నా జీవితం పణంగా పెట్టి ఎందరికో అవకాశాలు ఇచ్చా: దాసరి
posted on Dec 20, 2012 @ 2:35PM
రజనీకాంత్ జీవితం మీద దర్శకుడు సురేష్ కృష్ణ రాసిన ‘ఒకే ఒక్కడు’ పుస్తకం విడుదల కార్యక్రమ౦లో దాసరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అడ్రస్ లేని వాళ్లకు అడ్రస్ ఇచ్చా. వేశం కోసం నా ఇంటి చుట్టూ తిరిగిన వాళ్లు ఇప్పుడు నన్ను మరిచిపోయారు. నా జీవితం పణంగా పెట్టి ఎందరికో అవకాశాలు ఇచ్చాను. ఇలాంటి వారందరి చరిత్రను త్వరలో ఓ పుస్తకం రూపంలో బయటకు తెస్తా. వారందరి గుట్టూ విప్పుతా” అని దాసరి నారాయణ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
నా జీవితాన్ని పణంగా పెట్టి కొందరికి జీవితాలు ఇచ్చానని, వేశాల కోసం నా ఇంటి చుట్టూ సైకిల్ మీద తిరిగిన వాళ్లు ఇప్పుడు వాళ్లు వచ్చినప్పుడు నేను లేవలేదని అంటున్నారని ఇలాంటి వాళ్ల గురించి రాయాలా వద్దా ? ఇలాంటి వారి నైజం బయట పెట్టాల్సిన ఆవసరం ఉందా ? లేదా ? అని దాసరి ప్రశ్నించారు. ఖచ్చితంగా పుస్తకం రాస్తా, కానీ ఎవరినీ నొప్పించను అని దాసరి అన్నారు.
రజనీకాంత్ ఓ సూపర్ స్టార్ అని, అది మామూలుగా రాదని, ఓ ఎన్టీఆర్, ఓ ఎంజీఆర్ ఇలా అందరూ తమ తమ నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారని, అది ఈ భూమి ఉన్నంతవరకు వారి మీద అభిమానం అలాగే ఉంటుందని అన్నారు. తూర్పుపడమర చిత్రానికి ఒక్కరోజు ముందు మోహన్ బాబు ను బుక్ చేసుకున్నానని, ఆ తరువాత రజనీకాంత్ వచ్చి తన ఫోటోలు చూయించాడని ఒకవేళ మోహన్ బాబు లేకపోతే అందులో రజనీకాంత్ ఉండేవాడని అన్నారు. కానీ ఇప్పటికి రజనీ ఆ ఫోటోలు చూయించానని ఇప్పటికీ చెప్పడం ఆయన సంస్కారానికి నిదర్శనం అని, భారతదేశంలోనే రజనీ ఓ సూపర్ స్టార్ అని దాసరి అన్నారు.