అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం

Publish Date:May 20, 2026

Advertisement

హైదరాబాద్‌  అత్తాపూర్ ప్రాంతంలో  మంగళవారం (మే 19) అర్ధరాత్రి   యువతి కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు కారులో యువతిని బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయిన సంఘటన స్థానికంగా భయాందోళనలకు గురి చేసింది. అర్ధరాత్రి సమయంలో అత్తాపూర్‌లోని జాయ్ ఆసుపత్రి వైపు ఒక యువతి పరుగులు తీసుకుంటూ వచ్చి.. న్ను కిడ్నాప్ చేస్తున్నారు రక్షించండి అంటూ ఆసుపత్రి రిసెప్షన్ వద్ద సహాయం కోరింది.

వెంటనే ఆమె ఆసుపత్రి లోపలికి వెళ్లి బాత్రూంలో దాక్కుంది. అయితే కొద్ది నిమిషాల్లోనే ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఆమెను వెంబడిస్తూ ఆసుపత్రికి చేరుకున్నారు. వారిని రిసెప్షనిస్ట్ మరియు అక్కడ ఉన్న పేషెంట్ల బంధువులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.అడ్డుకున్న వారిని బెదిరిస్తూ దుండగులు బలవంతంగా లోపలికి ప్రవేశించారు. అందరూ చూస్తుండగానే బాత్రూంలో దాక్కున్న యువతిని బయటకు లాగి, బలవంతంగా ఆసుపత్రి నుంచి తీసుకెళ్లి బయట నిలిపిన  కారులో ఎక్కించి పారిపోయారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అత్తాపూర్ నుంచి అరంఘర్ చౌరస్తా వరకు థార్ కారును చేజ్ చేసినప్పటికీ, దుండగులు పోలీసుల కళ్లు కప్పి పారిపోయారు. నెంబర్ ప్లేట్ లేని కారు కావడంతో వారి వివరాలు సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తన బృందంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే 143వ పిల్లర్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు.

మూడు గంటల పాటు సాగిన దర్యాప్తులో అనేక సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు.బుధవారం (మే20) ఉదయం అత్తాపూర్ జాయ్ ఆసుపత్రి వద్దకు టాస్క్ ఫోర్స్ చేరుకుని మళ్లీ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. యువతి వివరాలు, కిడ్నాపర్స్ గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి.అసలు యువతి ఎవరు? అర్ధరాత్రి ఆసుపత్రికి ఎందుకు వచ్చింది? ఆమెను ఎక్కడి నుంచి వెంబడించారు?  అనే  కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అత్తాపూర్ నుంచి అరంఘర్ వరకు ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తూ పోలీసులు విచారణ కొన సాగిస్తున్నారు. 

By
en-us Political News

  
ఇప్పటివరకు తాము ఎన్నో విషయాలను ఓపికగా భరించామని, అయితే ఇకపై సహించే ప్రసక్తే లేదని జనసేన
డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అంతర్గత సమీక్షా సమావేశంలో శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రముఖులకు తాజాగా పద్మ పురస్కారాలు దక్కాయి.
రాజకీయాల్లోకి తాను అన్నీ కోల్పోవడానికి సిద్ధపడే వచ్చానని, అంతేగానీ ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవడానికి సిద్ధంగా లేనని
ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 ఎపీ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంది.
అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు.
మహిళా చిన్న తరహా వ్యాపారులపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరు పరిచారు
2034 నాటికి తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు ప్రచారం..
హైదరాబాద్ నగర పట్టణ రవాణా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
విజయవాడ వేదికగా సోమవారే నిర్వహించిన ప్రతిష్టాత్మక వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సరికొత్త దిశను చూపించింది. ఈ సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు భాగస్వామ్యులయ్యారు.
ద్రవిడ రాజకీయల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఇంగ్లండ్ మాజీ లెజెండరీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన ఒక ప్రసిద్ధ యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్న వైభవ్.. అక్కడ పీటర్సన్ విసిరిన ఊహించని సవాల్‌ను స్వీకరించాడు. ఆ షోలో వైభవ్ సూర్యవంశీ పాతిక బంతుల్లోనే 100 పరుగులు బాది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.