చంద్రబాబు జైలుకెళ్లినప్పుడే సీఎం అయ్యేవాడిని : పవన్ కల్యాణ్

Publish Date:May 25, 2026

Advertisement

 

రాజకీయాల్లోకి తాను అన్నీ కోల్పోవడానికి సిద్ధపడే వచ్చానని, అంతేగానీ ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవడానికి సిద్ధంగా లేనని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కొన్ని వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాల వేదికలుగా జరుగుతున్న వ్యక్తిగత విమర్శలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమపై వ్యక్తిగత దాడికి దిగితే తాము కూడా అదే స్థాయిలో వ్యూహాత్మక ఎదురుదాడి చేస్తామని వైరి వర్గాలను హెచ్చరించారు.

రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన జనసేన అంతర్గత నేతలు, శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికగా కొందరు పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఎక్కడ ఎలాంటి వివాదాలకు దిగుతారో మీ ఇష్టం, దేనికైనా నేను సిద్ధం. నిర్ణయం మీకే వదిలేస్తున్నా.. నన్ను మాత్రం అనవసరంగా రెచ్చగొట్టవద్దు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ విశ్లేషణల పేరుతో కొందరు పనిగట్టుకుని చేస్తున్న పిచ్చి లాజిక్కులను పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ఎండగట్టారు. మాజీ సీఎం జగన్‌ను జైలుకు పంపాలని తాను కోరుకుంటున్నట్లు కొందరు ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. జగన్ జైలుకు వెళ్తే తనకు వచ్చే రాజకీయ లాభం ఏమీ లేదన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సమయంలో తాను స్వార్థంతో ఆలోచించి ఉంటే అప్పుడే సీఎం అయ్యేవాడినని గుర్తుచేశారు.

తన రాజకీయ సిద్ధాంతాలు ఎప్పుడూ విభిన్నంగా ఉంటాయని జనసేనాని స్పష్టం చేశారు. శత్రువు అన్ని రకాలుగా బలంగా ఉన్నప్పుడే తాము దెబ్బకొడతామని, అతడు బలహీనపడినప్పుడు కాదని పేర్కొన్నారు. విశ్లేషణలు చేసే వారిని తాము ప్రశ్నిస్తే.. వెంటనే కొందరు కులం కార్డును తెరపైకి తీసుకురావడం ఏంటని నిలదీశారు. తమ మితిమీరిన సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని, మౌనం వెనుక బలమైన వ్యూహం దాగి ఉందన్నారు.

పార్టీ నడవాలంటే పటిష్టమైన క్రమశిక్షణ ఎంతో అవసరమని, అప్పుడే కూటమి ప్రభుత్వంలో జనసేనకు సరైన గుర్తింపు, బలం లభిస్తుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పార్టీలో పదవులు దక్కించుకున్న కొందరు నేతలు ఉత్సాహంగా పనిచేయడం మానేసి పెద్దమనుషుల తరహాలో మౌనంగా ఉండిపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం పదవుల కోసమే అనుకుంటే జనసేనలో కొనసాగాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.

మరోవైపు కూటమి ప్రభుత్వం సజావుగా సాగడం కోసం, రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం తాను కొన్ని విషయాల్లో సర్దుకుపోతున్నానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అర్ధరాత్రి వేళ కూడా జనసేన జెండా పట్టుకుని చిన్నారితో నిలబడిన ఒక మహిళా కార్యకర్తను చూసినప్పుడు పార్టీ అసలైన బలం ఏంటో తనకు అర్థమైందని భావోద్వేగానికి గురయ్యారు. పోరాటమే జనసేన యొక్క మూల సిద్ధాంతమని ఆయన పునరుద్ఘాటించారు.

రాబోయే రోజుల్లో సోషల్ మీడియా వేదికగా జరిగే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు జనసేన సోషల్ మీడియా వింగ్‌ను మరింత బలోపేతం చేయాలని పార్టీ భావిస్తోంది. విమర్శకులకు దీటుగా సమాధానం ఇస్తూనే.. కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పవన్ కల్యాణ్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. రానున్న కాలంలో జనసేనాని మరింత దూకుడుగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి.

By
en-us Political News

  
ఇప్పటివరకు తాము ఎన్నో విషయాలను ఓపికగా భరించామని, అయితే ఇకపై సహించే ప్రసక్తే లేదని జనసేన
డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అంతర్గత సమీక్షా సమావేశంలో శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రముఖులకు తాజాగా పద్మ పురస్కారాలు దక్కాయి.
ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 ఎపీ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంది.
అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు.
మహిళా చిన్న తరహా వ్యాపారులపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరు పరిచారు
2034 నాటికి తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు ప్రచారం..
హైదరాబాద్ నగర పట్టణ రవాణా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
విజయవాడ వేదికగా సోమవారే నిర్వహించిన ప్రతిష్టాత్మక వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సరికొత్త దిశను చూపించింది. ఈ సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు భాగస్వామ్యులయ్యారు.
ద్రవిడ రాజకీయల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఇంగ్లండ్ మాజీ లెజెండరీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన ఒక ప్రసిద్ధ యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్న వైభవ్.. అక్కడ పీటర్సన్ విసిరిన ఊహించని సవాల్‌ను స్వీకరించాడు. ఆ షోలో వైభవ్ సూర్యవంశీ పాతిక బంతుల్లోనే 100 పరుగులు బాది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణలో ధాన్యం, మొక్కజొన్న పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.