Read more!

కడాయి పన్నీర్ మసాలా

 

కడాయి పన్నీర్ మసాలా !

కావాల్సిన పదార్థాలు:

పన్నీర్ - 200 గ్రాములు

క్యాప్సికమ్ - 1 (సన్నగా తరిగినవి)

ఉల్లిపాయ - 1

టొమాటో ప్యూరీ - 1 కప్పు

క్రీమ్ - 1 టేబుల్ స్పూన్

కొత్తిమీర - కొద్దిగా

అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1/2 tsp

నల్ల మిరియాలు - 1 టేబుల్ స్పూన్

ఫ్లేక్స్‌ - 1 చిన్న ముక్క

లవంగాలు - 2

జీలకర్ర - 1/2 tsp

పసుపు - 1/4 tsp

ధనియాలు- 1 టీస్పూన్

గరం మసాలా - 1/2 tsp

ఉప్పు - రుచి సరిపడ

వెన్న - కొద్దిగా

తయారీ విధానం:

కడాయి పన్నీర్ మసాలా తయారు చేసే ముందు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో మిరియాలు,జీలకర్ర, ధనియాలు, లవంగాలు వేసి వేయించుకోవాలి.

చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తర్వాత ఒక బాణలిలో 1 టేబుల్ స్పూన్ వెన్న వేసి, పన్నీర్,క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకోవాలి.

వీటిని ఒక ప్లేటులోకి తీసుకుని పక్కనపెట్టుకోవాలి.

అదే బాణాలిలో వెన్న వేసి అందులో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోధుమరంగులోకి వచ్చేంత వరకు వేయించాలి.

తర్వాత టొమాటో ప్యూరీ వేయాలి. వీటన్నింటిని రెండు నిమిషాల పాటు ఉడికించాలి.

తర్వాత కొంచెం పసుపు వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలను వేసి కలపాలి.

తర్వాత కావాల్సినంత నీళ్లు పోసి..రెండు నిమిషాల పాటు ఉడికించాలి.

తర్వాత ఉప్పు, గరంమసాలా, వేయించిన క్యాప్సికప్, పన్నీర్ ముక్కలు వేసి కలపాలి.

కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత క్రీమ్ వేసి తక్కువ మంట మీద రెండు నిమిషాలు ఉడించాలి.

తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రుచికరమైన కడాయి పన్నీర్ మసాల సిద్ధమవుతుంది.