ఎల్టీటీఈ ప్రభాకరన్ కు తమిళనాడు సీఎం నివాళి? రాహుల్ ను లాగిన బీజేపీ!

Publish Date:May 20, 2026

Advertisement

తమిళనాడు రాజకీయాల్లో  పెను సంచలనం చోటుచేసుకుంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ఇటీవలి ఎన్నికల్లో  విజయం సాధించి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిషేధిత ఎల్టీటీఈ ( వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ వర్ధంతిని పురస్కరించుకుని సీఎం విజయ్ ఆయనకు నివాళులర్పించడం రాజకీయ దుమారానికి దారితీసింది.

ముల్లివైకల్ విషాద దినాన్ని పురస్కరించుకుని సీఎం విజయ్ తన  ఎక్స్  ట్విట్టర్  ఖాతాలో ఒక భావోద్వేగ భరితమైన పోస్ట్‌ను షేర్ చేశారు.  శ్రీలంక అంతర్యుద్ధం ముగింపు దశలో ముల్లివైకల్ ప్రాంతంలో మరణించిన తమిళ సోదరుల త్యాగాలను తమ గుండెల్లో పదిలంగా ఉంచుకుంటామని విజయ్ పేర్కొన్నారు. సముద్రం అవతల ఉన్న తమ తమిళ బంధువుల హక్కుల కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటామంటూ  విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలపై  బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది.

ఈ నేపథ్యంలోనే కమలనాథులు  కాంగ్రెస్ పార్టీని, మరీ ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేత,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎల్టీటీఈ అధినేతను స్మరించుకుంటూ తమిళనాడు ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటనలు చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని  డిమాండ్ చేసింది.  కేవలం అధికారం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసమే  కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విజయ్ ప్రకటనపై నోరుమెదపడం లేదని బీజేపీ సీనియర్ నేత నారాయణన్ తిరుపతి ఆరోపించారు.

ఇండియాలో బ్యాన్ అయిన  ఒక ఉగ్రవాద సంస్థకు మద్దతుగా ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి నివాళులర్పించడం దేశ సార్వభౌమత్వానికి గొడ్డలిపెట్టుగా బీజేపీ అభివర్ణిస్తోంది. రాజీవ్ గాంధీ ప్రాణాలను బలిగొన్న శక్తులతో తమిళనాడులోని ప్రస్తుత ప్రభుత్వం పరోక్షంగా చేతులు కలుపుతోందని..  దీనికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం అత్యంత విచారకరమని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.

మరోవైపు ఈ  విమర్శలపై ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ  దీటుగా స్పందించింది. ముల్లివైకల్ అనేది శ్రీలంక అంతర్యుద్ధంలో వేలాది మంది అమాయక తమిళ ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఒక చారిత్రక విషాదమని..  ఆ మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన   తమిళ సోదరులకు నివాళులర్పించడం మానవీయ కోణంలో చేసిన పనేనని టీవీకే పేర్కొంది. దీనిని రాజకీయం చేయడం తగదని బీజేపీకి హితవు పలికింది.  

By
en-us Political News

  
ఇప్పటివరకు తాము ఎన్నో విషయాలను ఓపికగా భరించామని, అయితే ఇకపై సహించే ప్రసక్తే లేదని జనసేన
డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అంతర్గత సమీక్షా సమావేశంలో శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రముఖులకు తాజాగా పద్మ పురస్కారాలు దక్కాయి.
రాజకీయాల్లోకి తాను అన్నీ కోల్పోవడానికి సిద్ధపడే వచ్చానని, అంతేగానీ ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవడానికి సిద్ధంగా లేనని
ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 ఎపీ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంది.
అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు.
మహిళా చిన్న తరహా వ్యాపారులపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరు పరిచారు
2034 నాటికి తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు ప్రచారం..
హైదరాబాద్ నగర పట్టణ రవాణా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
విజయవాడ వేదికగా సోమవారే నిర్వహించిన ప్రతిష్టాత్మక వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సరికొత్త దిశను చూపించింది. ఈ సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు భాగస్వామ్యులయ్యారు.
ద్రవిడ రాజకీయల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఇంగ్లండ్ మాజీ లెజెండరీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన ఒక ప్రసిద్ధ యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్న వైభవ్.. అక్కడ పీటర్సన్ విసిరిన ఊహించని సవాల్‌ను స్వీకరించాడు. ఆ షోలో వైభవ్ సూర్యవంశీ పాతిక బంతుల్లోనే 100 పరుగులు బాది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.