Read more!

మస్త్ మస్త్ మలై పన్నీర్ కర్రీ

 

మస్త్ మస్త్ మలై పన్నీర్ కర్రీ..!!

కావాల్సిన పదార్థాలు:

పన్నీర్ -200గ్రాములు

ఉల్లిపాయలు-3

వెల్లుల్లి రెబ్బలు-10

అల్లం -అంగుళం

ముక్క పసుపు -అరటీస్పూన్

పచ్చిమిర్చి-2

బ్లాక్ పెప్పర్ -హాఫ్ టీ స్పూన్

జీలకర్ర- హాఫ్ టీ స్పూన్

బాదం-4

జీడిపప్పు-4

ఫ్రెష్ క్రీమ్ -ఒకటిన్నర కప్పు

ఉప్పు - రుచికి సరిపడ

కసూరిమేతి

తయారీ విధానం:

జీడిపప్పు, బాదంపప్పులను రాత్రంతా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. వాటిని గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. నాన్ స్టిక్ పాన్ కొంచెం నూనె వేసి పన్నీర్ ముక్కలను గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. వాటిపై కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపండి. తర్వాత డ్రైఫ్రూట్ ఫేస్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత కప్పు నీళ్లు పోయాలి. మిశ్రమం ఉడకడుతుండగా..మంట తగ్గించి పన్నీర్ ముక్కలు, గరం మసాల పొడి, కసూరి మెంతి ఆకులు వేయాలి. 4 లేదా 5 నిమిషాల తర్వాత గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు అందులో ఫ్రెష్ క్రీమ్ వేయాలి. క్రీమ్ వేసిన తర్వాత గ్రేవీని స్టవ్ పై ఎక్కవసేపు ఉంచకూడదు. 5 నిమిషాల్లోపు కూరని కిందకి దించి వేరే బౌల్లోకి సిద్ధం చేసుకుని కొత్తమీరతో గార్నిష్ చేస్తే మలై పన్నీర్ కరీ రెడీ.