అనంత శ్రీరామ్ స్థలంపై వైసీపీ నేతల కబ్జా కన్ను
Publish Date:May 25, 2026
Advertisement
వైసీపీ కండువా కప్పుకోగానే.. ఎలాంటి సీనియర్ నేతలకైనా, లేకపోతే వారి వారసులకైనా ‘భూ కబ్జా’లు ఫ్యాషన్‌గా మారిపోతాయనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. గత ఎన్నికలకు ముందు అంటే 2024లో కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ జనసేనను వీడి వైసీపీలో చేరారు. ఇప్పుడా వైసీపీ నేతపై భూ ఆక్రమణ ఆరోపణలతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఫిర్యాదు చేసింది కూడా ఆషామాషీ వ్యక్తి కాదు. ప్రముఖ సెలబ్రిటీ, సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం, దొడ్డిపట్ల గ్రామంలోని తమ ఇంటి ముందు ఉన్న ఐదు సెంట్ల తమ కుటుంబ ఉమ్మడి స్థలాన్ని మాజీ మంత్రి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ ఆక్రమించారంటూ అనంత శ్రీరామ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ స్థల వివాదం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని అనంత శ్రీరామ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ, సూర్యప్రకాష్ తమను నిరంతరం బెదిరింపులకు గురిచేస్తూ తీవ్ర మానసిక హింసకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదం కారణంగా దొడ్డిపట్లలో ఉంటున్న తన వృద్ధులైన తల్లిదండ్రుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వారికి తక్షణమే రక్షణ కల్పించాలని అనంత శ్రీరామ్ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారిలను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన అధికారులను కోరారు. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ‘పెద్ది’ సినిమాలోని పాటలు ట్రెండ్‌ని షేక్ చేస్తున్నాయి. ‘రై రై రారా’ సాంగ్ ఇప్పటికే ఓ ఊపు ఊపేసింది. తాజాగా వచ్చిన స్పెషల్ సాంగ్ ‘హల్లల్లల్లో’ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ దిశగా వెళుతోంది. ఈ పాటలో రామ్ చరణ్ గ్రేస్‌ఫుల్ డ్యాన్స్‌కు అంతా ఫిదా అవుతున్నారు. అంతటి సెలబ్రిటీల విషయంలో కూడా వైసీపీ నేతలు నిర్లజ్జగా వ్యవహరిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.
http://www.teluguone.com/news/content/anantha-sriram-land-is-occupied-36-220848.html





