రామ్ చరణ్ 'నాయక్' సేట్ లో మెగాస్టార్
posted on Dec 24, 2012 @ 3:06PM
రామ్ చరణ్ "నాయక్" సేట్ లో సడన్ గా అనుకొని గెస్ట్ ప్రత్యక్షమయ్యారు. ఆయన ఎవరో కాదండీ..మన మెగాస్టార్ చిరంజీవి. ఆయన వెళ్ళేసరికి అక్కడ రామ్ చరణ్, ఛార్మి మీద ‘నెల్లూరే..' అనే ఐటం సాంగును షూట్ చేస్తున్నారు. ఈ ఐటెం సాంగ్ లో ఛార్మి డాన్స్ లు చూసి చిరు ఖుషి అయ్యారట !
‘నెల్లూరే..' సాంగ్ లో ఛార్మి డాన్సులు ఆదరగోట్టేసిందని, చిరు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చి ఆ డాన్స్ ని ఆమె చేత మరింత రక్తి కట్టించారని టాక్. సేట్ లో అనుకొని అతిధి ని చూసి ఛార్మి పొంగిపోయింది. తనకు సూచనలు ఇచ్చినందుకు చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపింది. చిరు నేటికి డాన్సుల్లో అదే ఉపును కొనసాగించడం చూసి ఛార్మి ఆశ్చర్యపోయిందట. దాట్ ఇస్ చిరు..!