కొత్త రికార్డులు సృష్టిస్తున్న 'నాయక్' రామ్ చరణ్
posted on Dec 28, 2012 @ 3:18PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ చేసినవి ఐదు చిత్రాలైన రికార్డ్ వేటలో మాత్రం ముందుకు దూసుకు పోతున్నాడు. చెర్రీ 'నాయక్' చిత్రంతో కొత్త రికార్డ్ సృష్టించాడు. నాయక్ సినిమా హిందీ శాటిలైట్ హక్కులు మూడున్నర కోట్లకు అమ్ముడుపోయాయి. ఇంతవరకు తెలుగు సినిమాల్లో ఏ చిత్రానికి ఇంత భారీ ఆఫర్ రాలేదు.
మహేష్ బాబు - వెంకటేష్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ "సీతమ వాకిట్లో సిరిమల్లె చెట్టు" కూడా మూడు కోట్లకే అమ్ముడుపోయింది. సినిమా విడుదలకు ముందే కొత్త రికార్డులు సృష్టిస్తున్న ఈ నాయక్, రిలీజ్ తరువాత ఎన్ని రికార్డులు తిరగారాస్తాడో వేచిచూడాలి. హిందీ శాటిలైట్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోవడం పట్ల మన నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హిందీ ఛానెళ్ళు తెలుగు సినిమాల మీద ఆసక్తి చూపడానికి కారణం, హిందీ సినిమాలకంటే మన సినిమాలు చాలా తక్కువ ధరకు దొరకడమేనని ఛానెల్స్ వర్గాలు అంటున్నాయి.