నాయక్ రామ్ చరణ్ 'వెంట్రుక' ఛానెల్ ఇదేనా...?

 

 

 


రామ్ చరణ్ నాయక్ ఆడియో ఫంక్షన్ లో చేసిన 'వెంట్రుక' అనే కామెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మా కుటుంబం గురించి, అనుబంధాల గురించి అడ్డగోలుగా రాసే ఆ పేపర్, ఛానల్ వార్తలు నా 'వెంట్రుక'తో సమానం అని చరణ్ అన్నాడు. రామ్ చరణ్ మీడియా పేరు చెప్పకపోయినా అది ఓ ప్రముఖ తెలుగు ఛానెల్ ని ఉద్దేశించి అన్నాదేనని అభిమానులు అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఓ ప్రముఖ తెలుగు పేపరు సైతం అంతే ఘాటుగా స్పందించినట్టుగానే ఉంది.


మంగళవారం ఎడిషన్ లో (18/12/2012)  'చిరుత'నయుడి నోటి దురుసు అనే టైటిల్ తో ఓ ప్రముఖ తెలుగు పేపరు ప్రచురించిన కధనం మీ కోసం:   


" సాధారణ నటుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన చిరంజీవి మాటతీరు.. ఎదిగిన కొద్ది ఒదిగే ప్రవర్తన ఆయనను . మెగాస్టార్ హోదాను సంపాదించుకునేలా చేసింది (రాజకీయాల్లో కాదులే). అయితే ఆయన వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన రాం చరణ్ తేజ సినిమా అనుభవం ఐదు చిత్రాలే.. అయితే చెర్రీ (చరణ్) వయస్సు ప్రభావమో.. లేక అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి మూలంగానో సోమవారం హైదరాబాద్ లో జరిగిన 'నాయక్' చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో కొంచెం అతిగా మాట్లాడటం కొంత వివాదానికి చోటిచ్చింది. ప్రస్తుతం ‘జంజీర్' చిత్రంలో రామ్‌చరణ్ యాంగ్రీ మాన్ పాత్ర పోషించడం కారణంగానో ఏమో.. తెరపైనే కాదు ‘నాయక్' ఆడియో ఆవిష్కరణ వేడుకలో కూడా చరణ్ ఆ విధంగానే కనిపించారు. పేరు చెప్పకుండా ఒక టీవీ చానల్, పేపర్‌ను టార్గెట్ చేసి, దూషించారు. చాలా సాదాసీదాగా ప్రసంగాన్ని ప్రారంభించిన చరణ్ .. కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు. జీవితమంటే నున్నటి బాటపై బెంజ్ కార్లలో ప్రయాణించడమంత సులభం కాదనే విషయం అప్పుడే అర్ధం కాదు అని చరణ్ వ్యాఖ్యలపై పలువురు వ్యాఖ్యానించారు. చిరంజీవి సినీ జీవితాన్ని దగ్గరగా చూసిన చరణ్.. జీవితమంటే ఎన్నో ఆటుపోట్లు ఉంటాయని గ్రహించ లేకపోవడం తప్పేనంటున్నారు. చిన్న చిన్న విషయాలకు అతిగా నోరుపారేసుకోకుండా ఉండటం అనేది చరణ్ కు కాలం, అనుభవం నేర్పుతుందేమో చూడాల్సిందే. చరణ్ లాంటి నవతరం హీరోలను మీడియా ఆకాశానికి ఎత్తకపోతే గింజుకుంటారనేది కాదనలేని వాస్తవం. 'మీడియా మీ గురించి మాట్లాడటం ఆపేస్తే.. ఏమవుతుందో ఊహించుకోండి' అంటూ కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో బాబాయి పవన్ కళ్యాణ్ కొట్టిన డైలాగ్స్ ను చరణ్ ఓ సారి గుర్తు చేసుకుంటే మంచిదని సినీ విమర్శకులు అంటున్నారు. సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ప్రయాణించాల్సిన వారు ఆదిలోనే తప్పటడుగులు వేయడం ఎవరూ హర్షించరనే విషయాన్ని చరణ్ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అంటూ రాసుకొచ్చింది.

Teluguone gnews banner