొరు చిక్కుడు - కొబ్బరి కూర
కావలసిన పదార్ధాలు:-
గోరుచిక్కుడు కాయలు
Cluster Beans - పావుకిలో
కొబ్బరి - అర చిప్ప
పసుపు - చిటికెడు
నూనె - 3 స్పూన్లు
కారం - తగినంత
ఉప్పు - తగినంత
తయారుచేసే విధానం:-
కొబ్బరి చిప్ప తురుముకుని కొబ్బరి తురుముని ప్రక్కకు వుచుకోవాలి. గోరుచిక్కుడు కాయలు ఈనెలు తీసి అర అంగుళం అంత ముక్కలుగా తరుక్కొని తగినత ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఉడికించి వార్చుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక తాలింపు వెయ్యాలి. ఇందులో మసాలా కావాలనుకుంటే 1 1/4 స్పూన్ ధనియాలపొడి, ముప్పావు స్పూను ఆమ్ చూర్ పొడి వేసుకోండి. ఇప్పుడు పచ్చికొబ్బరి తురుము, కారం వేసి మూత పెట్టి 5 ని" మగ్గనివ్వండి. మధ్యలో ఒకసారి కలపాలి. తరువాత దించేసుకోవాలి. వేడిమీద తింటే చాలా రుచిగా వుంటుంది.
Recommended for you
