హాట్ ఫోటో: రామచరణ్, పవన్ కళ్యాణ్ సందడి
దగ్గుబాటి వారి పెళ్ళి లో పవన్ కళ్యాణ్, రామచరణ్ సందడి చేశారు. డిసెంబర్ 5న నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలో జరిగిన సురేష్ బాబు కూతురి పెళ్ళిలో వెంకటేష్, పవన్ కళ్యాణ్, రామచరణ్, శ్రీకాంత్ మాట్లాడుతూ ఇలా కేమెరాకు చిక్కారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాదారణంగా ప్రైవేటు ఫంక్షన్ లకు దూరంగా ఉంటారు. దీంతో ఆయన ఈ ఫంక్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తమ చిత్రం కోసం అద్భుతమైన లొకేషన్లు వెతకడంలో భాగంగా యూరఫ్ ఖండంలోని స్పెయిన్ లో పర్యటిస్తున్నారు. ఈ వెతుకులాటలో తాజాగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా జాయిన్ అయ్యాడు. పనిలో పనిగా దేవిశ్రీ ఇక్కడే ఈ ఇద్దరితో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ వేయనున్నారు. ఈ సినిమా కోసం తను ప్రిపేర్ చేసుకున్న ట్యూన్లు వారికి వినిపించనున్నాడు. ఈ చిత్రంలో సమంత పవన్ కళ్యాణ్ హీరోయిన్ గా నటించనుంది.