గ్లోబల్ నాలెడ్జ్ ఎకానమీగా ఏపీ.. చంద్రబాబు

Publish Date:May 25, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, సాంకేతికంగా ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో చిప్ నుంచి షిప్ వరకు  అనే నినాదంతో నవ్యాంధ్రప్రదేశ్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. కేవలం భారీ పరిశ్రమలకే పరిమితం కాకుండా..  రాష్ట్రంలోని ప్రతి ఇంటా ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే సంకల్పంతో అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగానే విజయవాడ వేదికగా సోమవారే (మే 25)నిర్వహించిన ప్రతిష్టాత్మక  వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సరికొత్త దిశను చూపించింది. ఈ  సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ  పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానక ర్తలు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు,  సాంకేతిక నిపుణులు భాగస్వామ్యులయ్యారు.

రాష్ట్రంలో పారిశ్రామిక వికేంద్రీకరణను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసి రికార్డు సృష్టించారు. గ్రామీణ,  పట్టణ ప్రాంతాల్లోని చిన్న తరహా పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు, 45 పారిశ్రామిక క్లస్టర్ల సమగ్ర అభివృద్ధి కోసం రూ. 200 కోట్ల  నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ వినూత్నమైన ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఏపీ డీడీపీ ద్వారా రాబోయే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 45 కామన్ ఫెసిలిటీ సెంటర్లను  నెలకొల్పనున్నారు. ఈ కేంద్రాల స్థాపనతో దాదాపు 1,840 ఎంఎస్ఎంఈ యూనిట్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరడమే కాకుండా..  7,500 మందికి పైగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన సాంకేతికతను స్థానిక పారిశ్రామికవేత్తలకు అందుబాటులోకి తెచ్చేందుకు మెటా , అమెజాన్ , జోహో వంటి గ్లోబల్ డిజిటల్ దిగ్గజ సంస్థలతో ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రగతి కేవలం మైక్రో లెవెల్ పరిశ్రమలకే పరిమితం కాలేదు..  దేశ భద్రతను శాసించే అడ్వాన్స్‌డ్ మై క్రో టెక్నాలజీ వైపు కూడా అడుగులు వేస్తోంది. ఒకవైపు గ్రామీణ వ్యవస్థలను బలోపేతం చేస్తూనే, మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వేదికగా రూ. 15,803 కోట్ల భారీ పెట్టుబడితో, 650 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎమ్సీఏ) డిఫెన్స్ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), డీఆర్‌డీఓ,హాల్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా శత్రువుల రాడార్లకు చిక్కని 5వ తరం  స్టెల్త్ ఫైటర్ జెట్లను ఆంధ్రప్రదేశ్ గడ్డపైనే తయారు చేయబోతున్నారు. భారత్ ఫోర్జ్, భారత్ డైనమిక్స్ వంటి గ్లోబల్ రక్షణ రంగ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడుతుండటంతో రాయలసీమ యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు లభించనున్నాయి.

మరోవైపు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ హబ్‌ను ఏర్పాటు చేస్తూ ఏపీని డ్రోన్ క్యాపిటల్‌గా మార్చేందుకు కసరత్తు వేగవంతమైంది. ఇందులో భాగంగా కేవలం రూ. 500 కోట్ల పెట్టుబడితో వచ్చే ప్రాజెక్టుల ద్వారా 2,050 మందికి తక్షణ ఉపాధి లభించనుంది. డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 255 కోట్ల పెట్టుబడితో 850 మందికి, అల్గోబాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 34 కోట్ల పెట్టుబడితో 52 మందికి ఉపాధి కల్పించనున్నాయి.

రాష్ట్రాన్ని మానవ వనరుల హబ్‌గా మార్చేందుకు 35,000 మంది యువతకు డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. చిప్ డిజైనింగ్, డ్రోన్ టెక్నాలజీ, అత్యాధునిక యుద్ధ విమానాల తయారీ నుంచి నౌకాశ్రయాల అభివృద్ధి వరకు ప్రతి రంగంలోనూ ఏపీ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకుపోతోంది. ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకుని నవ్యాంధ్రను గ్లోబల్ నాలెడ్జ్ ఎకానమీగా మార్చేందుకు పారిశ్రామికవేత్తలు కదలిరావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

By
en-us Political News

  
హైదరాబాద్ నగర పట్టణ రవాణా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
ద్రవిడ రాజకీయల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఇంగ్లండ్ మాజీ లెజెండరీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన ఒక ప్రసిద్ధ యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్న వైభవ్.. అక్కడ పీటర్సన్ విసిరిన ఊహించని సవాల్‌ను స్వీకరించాడు. ఆ షోలో వైభవ్ సూర్యవంశీ పాతిక బంతుల్లోనే 100 పరుగులు బాది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణలో ధాన్యం, మొక్కజొన్న పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
ఇండియా అమెరికాకు మిత్రదేశమనీ, కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం భరోసా ఇచ్చే ప్రకటన కావచ్చునేమో కానీ, పాలనా చర్యల విషయానికి వస్తే, అమెరికా భారత జనాభాకు వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకుంటోంది. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అమెరికాలోని భారత జనాభా భారతదేశానికి తిరిగి వెళ్లాలని ఆదేశించే ఇటీవలి ఉత్తర్వులే ఇందుకు నిదర్శనం.
వరంగల్ రేంజ్‌కు చెందిన ఏసీబీ అధికారులు మరో అవినీతి అధికారిపై ఉక్కుపాదం మోపారు.
ఇరుపక్షాలు 60 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించనున్నాయి.
తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న సూలూరులో ఒక 10 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన కిరాతక అత్యాచారం మరియు హత్య ఉదంతం
తెలంగాణలో మద్యం ప్రియులు సరికొత్త నిర్ణయంతో వార్తల్లోకెక్కారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో జరిగిన ప్రముఖుల, రాజకీయ నాయకుల హత్యల వ్యవహారం మరోసారి తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు రేగాయి.
పురాతన స్థలాలు, చారిత్రక, వారసత్వ కట్టడాలు, అవశేషాలు పరిరక్షణ పై గ్రామీణులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా వారు సిద్దిపేట జిల్లా నంగునూరు, కొండపాక, తోటపల్లి, లకుడారం గ్రామాలను ఆదివారం సందర్శించారు.
ఆర్సీబీ, ఎస్ఆర్ హెచ్ జట్ల మధ్య ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ మ్యాచ్ పూర్తయిన తరువాత కూడా ఇరువురి మధ్యా ఆవేశాలు తగ్గలేదు. మ్యాచ్ అనంతరం కోహ్లీ హెడ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నిరాకరించాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.