దారిన పోయే వాళ్లు రాళ్లు వేస్తే చూస్తూ ఊరుకోం...అంతు చూస్తాం : పవన్ కల్యాణ్

Publish Date:May 25, 2026

Advertisement

 

ఇప్పటివరకు తాము ఎన్నో విషయాలను ఓపికగా భరించామని, అయితే ఇకపై సహించే ప్రసక్తే లేదని జనసేన అధినేత,  ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దారిన పోయే దానయ్యలు వచ్చి జనసేన పార్టీపై విమర్శల రాళ్లు వేస్తామంటే ఊరుకునేది లేదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. దేనికైనా ఒక హద్దు ఉంటుందని, అనవసరంగా తమను రెచ్చగొట్టవద్దంటూ ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీపై వస్తున్న కొన్ని ప్రచారాలపై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయాలని తాను అమిత్ షాను కోరినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఒక పార్టీ నేత జైలుకు వెళ్తే జనసేన బలపడుతుందని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని ఎద్దేవా చేశారు. తాము కేంద్ర పెద్దలను కలిసింది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమేనని ఆయన తేల్చిచెప్పారు.

అమిత్ షాతో జరిగిన అంతర్గత చర్చల వివరాలు మూడో వ్యక్తికి ఎలా తెలుస్తాయని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వ్యవస్థలను అవమానించేలా ఇటువంటి దుష్ప్రచారాలు చేయడం తగదన్నారు. తమ సొంత ఎదుగుదల కోసం ఇతరులను వాడుకోవాల్సిన అవసరం జనసేనకు లేదని, కర్మ ఎవరినీ వదిలిపెట్టదని హెచ్చరించారు. ఈ ప్రచారాలపై మిత్రపక్షమైన ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఎందుకు నోరు విప్పడం లేదని ఆయన నిలదీశారు.

మరోవైపు సొంత పార్టీ నేతల తీరుపై కూడా ఉపముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జనసేనకు శత్రువులు బయట లేరని, పార్టీ లోపలే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం పదవులు దక్కగానే చాలా మంది నాయకులు చప్పబడిపోయారని, మెత్తగా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయకుండా, కష్టపడకుండా కేవలం పదవులకే పరిమితమయ్యే నాయకులు జనసేనకు అవసరం లేదని తేల్చిచెప్పారు.

తాను కేవలం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కోసం కాకుండా, రాష్ట్ర భవిష్యత్తు మరియు ప్రజా శ్రేయస్సు కోసమే కూటమిలో సర్దుకుపోతున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం మరియు కూటమి మధ్య ప్రస్తుతం కొన్ని చిన్నపాటి అంతర్గత సమస్యలు ఉన్న మాట నిజమేనని, అయితే అవి ఇంకా తారాస్థాయికి చేరుకోలేదని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కల్యాణ్ ఈ స్థాయిలో సొంత నేతలపై, మిత్రపక్షాల వ్యవహారశైలిపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. జనసేనాని చేసిన ఈ హెచ్చరికలతో రాబోయే రోజుల్లో కూటమిలోని పార్టీల మధ్య అంతర్గత సమన్వయం మరింత పెరిగేలా చర్యలు తీసుకుంటారా లేదా అనే అంశంపై రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

By
en-us Political News

  
డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అంతర్గత సమీక్షా సమావేశంలో శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రముఖులకు తాజాగా పద్మ పురస్కారాలు దక్కాయి.
రాజకీయాల్లోకి తాను అన్నీ కోల్పోవడానికి సిద్ధపడే వచ్చానని, అంతేగానీ ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవడానికి సిద్ధంగా లేనని
ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 ఎపీ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంది.
అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు.
మహిళా చిన్న తరహా వ్యాపారులపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరు పరిచారు
2034 నాటికి తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు ప్రచారం..
హైదరాబాద్ నగర పట్టణ రవాణా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
విజయవాడ వేదికగా సోమవారే నిర్వహించిన ప్రతిష్టాత్మక వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సరికొత్త దిశను చూపించింది. ఈ సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు భాగస్వామ్యులయ్యారు.
ద్రవిడ రాజకీయల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఇంగ్లండ్ మాజీ లెజెండరీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన ఒక ప్రసిద్ధ యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్న వైభవ్.. అక్కడ పీటర్సన్ విసిరిన ఊహించని సవాల్‌ను స్వీకరించాడు. ఆ షోలో వైభవ్ సూర్యవంశీ పాతిక బంతుల్లోనే 100 పరుగులు బాది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణలో ధాన్యం, మొక్కజొన్న పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.