నాయక్ సేట్ లో మనవరాళ్లతో మెగాస్టార్ హల్ చల్
posted on Dec 25, 2012 @ 4:37PM
రామ్ చరణ్ 'నాయక్' సేట్ లో మెగాస్టార్ చిరంజీవి తన మనవరాళ్లతో కలిసి హల్ చల్ చేశారు. సుస్మిత, శ్రీజలా కుమార్తెలను తీసుకొని నాయక్ సేట్ కి వెళ్ళారు చిరు. అక్కడ రామ్ చరణ్, ఛార్మిల మీద ప్రత్యేక గీతాన్ని చిత్రించారు. అ టైం లో మానిటర్ దగ్గర కుర్చోని సాంగ్ ఎలా తీస్తున్నారో చూశారు. మామయ్య రామ్ చరణ్ వేసిన స్టెప్పులు చూసి చిన్నారులు సంబరపడ్డారని యూనిట్ సభ్యులు తెలిపారు.కేంద్ర మంత్రి అయిన తర్వాత తీరిక లేకుండా గడుపుతున్న చిరంజీవి ఇలా మనవరాళ్లతో తమ లొకేషన్లోకి రావడం ‘నాయక్' యూనిట్ సభ్యులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.