'నాయక్' తో రాత్రంతా గడిపిన ఛార్మి
posted on Dec 22, 2012 @ 10:12AM
నాయక్ రామ్ చరణ్ తో ఛార్మి ఫుల్ నైట్ స్పెండ్ చేసింది. ఈ విషయం తానే స్వయంగా చెప్పింది. ఇందులో దాచటానికి ఏమి లేదు. సినిమా షూటింగ్ లో బాగంగానే ఛార్మి రామ్ చరణ్ తో రాత్రంతా గడపాల్సి వచ్చింది. వివి వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ 'నాయక్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో 'నెల్లూరే' అనే ఐటెం సాంగ్ లో ఛార్మి రామ్ చరణ్ తో కలిసి డాన్స్ చేసింది. ఈ సాంగ్ ను ఇటీవలె హైదరాబాద్ లో చిత్రీకరణ జరిపారు.
ఈ విషయం గురించి చార్మి తన ట్విట్టర్లో పేర్కొంటూ.... ‘నాయక్ సినిమా కోసం ఫుల్ నైట్ షూటింగులో పాల్గొన్నాను. రామ్ చరణ్ తో కలిసి స్టెప్పులేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సాంగు సూపర్ హిట్టవుతుందనే నమ్మకం ఉంది. ఈ పాట కోసం జనవరి వరకూ వేచి చూడండి అని ట్విట్ చేసింది.
ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన అమలపాల్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా, కథ, స్క్రీన్‌ప్లే ఆకుల శివ రాశారు. ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.