మహిళా వ్యాపారులకు విచిత్రమైన శిక్ష విధించిన కోర్టు
Publish Date:May 25, 2026
Advertisement
హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ కృత్రిమ పూల వ్యాపారం నిర్వహిస్తున్న ఐదుగురు మహిళా చిన్న తరహా వ్యాపారులపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరు పరిచారు. అయితే ఈ ఘటనపై కోర్టు ఓ వినూత్న రీతిలో తీర్పు వెల్లడించింది... కోర్టు ఇచ్చిన తీర్పును విని నిందితులు సైతం అవాక్కయ్యారు. అంజు సింగ్ (19),సబీ దేవి (38),మనూ దేవి (43),మనీషా (20), శకుంతల (36) ఈ ఐదుగురు మహిళలు గుల్జార్ హౌజ్ నుంచి మక్కా మసీదు మరియు చార్మినార్ వైపు వెళ్లే ప్రత్యేక పాదచారుల మార్గాన్ని ఆక్రమిస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. కృత్రిమ పూల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు... అయితే వీరి వల్ల అక్కడ భారీగా పర్యాటకులు మరియు పాదాచారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో పోలీసులు మహిళలను పలుమార్లు హెచ్చరించారు. అయినా కూడా ఈ మహిళలు పోలీసుల మాటలను వారు పట్టించుకోలేకుండా యధావిధిగా పూల వ్యాపారం కొనసాగించారు. దీంతో చార్మినార్ పోలీసులు మే 23న ఈ ఐదుగురు మహిళలపై CP యాక్ట్ సెక్షన్ 66-C మరియు BNS సెక్షన్ 292 కింద కేసులు నమోదయ్యాయి. అనంతరం పోలీసులు ఈరోజు సోమవారం ఉదయం నిందితులను గౌరవనీయ 1వ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు ప్రతి ఒక్కరికి రూ.200 జరిమానా విధించింది. అంతేకాకుండా, సాయంత్రం 5 గంటల వరకు చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా SHO మాట్లాడుతూ చార్మినార్ ప్రాంతంలో పర్యాటకులు మరియు పాదచారులకు ఇబ్బంది కలిగించేలా రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/court-imposes-strange-sentence-on-women-traders-36-220846.html





