'నాయక్' తో రికార్డ్ లు సృష్టించనున్న రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ "నాయక్" మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ సినిమా పాటలు ఇటీవల విడుదలై విజయాన్ని సాధించాయి. నాయక్ చిత్రానికి సంబంధించిన చివరి పాట 'ఒయ్యారమంటే ఏలూరే..' చిత్రీకరణ పూర్తయింది. ఈ పాటతో మొత్తం సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది.
రామ్ చరణ్, వి వి వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న నాయక్ సినిమా టాలీవుడ్ లో రికార్డ్ లు బ్రేక్ చేసి కొత్త రికార్డ్ లను సృష్టిస్తుందని నిర్మాత దానయ్య అన్నారు. రామ్ చరణ్ డాన్సులు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందని చెప్పారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, అమలాపాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్‌రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్.