Baadshah Dialogue Leaked

లీకైన ఎన్టీఆర్ బాద్షా డైలాగ్

శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న బాద్షా చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చాలా పవర్ ఫుల్ డైలాగులు ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో రాబోయే డైలాగు అంటూ ఒక డైలాగ్ ప్రచారంలోకి వచ్చింది. విలన్ హీరోని చూస్తూ "ఎవరునువ్వు అని అడుగుతాడు'' దానికి ఎన్టీఆర్ "శతృవుకి షేర్షా.... స్నేహానికి బానిస.... .... స్టేట్ కి బాద్షా" అని చెబుతాడు. అసలు ఈ డైలాగు చిత్రంలో ఉందొ లేదో తెలియదు కానీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో బాగా పాపులర్ అవుతోంది. ఇప్పటికే టీజర్ టో వదిలిన "బాద్ షా డిసైడ్ అయితే ... వార్ వన్ సైడ్ అవుద్ది'' అనే డైలాగు చాలా బాగా జనాల్లోకి దూసుకుపోయింది. హీరోల ఇమేజ్ కి తగ్గ రీతిలో కథలను, వారిలోని మాస్ యాంగిల్ ని అద్భుతంగా వినియోగించుకోవడం  శ్రీను వైట్ల స్టైల్.

actress anushka priyamani

సినీ నటి అనుష్క, ప్రియమణి లపై కేసు!

        సినిమాలలో అశ్లీలత అంతులేకుండా పోతుంది. బాలీవుడ్, కన్నడ, మళయాళం, తమిళ సినిమాలతో పోలిస్తే తెలుగులో ఆందాల ఆరబోత కాసింత తక్కువే. ఇక బాలీవుడ్ ఎప్పుడో బరితెగించి పోయింది. అయితే అసభ్యకరంగా నటిస్తున్నారని ప్రముఖ సినీ తారలు అనుష్క, ప్రియమణిలపై కోర్టులో ఫిర్యాదు నమోదైంది. ఈ ఇద్దరు సినిమా తారలు సినిమాల అసభ్యంగా నటిస్తున్నారని ఆరోపిస్తూ సామాజికవేత్త, న్యాయవాది సుబుద్ధి పిటిషన్ దాఖలు చేశారు. అసభ్యంగా నటిస్తున్న వీరిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు. పిటిషన్ స్వీకరించిన కోర్ట్ కేసును మంగళవారానికి వాయిదా వేసింది.

 NTR Baadshah Audio Songs Track List|Baadshah Audio Songs

జూ.ఎన్టీఆర్ 'బాద్ షా' ఆడియో ట్రాక్ లిస్ట్

        యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'బాద్ షా'. ఈ మూవీ షూటింగ్ పార్ట్ మొత్తం మార్చి10తో కంప్లీట్ చేయనున్నారు. అదే రోజున ఆడియో రిలీజ్ కూడా ప్లాన్ చేశారు. రీసెంట్ గా మిర్చి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో వేడుకలు జరిగిన నానక్ రామ్ గుడా రామానాయుడు స్టూడియో లోనే ఆడియో రిలీజ్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అ౦దిస్తుండగా..తమిళ్ స్టార్ శింబు ఒక పాటను పడడం విశేషం. ఈ మూవీ ఆడియో ట్రాక్ లిస్ట్ వివరాలు మీకోసం:    1. సైరో సైరో...  2. బంతిపూల జానకి..  3. చలాకి పిల్లమ్మో...  4. డైమండ్ గర్ల్.. 5. వెల్‌కం కనకం.. 6. బాద్ షా టైటిల్ సాంగ్

NTR Baadshah

భారీగా ఖర్చు పెడుతున్న బండ్ల గణేష్

        టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు బోల్తా పడుతున్న నిర్మాతలు ఖర్చు పెట్టడానికి వెనుకాడడం లేదు. ఒక్క సినిమా హిట్టయితే చాలు, భారీ నిర్మాతగా పేరు తెచ్చుకోవడానికి ఎక్కువగా ఖర్చు పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు. ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. అతని మొదటి రెండు సినిమాలు బాక్స్ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన, గబ్బర్ సింగ్ హిట్ తో కోలుకున్నాడు. అయితే పవర్ స్టార్ ఇచ్చిన హిట్ మహిమో! ఇంకేదో..తెలియదు కాని, తాను ప్రస్తుతం నిర్మిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ 'బాద్ షా' సినిమాకి మాత్రం తెగ ఖర్చు పెడుతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ వేసుకున్న సూట్ కుట్టేందుకు వినియోగించిన వస్త్రం ఖరీదు మీటరుకు రూ.లక్ష లెక్కన కొనుగోలు చేశాడట. ఈ చిత్రంలో ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ కి రూ.3.5 కోట్లు ఖర్చుపెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. అన్నట్లు ఈ సినిమా బడ్జెట్ ఎప్పుడో దాటేసిందట. మరి సినిమా హిట్టయితే పర్వాలేదు..కాని.. .మీరే కంప్లీట్ చేయండి!

 Nagarjuna Adi Shankara

చండాలునిగా నాగ్ ఫోటో

        అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల రచయిత జె.కె. భారవి దర్శకత్వంలో వస్తున్న 'శ్రీ జగద్గురు ఆది శంకర" లో కింగ్ అక్కినేని నాగార్జున ఓ షాకింగ్ గెటప్ లో కనిపించనున్నారు. ఆది శంకరుని జీవిత చరిత్రగా రూపొందే ఈ చిత్రంలో శంకరాచార్య కి కాశీలో దర్శనమిచ్చే చండాలుని పాత్రను నాగార్జున చేస్తున్నారు. ఈ గెటప్ కు సంబంధించిన షాకింగ్ విజువల్స్ బయటకు వచ్చాయి. ఇందులో నాగార్జున్ నల్ల డ్రెస్ లో సరికొత్తగా కనిపించారు. ఇటీవల ఆది శంకరాచార్య పాత్రధారి కౌశిక్, నాగార్జున పాల్గొనగా పలు సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సన్నివేశాలకు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా, ఎస్. గోపాల్‌రెడ్డి ఛాయాగ్రహణ బాధ్యతలు వహించారు. అలాగే ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో విశేషం. ఈ చిత్రంలో మోహన్‌బాబు, శ్రీహరి కూడా ప్రధాన పాత్రలు చేస్తున్నారు.

 The Attacks Of 26/11

‘26/11 ఇండియాపై దాడి' వర్మ మూవీ టాక్

        వాస్తవ కథనాల్ని తెరకెక్కించటానికి రామ్ గోపాల్ వర్మ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటాడు. ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ నుంచి చాలా సినిమాలు వచ్చిన తన మార్క్ ను చూపించలేకపోయారు . అయితే చాలా మంది రామ్ గోపాల్ వర్మ సినిమాలకు గుడ్ బై చెప్తే మంచిది అనుకుంటున్న  టైంలో...ముంబై దాడుల ఘటనను వెండి తెరపై ‘26/11 ఇండియాపై దాడి' అనే టైటిల్ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చారు.   ముంబై దాడుల ఘటనను చిత్రీకరించడంలో రామ్ గోపాల్ వర్మ సక్సెస్ అయ్యారు అంటున్నారు విమర్శకులు. ముఖ్యంగా ముంబై హోటల్ లో దాడి జరిగిన సన్నివేశాలను వర్మ అద్భుతంగా తెరకేక్కించాడని చెబుతున్నారు. ఈ సినిమాలో నానా పటేకర్ యాక్టింగ్, అతని వాయిస్ మెయిన్ హైలైట్ గా చెప్పవచ్చు. అజ్మల్ కసబ్ గా సంజీవ్ జైస్వాల్ నటన ఆకట్టుకుంటుంది. సా౦కేతికంగా కాకుండా అన్ని అంశాల్లోనూ వర్మ పకడ్బందీగా చిత్రాన్ని ముందుకు నడిపించారు. ఈ సినిమా వర్మ ను మళ్ళీ ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళింది.     

anushka marriage

రెండేళ్ళలో రెండో ఇన్నింగ్స్!

        టాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్క త్వరలో పెళ్ళికూతురు కాబోతుందట. ఇప్పుడు ఇదే ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్. 2015 లో అనుష్క పెళ్ళి చేసుకోబోతుందనే వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది! అనుష్క ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం చేస్తున్న భారీ చిత్రం 'బహుబలి', గుణ శేఖర్ నిర్మిస్తున్న 'రుద్రమదేవి' సినిమాలో నటిస్తుంది. ఈ ప్రాజెక్ట్ లు పూర్తైన తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి 'బహుబలి' కంప్లీట్ అయ్యేసరికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టే ఛాన్స్ ఉంది. కానుక అనుష్క పెళ్ళి 2015 లో ఖాయమనె వార్తలు వినిపిస్తున్నాయి.   అనుష్క పెళ్ళి గురించి గత౦లోనే కుటుంబ సభ్యులు ఆమెతో చర్చించారు. అప్పుడు అనుష్క కి చాలా సినిమాలు చేతిలో ఉండడం కారణ౦గా పోస్ట్ పోన్ చేశారు. అనుష్క బంధువుల అబ్బాయి తోనే ఆమె పెళ్ళి జరనుందని సమాచారం. మొత్తానికి అనుష్క రెండేళ్ళ లో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతుంది.  

 Ram Gopal Varma

26/11 సినిమా రామ్ గోపాల్ వర్మకు షాక్

        తమిళనాడులో విశ్వరూపం సినిమా నిషేధం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ తరువాత కొన్ని సీన్లు, కొన్ని మాటలు తొలగించి సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా వివాదంలో కమల్ హాసన్ నేను అవసరమయితే దేశం విడిచి వెళ్తానని ప్రకటించడం సంచలనం రేపింది. తాజాగా రాంగోపాల్ వర్మ తీసిన ముంబయి దాడులు ‘26/11’ సినిమా మీద తాజాగా హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. ఈ సినిమా విడుదలను ఆపేయాలని న్యాయవాది తీగల రాంప్రసాద్ ఈ మేరకు పిటీషన్ దాఖలు చేశారు. ఈ సినిమాను విడుదల చేయడం మూలంగా ముంబయి దాడుల్లో మరణించిన వారి బంధువులు, బాధితులు మానసిక వేదనకు గురవుతారని అందుకే నిలిపేయాలని పిటీషనర్ పేర్కొన్నారు. మరి కోర్టు ఏం నిర్ణయిస్తుందో వేచిచూడాలి.

Rajamouli Sruti hassan

శ్రుతి హాసన్ కు రాజమౌళి షాక్

        రాజమౌళి డైరెక్షన్ లో రూపొందనున్న 'బహుబలి' భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన్ అనుష్క నటిస్తుండగా, విలన్ గా చేస్తున్న రానా సరసన శ్రుతి హాసన్ ని సెలెక్ట్ చేశారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని రాజమౌళి ఖండించారు. ''బాహుబలి సినిమా కోసం శ్రుతి హాసన్ ను ఎంపిక చేయలేదు. ఆమెను ఏ పాత్ర కోసమూ సంప్రదించలేదు. ఇది పూర్తిగా అవాస్తవమైన వార్త” అని ట్విటర్లో రాజమౌళి తేల్చి చెప్పారు. ఈ సినిమాను ఆర్కా మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాజమౌళితో పాటు రాఘవేంద్రరావు కూడా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నట్లు సమాచారం.

ram charan tej

రామ్ చరణ్ ‘జంజీర్’ కబుర్లు

                        తన ‘నాయక్’ సినిమాతో మంచి ఊపుమీదున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం తెలుగులో ‘ఎవడు’ అనే ఒక సినిమా, హిందీలో ‘జంజీర్’ అనే మరో సినిమా షూటింగులతో చాలా బిజీగా ఉన్నాడు. అతని ‘ఎవడు’ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా శ్రుతీ హాస్సన్ మరియు అమీ జాక్సన్ నాయికలుగా రామ్ చరణ్ తో జత కడుతున్నారు. ఈ సినిమాలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.     ఇక రామ్ చరణ్ తేజ్ హిందీ సినిమాను అపూర్వ లఖియా అనే సుప్రసిద్ధ బాలివుడ్ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలివుడ్ నెంబర్:1 హీరోయిన్ ప్రియాంకా చోప్రా రామ్ చరణ్ తో జత కట్టడం మరో ప్రత్యేకాకర్షణగా నిలువబోతోంది. గతంలో అమితాబ్ బచ్చన్ చేసిన ఇనస్పెక్టర్ విజయ్ పాత్రను ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ చేస్తున్నాడు.     రామ్ చరణ్ తేజ్, నిజ జీవితంలో చాలా మృధుస్వభావి, మిత బాషి, స్నేహపూరితంగా ఉంటాడు. కానీ, ఈ సినిమాలో రామ్ చరణ్ తన మనస్తత్వానికి పూర్తి విభిన్నమయిన పాత్రను చేస్తున్నాడు. అతను ఒక కోపిష్టిగా ఎల్లపుడూ ముభావంగా ఉండే పోలీసు ఆఫీసరుగా ఈ సినిమాలో కనిపిస్తాడు. ఇదే విషయం గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ, నిజానికి తనకు ప్రధమకోపం ఎక్కువే కానీ, అది నిమిషంలో చల్లారిపోతుందని అన్నాడు. తన సినిమా జీవితంలో మొట్టమొదటిసారిగా పోలీసు యూనిఫారం వేసుకొని నటిస్తున్నందుకు తను చాలా ఆనందపడుతున్నానని అన్నాడు. బాధ్యతగల పోలీసు యూనిఫారం వేసుకొన్నందున షూటింగు సమయంలో బుద్ధిగా కూర్చోంటూన్నానని చెప్పాడు. ప్రస్తుతం హీరోయిన్ ప్రియాంక చోప్రా నుండి తానూ హిందీ మాట్లాడటం నేర్చుకొంటూ, ఆమెకు తెలుగు నేర్పిస్తున్నానని చెప్పాడు. హిందీ రాకపోయినా అర్ధం చేసుకోగలను కనుక, డైలాగుకి తగిన హావాభావాలు ప్రదర్శించడంలో ఇబ్బంది లేదని అన్నాడు.     గతంలో నిర్మించిన ‘జంజీర్’ సినిమాలో సుప్రసిద్ధ హిందీ నటుడు ప్రాణ్ పోషించిన ‘షేర్ ఖాన్’ (అమితాబ్ స్నేహితుడి పాత్ర)ను ఈ సినిమాలో బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ చేస్తున్నాడు. మొదట ఆ పాత్రను చేయడానికి అయన ఇష్టపడకపోవడంతో, అర్జున్ రాం పాల్ ను ఆ పాత్రకు అనుకొన్నారు. కానీ, సంజయ్ దత్త్ మనసు మార్చుకొని మళ్ళీ రావడంతో షేర్ ఖాన్ పాత్రను తిరిగి ఆయనకే అప్పగించారు.     ఇక, ఈ సినిమా తెలుగు వెర్షన్ కు ‘రుస్తుం’గా పేరు నిర్ణయించారు. తెలుగు, హిందీ బాషలలో ఒకేసారి ఈ ఏడాది మే నెల 10వ తేదీన విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయితే, 27 సం.ల క్రితం ఆ సినిమాకు కధను అందించిన ప్రముఖ బాలివుడ్ సినీ కధా రచయిత జావేద్ అక్తర్ సినిమా నిర్మాణం మొదలుపెట్టిన కొద్ది రోజులకే, ఆ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసారు. తమ కధను ఆధారంగా చేసుకొని ‘జంజీర్’ సినిమాను పునర్నిర్మిస్తునందున తనకు రూ.6 కోట్లు రాయల్టీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా నిర్మాతలు వారితో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నారని రామ్ చరణ్ అన్నాడు.   ఒకానొకసమయంలో అమితాబ్ బచ్చన్ను సినిమాలలో నటించడానికి పనికిరావని అందరూ తిరస్కరించినప్పుడు, ఆయన మూట ముల్లే సర్దుకొని అలహాబాద్ తిరిగి వెళ్లిపోదామనుకొంటున్న తరుణంలో ఆయనకు ‘జంజీర్’ ఆఫర్ రావడంతో ఆయన దశ తిరిగి, నేటికీ బాలివుడ్ లో తిరుగులేని హీరోగా నిలబెట్టింది. బాలివుడ్ లో ఆయనకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలికించేలా చేసిన ఆ సినిమానే ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ చేస్తునందున ఇప్పుడు రామ్ చరణ్ కు కూడా బాలివుడ్ ద్వారాలు తెరిచి కొత్త అవకాశాలు తెస్తుందని ఆశించవచ్చును.    

chiranjeevi

మెగా వాయిస్ తో ఆది శంకారాచార్య

  మన మెగా స్టారువారు తనకు జీవితాన్నిచ్చిన సినీ పరిశ్రమను వదిలిపెట్టి, రాజకీయాలలోకి ఎందుకు జమ్పింగు తీసుకొన్నారో అందరికీ తెలిసిన విషయమే. అయితే, సినీ పరిశ్రమలో స్వయం కృషితో రుద్రవీణ మోగించి పైకి వచ్చిన మన శంకర్ దాదా, రాజకీయాలలో కూడా ఓనామాల స్థాయి నుండి కేంద్ర మంత్రి పదవి చేపట్టి ఏకంగా యంబీబీయస్ పరీక్షలు పాసయిపోయాడు. అయినప్పటికీ, అతను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి ఇంకా చాల మెట్లు ఎక్కవలసి ఉంది. అందువల్ల అప్పుడప్పుడు ఆయన మనసు తాను ఏకచాత్రదిపత్యంగా ఏలిన సినీపరిశ్రమ వైపు లాగుతుంది.   సెంచరీకి చేరువలో ఉండగా చేతులెత్తేసే సచిన్ టెండూల్కర్ లాగ 149 సినిమాలు చేసి సినీ పరిశ్రమ నుండి తప్పుకోవడంతో ఆ ఒక్క చిత్రం కోసం ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆయనకీ ఆ ఒక్కటీ చేసేసి రికార్డు సర్దుకోవాలని ఉంది కానీ, రాజకీయ వ్యవహారాలతో వీలు కుదరడంలేదు.   అయితే, ఇటీవల దొరికిన ఒక మంచి అవకాశాన్ని మాత్రం ఆయన సద్వినియోగపరుచుకొన్నాడు. దర్శకుడిగా మారిన సినీ రచయిత జేకే భారవి దర్శకత్వంలో గ్లోబల్ సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నఆధ్యాత్మిక చిత్రం ‘ఆది శంకరాచార్య’ సినిమాలో ఆ పాత్ర పోషిస్తున్న కౌశిక్ అనే కొత్త నటుడికి చిరంజీవి తన గొంతు అరువిస్తున్నాడు.   శంకరాచార్యకు వాయిస్ ఓవర్ గా వినిపించే చిరంజీవి అతని అభిమానులకి తెరపై మాత్రం ప్రత్యక్షంగా కనబడకపోయినా వినబడతాడు గనుక అతని అభిమానులు ‘మరేం చేస్తాం? అదే ఓ తుత్తి!’ అనుకొంటూ ఆయన గొంతు వింటూ సినిమా చూసేయక తప్పదు. ఈ సినిమాలో నాగార్జున, మోహన్ బాబు, నాగబాబు, శ్రీహరి మొదలయినవారు అతిధి పాత్రల్లో నటిస్తున్నారు.

హీరో సిద్దార్థ్ ను కావాలన్న సమంత..!

      'జబర్ దస్త్' సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన సిద్దార్థ్, సమంతాల మధ్య ఎఫైర్ నడుస్తుందని ఫిల్మ్ నగర్ లో టాక్. ఈ విషయం పై ఇప్పటి వరకు సమంత కాని సిద్దార్థ్ ఏమి కామెంట్ చేయలేదు. అయితే 'జబర్ దస్త్' డైరెక్టర్ నందిని రెడ్డి మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టింది.   అదేమిటి అంటే..'జబర్ దస్త్' కోసం సమంత డేట్స్ కావాలని నందిని రెడ్డి నిత్య మీనన్ ని సంప్రదించింది. నిత్య డైరెక్ట్ గా సమంతతో మాట్లాడి సినిమా చేయడానికి ఒప్పించిందట. అప్పటికి ఇంకా హీరో ఫైనల్ కాలేదు. హీరో కోసం నందిని రెడ్డి వెతుకుతుండగా సిద్దార్ద్ అయితే బాగుంటాడు..అతనిని పెట్టుకోవాలని సమంత సూచించిందట. సిద్ధార్థ్ పేరునే సమంత ఎందుకు  రిక్వెస్ట్ చేసిందని అందరూ సందేహ పడుతున్నారు. అయితే సమంత దీనిపై ఏమైనా కామెంట్ చేస్తుందో లేదో చూడాలి.  

ఐటమ్స్ చూపిన జ్వాలా

    వెండి తెరపై నిస్సంకోచంగా తమ అందాలను ఆరబోసే మన అందాల భామలు, దానినే గొప్ప నటనగా భావిస్తే, ఆ నటన(?)కే వారు అనేక అవార్డులు కూడా అందుకొంటారు. మన దేశంలో ఒక్క క్రికెట్టు, సినిమా రంగాలకి తప్ప మరే ఇతర రంగంలలోనూ ఈ విధంగా ఆదాయం, అవార్డులు, ఆదరణ దక్కవు. కొద్ది కాలం క్రితం వరకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఒక వెలుగు వెలిగిన జ్వాలా గుట్టా, ఇటీవల భర్త చేతన్ ఆనంద్ నుండి విడిపోయిన తరువాత అకస్మాత్తుగా జ్ఞానోదయం అయినట్లు సినీరంగంలోకి ప్రవేశించింది. ఒంటినిండా సరిపోయేంత కండ పెంచుకొన్న ఆమె జబర్దస్త్ గా ఉంటుంది గనుక, నిత్య మీనన్, నితిన్ కలిసి నటించిన ‘గుండె జారి గల్లంతయింది’ అనే సినిమాతో సినీప్రవేశం చేసింది. అయితే, ఇంకా ఎంతవరకు నటించాలో(ఎంతవరకు అందాలు ప్రదర్శించాలో) ఆమెకు పూర్తిగా తెలియనందున, మొదటి సినిమాలో కేవలం ఒక ‘ఐటెం సాంగు’లో ఏవో కొన్ని‘ఐటమ్స్’ చూపించి సరిబెట్టుకొంది. కానీ, ఇటీవల జరిగిన ఆ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో మాత్రం మిగిలిపోయిన’ఐటమ్స్’ అన్నీ కూడా చూపించే ప్రయత్నం చేసిందని సినీ జనం చెవులు కోరుకొంటున్నారు.

'మిర్చి' పవర్ చూపిస్తున్న ప్రభాస్

  ఇటీవల విడుదలయిన ‘మిర్చి’ సినిమాతో దుమ్ము లేపుతున్నరెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు యువతకు ఆరాధ్య హీరో అయిపోయాడు. నైజాం ప్రాంతంలో కేవలం 11 రోజుల్లో 11.10 కోట్ల వసూళ్ళు రాబట్టిన ‘మిర్చి’ ప్రభాస్ క్యారీర్లోనే ఒక పెద్ద హిట్టుగా నిలబోతోంది. నిన్నమొన్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో రెండో స్థానానికే పరిమితమయిపోయిన ప్రభాస్ ‘మిర్చి’ సినిమాతో నెంబర్: 1 స్థానానికి ఎదిగిపోయాడు. గతంలో ‘ఛత్రపతి’, ‘మిస్టర్.పెర్ఫెక్ట్’, ‘డార్లింగ్’వంటి హిట్స్ ఇచ్చినా అవి అతనిని నెంబర్: 1 స్థానానికి తీసుకువెళ్ళలేకపోయాయి.   దీనికి ముందు విడుదలయిన రెబెల్ సినిమాపై ప్రభాస్ చాల ఆశలు పెట్టుకోన్నపటికీ, అది ఘోరంగా విఫలం అవడంతో అతను చాలా నిరాశ చెందాడు. అయితే, ఊహించని విదంగా ‘మిర్చి’ అతనికి పెద్ద విజయం అందించడమే కాకుండా, కమర్షియల్ హీరోగా ఒక కొత్త గుర్తింపును కూడా ఇవ్వడంతో, ప్రభాస్ టాలివుడ్ లో నెంబర్: 1 స్థానానికి ఎదిగిపోయాడు. ఈ ఘనత ‘మిర్చి’ని అంత ఘాటుగా దంచి వడ్డించిన కొరటాల శివకే దక్కుతుందని నిసందేహంగా చెప్పవచ్చును.   ఎన్నో సినిమాలకు రచయితగా కధలందించిన కొరటాల, తన తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా ఇంత పెద్ద విజయం సాదించడమే కాకుండా, ప్రభాస్ స్థాయి పెరిగేందుకు కూడా దోహదపడ్డాడు. అంతేకాకుండా, చాలా కాలంగా సరయిన హిట్స్ లేక డీలాపడిపోయిన బెంగాలీ అందాల భామ రిచా గంగోపద్యాయకు కూడా ఈ సినిమాతో కొరటాల పెద్ద హిట్ ఇచ్చి ఆమెను కాపాడడాని చెప్పవచ్చును. ఈ సినిమాతో ప్రభాస్ కి, రిచాల సినీ ప్రస్థానంలో కొత్త మలుపునీయడమే కాకుండా, తనకీ ఒక మంచి దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగాడు కొరటాల శివ.   ఈ సినిమా విజయం సాదించడంతో, ఆయనకు రామ్ చరణ్ తేజ్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కూడా వెంటనే దొరికింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది.

రాణాకు క్షమాపణ చెప్పిన అపరిచితుడు

  తమిళ నటుడు విక్రం ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యులో దక్షిణాది నటులేవరూ బాలివుడ్ కి ఎందుకు వెళ్ళట్లేదు?అనే ప్రశ్నకు జవాబిస్తూ గతంలో కమల్ హస్సన్ ‘ఏక దూజేకేలియే’, ‘సాగర్’ వంటి హిందీ సినిమాలు చేసినప్పటికీ, ఆయనకూడా చివరికి దక్షిణాది సినిమాలకే పరిమితమయిపోయారని చెపుతూ, తెలుగు సినిమాలు కాదనుకొని బాలివుడ్ వైపు వెళ్ళిన దగ్గుబాటి రాణా అందుకు భారీ మూల్యమే చెల్లించాడని అన్నారు. ఇక్కడ వస్తున్నమంచి ఆఫర్లను వదులుకొని అక్కడికి వెళ్లి కష్టపడటం ఎందుకని అన్నాడు.   అయితే, ఈ మాటలు మీడియా ద్వారా రాణా చెవులలో వేరేవిదంగా పడటంతో అతను చాలా తీవ్రంగా స్పందించాడు. “25ఏళ్ల బట్టి సినిమాలలో నటిస్తున్న విక్రం, కేవలం రెండున్నర ఏళ్ల క్రితం సినీరంగంలో ప్రవేశించిన నా గురించి మాట్లాడే బదులు, 10 ఫ్లాపులతో అస్తవ్యస్తమయిన తన కెరీర్ గురించి ఆలోచించుకొంటే బాగుంటుంది,” అని అన్నాడు. అయితే, విక్రం రాణా పేరును కేవలం చిన్నఉదాహరణగా పేర్కొనడంతో సమస్య జటిలమయింది. ఇది తెలుసుకొన్నవిక్రం స్వయంగా రాణాకు ఫోన్ చేసి క్షమాపణలు కోరి మీడియా చేతుల్లోపడి ఈ కధ మరింత గాట్టెక్కక మునుపే ముగింపు పలికాడు. వెంటనే రాణా కూడా స్పందిస్తూ, ఇది కేవలం మీడియా కల్పిత కధలు జోడించడం వల్లనే జరిగిందని, ఇక ఈకధ ఇక ముగిసిపోయిందని ట్వీటర్ లో మెసేజ్ పెట్టాడు.