ఛార్మి కి బంపర్ ఆఫరే !
posted on Dec 31, 2012 @ 5:36PM
ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వేడుకల సమయంలో సినీ హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే,ఈ ఏడాది ఆ డిమాండ్ గతంతో పోలిస్తే బాగా పడిపోయింది.
దీనితో, అనేక మంది తెలుగు సిని హీరోయిన్లు ఈ సారి రెండు, మూడు లక్షలకే వివిధ పార్టీల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరందరిలోకి చార్మి మాత్రం బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆమెకు హైదరాబాద్ లో గల జూబ్లి క్లబ్ ఆ ఒక్క రోజుకు 15 లక్షల బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. జూబ్లి సభ్యులకు మాత్రమే సభ్యత్వం ఉండే ఆ క్లబ్ లో ఆ ఒక్క రోజు నృత్యం చేయడానికి ఆమెకు ఈ మొత్తం ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.
ఆ భామ కు సినిమా చాన్సులు పెద్దగా లేనప్పటికీ, ఈ బంపర్ ఆఫర్ రావడం పట్ల సిని పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది. అయితే, బాలీవుడ్ సుందరీ మణులతో పోలిస్తే, ఇది అసలు ఏ మాత్రం గొప్ప మొత్తం కాదు. ఎందు కంటే, వారికి ఆ ఒక్క రోజుకు కోట్లలో సంపాదన ఉంటుంది. 25 సంవత్సరాల ఈ భామ పంజాబీకి చెందిన, ముంబాయి లో పుట్టిన నటీమణి. ఆమె 2002 లో ‘నీ తోడూ కావాలి’ అనే చిత్రంతో పరిశ్రమలో ప్రవేశించింది.