ఒంగోలులో ఒంగిపోనున్న ఫ్యాన్ రెక్కలు?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన అటకెక్కింది. జనం ఛీ కొట్టి మరీ గద్దె దింపేశారు. గత ఎన్నికలలో 151 స్థానాలలో గెలిపించి అందలం ఎక్కించిన జనమే జగన్ ఐదేళ్ల పాలనతో విసిగి, వేసారి ఐదేళ్లకే ఆ పార్టీని 11 స్థానాలకు పరిమితం చేసి విపక్షంగా గొంతెత్తే అర్హత కూడా లేదని  ఓటు ద్వారా ఆ పార్టీని ఊడ్చిపారేశారు. ఇప్పుడు ప్రజాతీర్పు ప్రభావం ఆ పార్టీ చేతిలో ఉన్న స్థానిక సంస్థలపైనా పడుతోంది. దౌర్జన్యాలతో, దాష్టీకాలతో  స్థానిక సంస్థలపై ఆధిపత్యం సొంతం చేసుకున్న వైసీపీ ఇప్పుడు వాటిని కూడా కొల్పోయే పరిస్థితిలో పడింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని  ఒంగోలు కార్పొరేషన్, మార్కాపురం, కందుకూరు, చీరాల మునిసిపాలిటీలు, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు మేజర్ పంచాయతీల్లో వైసీపీ అధికారం కొల్పోయే పరిస్థితి  ఏర్పడింది. ఎందుకంటే ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు ఇప్పడు వైసీపీని వీడి తెలుగుదేశం గూటికి చేరేందుకు తహతహలాడుతున్నారు. ముఖ్యంగా ఒంగోలు కార్పొరేషన్ వైసీపీ చేతి నుంచి తెలుగుదేశం చేతుల్లోకి రావడానికి ఎంతో కాలం పట్టదని అంటున్నారు.  తాజా ఎన్నికలలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం అద్భుత ఫలితాలు సాధించింది. ప్రజలు వైసీపీని పూర్తిగా తిరస్కరించారు. దీంతో  ఇప్పుడు జిల్లాలోన కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో కూడా ప్రజాభీష్టం మేరకు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు తమ లాయల్టీని మార్చుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ముఖ్యంగా ఒంగోలులో ఈ పరిస్థితి మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. పాపం మాజీ ఎమ్మెల్యే, జగన్ కు బంధువు బాలినేని ఒంగోలు కార్పొరేషన్ వైసీపీ చేజారకుండా చూసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఒంగోలు కార్పొరేటర్లు, మేయర్ తో భేటీ అయ్యారు. వారిని పిలిపించుకుని మరీ మట్లాడారు. అయితే సమావేశంలో బాలినేని మాటలకు సానుకూల స్పందన కరవైందని ఆ భేటీ తరువాత కార్పొరేటర్లే మీడియాకు లీక్ చేశారు. ఈ భేటీ గత మంగళవారం జరిగగిందని చెబుతున్నారు. మొత్తం 38 మంది కార్పొరేటర్లకు గాను ఈ భేటీకి 27 మంది హాజరయ్యారు. మేయర్  సుజాత అయితే ఇప్పటికే  తెలుగుదేశంతో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. ఆమెతో పాటుగా తెలుగుదేశం గూటికి చేరడానికి మెజారిటీ కార్పొరేటర్లు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. వీరంతా ఇప్పటికే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో టచ్ లో ఉన్నారనీ, ఆయన ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు తెలుగుదేశం జెండా పట్టుకోవడం ఖాయమని అంటున్నారు.  

గురువిందకి గురువు జగన్!

అధికారంలో ఉన్నంత కాలం జగన్ కు, ఆయన పార్టీ నేతలకూ ఆత్మస్థుతి పరనింద తప్ప మరో విషయం తెలియనట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు పార్టీ ఘోర పరాజయం పాలైన తరువాత, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జనం కర్రు కాల్చి వాతపెట్టిన తరువాత వారికి తెలియని మరో పదం ఇప్పుడు వారి డిక్షనరీలో చేరింది. అది ఆత్మ వంచన. ఔను ఇప్పుడు వైసీపీ ఆత్మస్థుతి, పరనిందలకు తోడు అత్మవంచన కూడా చేసుకుంది. తాజాగా జగన్ పార్టీ ఎమ్మెల్సీలు, నేతలతో భేటీలో మాట్లాడిన మాటలు వింటే అవిషయం విస్ఫష్టంగా అర్ధమౌతుంది. ఐదేళ్ల అరాచకపాలనను జనం నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. గత ఎన్నికలలో 151 సీట్లతో అందలం ఎక్కించిన జనమే ఇప్పుడు 11 ఔను 11 స్థానాలకు పరిమితం చేసి, నీ స్థాయి ఇది నాయనా అని బటన్ నొక్కి ఓటు వేసి మరీ చెప్పారు. అయినా జగన్ కు తత్వం బోధపడినట్లు కనిపించడం లేదు.  ఎవరైనా ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. ఎందుకు ఓడిపోయాం అన్న విషయంపై సమీక్షలు నిర్వహించుకుని పోస్టు మార్టం చేసుకుంటారు. తప్పులు దిద్దుకుని, తిరిగి ప్రజాభిమానం చూరగొనేందుకు ప్రణాళికలు రచించుకుంటారు. కానీ అటువంటిదేమీ జగన్ లో కానీ, వైసీపీలో కానీ కనిపించడం లేదు. ఇప్పటికీ అదే ఆత్మస్థుతి, పరనింద, ఆత్మ వంచన.   ఎమ్మెల్సీలతో భేటీలో జగన్ మాట్లాడిన మాటలు చూస్తే నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులు గడిచాయో లేదో, చంద్రబాబు తన కేబినెట్ సహచరులకు ఇంకా శాఖలు కూడా కేటాయించలేదు. అయితే అప్పుడు జగన్  తన వికృత మనస్తత్వాన్ని ప్రదర్శించేశారు.  కేంద్రంలో కొలువుదీరిన మోడీ సర్కార్ పై ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పట్టుపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఐదేళ్ల పాటు అధికారం వెలగబెట్టిన తాను ఆ పని ఎందుకు చేయలేదన్న ఆత్మ విమర్శ చేసుకుని, అలా పట్టుబట్ట లేకపోవడానికి కారణం తనపై ఉన్న కేసుల భయమేనని  ఒప్పుకుని ఈ డిమాండ్ చేసి ఉండాల్సింది. అసలు 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు కేంద్రంతో, మోడీతో విభేదించడానికి కారణం ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక ప్రతిపత్తి, విభజన    చట్టం మేరకు హామీల అమలుకోసమే కదా?  ఇక రాష్ట్ర అవసరాలు, ప్రయోజనాల ఊసెత్తకుండా ఐదేళ్ల పాటు అధకారం వెలగబెట్టిన జగన్ ఎంత సేపూ తన కేసుల నుంచి రక్షణ కోసం వినా రాష్ట్రం కోసం కేంద్రానికి కనీసం ఒక్క వినతి కూడా చేయకుండానే నెట్టు కొచ్చేశారు. ఇప్పుడు కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు సర్కార్ కు సుద్దులు బోధించడానికి రెడీ అయిపోయారు.  సరే అదలా ఉంచితే.. జగన్ ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయి, మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం అంటూ ఎమ్మెల్సీలకు భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పుకున్న జగన్, ఆ సంక్షేమ ఫలాలు అందుకున్న అవ్వా తాతలు, అక్కచెల్లెమ్మలు మనకు ద్రోహం చేశారని చెప్పుకొచ్చారు. వారు అలా ద్రోహం చేయడం వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందన్న అనుమానమూ వ్యక్తం చేశారు. ట్యాంపరింగ్ టెక్నాలజీతో ఈవీఎంలను ట్యాంపర్ చేశారనీ ఆరోపణలు గుప్పించారు.  జగన్ ఈ తీరు ఆ పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలకుండా కనుమరుగైపోవడానికే దారి తీస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే వైసీపీలో ఓ వెలుగువెలిగిన నేతలంతా పార్టీకి ముఖం చాటేశారు. తెలుగుదేశం తలుపులు మూసుకుపోయిన వారంతా కాంగ్రెస్, బీజేపీలవైపు చూస్తున్నారు. ఆ భయంతోనే ఆయన తన జగన్మాయావాక్కులతో ఎమ్మెల్సీలను పార్టీ మారకుండా నిరోధించేందుకు ప్రయాసపడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఐదేళ్లు కళ్లు మూసుకుంటే  మళ్లీ అధికారంలోకి వచ్చేస్తామంటూ ఆయన చెప్పిన మాటలకు వైసీపీ ఎమ్మెల్యేలే పెదవి విరుస్తున్నారు. ఐదేళ్లు కళ్లు మూసుకునే బదులు ఇప్పుడే కళ్లు తెరిచి జగన్ కు ఆయన కోసం ఆయన చేత ఆయనే ఏర్పాటు చేసుకున్న పార్టీకి ఎంత తొందరగా దూరమైతే అంత మేలని భావిస్తున్నారు.  

చంద్ర‌బాబు స్కిల్ సెన్సెస్.. దేశానికే ఆద‌ర్శం?

ఏపీలోచంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్ర‌బాబు నాయుడు, 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. స‌చివాల‌యం మొదటి బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంట‌నే ఎన్నికలకు ముందు ఇచ్చిన ప‌లు హామీల‌కు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. ఇందులో మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేయ‌గా.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశారు. పింఛన్‍ను రూ.4 వేలకు పెంచే దస్త్రంపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం చేశారు. ఐదో సంత‌కం స్కిల్ సెన్సెస్ పై చేశారు. ఈ ఐదు సంతకాల్లోనూ అత్యంత కీలకమైనది  స్కిల్ స‌న్సెస్‌. రాబోయే కాలంలో ఈ స్కిల్ సెన్సెస్‌ దేశానికే ఆద‌ర్శం అవుతుంద‌ని విద్యావంతులు పేర్కొంటున్నారు. గ‌త ఐదేళ్ల కాలంలో ఏపీలో యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు లేక ఇత‌ర రాష్ట్రాల‌కు  త‌ర‌లిపోయారు. దీనికితోడు ఏపీకి రాజ‌ధాని లేక‌పోవ‌టం, జగన్ పారిశ్రామిక వ్యతిరేక విధానాల కారణంగా కొత్త కంపెనీలు రాష్ట్రంలోకి రాలేదు. చంద్ర‌బాబు హ‌యాంలో వ‌చ్చిన కంపెనీలు సైతం సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌తో రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయి. దీంతో ఉపాధి అవ‌కాశాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. తాజాగా.. రాష్ట్రంలో నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు చంద్ర‌బాబు నాయుడు స్కిల్ సెన్సెస్ ను అమ‌ల్లోకి తీసుకురాబోతున్నారు.  స్కిల్ సెన్సెస్ దేశంలో అత్యంత ముఖ్య‌మైన అంశంగా మార‌బోతుంద‌నే చ‌ర్చ జ‌రుగుతుంది. ఒక‌ విధంగా చెప్పాలంటే రాబోయే కాలంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాలు స్కిల్ సెన్సెస్ ను అమ‌లు చేసే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. దీనిలో అంత ప్రాముఖ్య‌త ఏముంద‌నే విష‌యానికి వ‌స్తే.. సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల పాల‌న‌లో రాష్ట్ర‌ ప్ర‌జ‌లు అన్ని విధాలుగా న‌ష్ట‌పోయారు. ముఖ్యంగా చ‌దువుకున్న యువ‌త అయితే.. ఉద్యోగాలు లేక చిన్న‌చిన్న ప‌నులు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. కొంద‌రు ఉపాధికోసం ఇత‌ర రాష్ట్రాల‌కు, దేశాల‌కు వెళ్లిపోగా.. మ‌రికొంద‌రు రాష్ట్రంలోనే ఉంటూ గంజాయి, మ‌త్తు ప‌దార్ధాల‌కు అల‌వాటుప‌డి త‌మ జీవితాల‌ను అంధ‌కారంలోకి నెట్టేసుకున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ‌ యువ‌తకుతోడు.. ఇత‌ర రాష్ట్రాలు, దేశాల‌కు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న వారికోసం చంద్ర‌బాబు నాయుడు స్కిల్ సెన్సెస్ అనే కార్య‌క్ర‌మాన్ని అమ‌ల్లోకి తీసుకొస్తూ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే సంత‌కం చేశారు. ఈ స్కిల్ సెన్సెస్ ద్వారా ప్ర‌పంచంలోని ఐటీ, నాన్ ఐటీకి సంబంధించిన ప్ర‌ముఖ కంపెనీలు భారీగా పెట్టుబ‌డులు పెట్టేందుకు అవ‌కాశాలు ఉండ‌టంతో పాటు.. ఇక్కడ యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు అందించేందుకు ఆస్కారం ఉంటుంది. స్కిల్ సెన్సెస్ ద్వారా రాష్ట్రంలోని ప్ర‌తీ ఇంటికి వెళ్లి స‌ర్వే చేస్తారు. ఆధార్ కార్డు ద్వారా ఇంట్లో ఎంత మంది చ‌దువుకున్న యువ‌త ఉన్నారు. వారు ఎంత‌వ‌ర‌కు చ‌దువుకున్నారు. ప్ర‌స్తుతం వారు ఉద్యోగం చేస్తున్నారా? ఉద్యోగం చేస్తున్న‌ట్ల‌యితే ఏ రాష్ట్రంలో, దేశంలో ఉన్నారు. వారు ఏఏ కంపెనీలు, ఏఏ విభాగాల్లో ఉద్యోగం చేస్తున్నారు అనే వివ‌రాల‌ను సేక‌రిస్తారు. ఈ వివ‌రాల ద్వారా రాష్ట్రంలో ఆయా విభాగాల్లో ఉద్యోగం చేస్తున్న‌వారు ఎంత మంది ఉన్నార‌నే విష‌యంపై రాష్ట్ర ప్ర‌భుత్వానికి పూర్తి అవ‌గాహ‌న వ‌స్తుంది. దీనికి తోడు రాష్ట్రంలో ఉంటున్న యువ‌త‌కు వారికి ఆస‌క్తి ఉన్న‌రంగాల్లో శిక్ష‌ణ‌  ఇస్తారు. ఇక్క‌డ మ‌నం ఓ విష‌యం తెలుసుకోవాలి.. ఒక రాష్ట్రంలో ల‌క్ష‌ల‌ కోట్లు పెట్టుబ‌డులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు రావాలంటే కంపెనీల ప్ర‌తినిధులు ముందుగా ప్ర‌భుత్వ స‌హ‌కారం, ఆ త‌రువాత మ్యాన్ ప‌వ‌ర్ కోసం ఆలోచిస్తారు. కొత్త రాష్ట్ర‌మైన ఏపీలో ప్ర‌భుత్వ స‌హ‌కారం ఉన్నా.. మ్యాన్ ప‌వ‌ర్ దొర‌క‌డం క‌ష్టం. అలా అని వాళ్లు ల‌క్ష‌ల‌కోట్లు వెచ్చించి కంపెనీలు ఏర్పాటుచేసి ఇత‌ర రాష్ట్రాల నుంచి ఉద్యోగుల‌ను ఇక్క‌డ‌కు తీసురావ‌డం క‌ష్ట‌మైనప‌నే. దీంతో ఐటీ, నాన్ ఐటీ రంగాల‌కు చెందిన కంపెనీలు అన్నిసౌక‌ర్యాలు అందుబాటులో ఉన్న హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై వంటి రాష్ట్రాల్లో త‌మ కంపెనీల‌ను ఏర్పాటు చేసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. అయితే, చంద్ర‌బాబు తీసుకున్న తాజా నిర్ణ‌యం ద్వారా కంపెనీల నిర్వాహ‌కులు ఏపీలో ల‌క్ష‌ల‌కోట్లు పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎక్కువ అవ‌కాశాలు ఉంటాయి.  స్కిల్ సెన్సెస్ ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం సేక‌రించిన డేటా ప్ర‌కారం.. రాష్ట్రంలో.. ఫైనాన్స్ విభాగం వారు ఇంత మంది ఉన్నారు.. ఎల‌క్ట్రిక‌ల్ విభాగం వారు ఎంత‌ మంది ఉన్నారు.. ఐటీ రంగంలో ప‌నిచేస్తున్న‌వారు ఎంత‌ మంది ఉన్నారు.. ఇలా ఇత‌ర రంగాల్లో ఏ విభాగంలో ఎంత‌మంది ఉన్నారు..? వారు ఎక్క‌డెక్క‌డ ప‌నిచేస్తున్నార‌నే విష‌యాలు ప్ర‌భుత్వం వ‌ద్ద ఉంటాయి. వీటిని కంపెనీల ప్ర‌తినిధుల ముందుఉంచి మా రాష్ట్రంలో మీరు పెట్టుబ‌డులు పెడితే ప్ర‌భుత్వం నుంచి మీకు అన్ని విధాల స‌హ‌కారం అందించ‌డంతోపాటు.. మీకు కావాల్సిన ఉద్యోగులుకూడా అందుబాటులో ఉంటార‌ని లెక్క‌ల‌తో స‌హా వివ‌రిస్తుంది. మీరు మంచి జీత భ‌త్యాలు ఇవ్వ‌గ‌లిగితే ఇత‌ర రాష్ట్రాల్లో  దేశాల్లో ఆయా విభాగాల్లో ప‌నిచేస్తున్న వారు స్వ‌రాష్ట్రానికి వ‌చ్చి ఉద్యోగం చేసుకుంటారు. అంతే కాదు..   ప్ర‌స్తుతం శిక్ష‌ణ పొందుతున్న వారుకూడా ఉన్నార‌ని ప్ర‌భుత్వం కంపెనీల ప్ర‌తినిధుల‌కు తెలియ‌జేస్తుంది. ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు పెట్టే ఏ కంపెనీ నిర్వాహ‌కుల‌కైనా ప్ర‌భుత్వం నుంచి స‌హ‌కారంతోపాటు, వారికి కావాల్సిన విభాగాల్లో ఉద్యోగ‌స్తులు అందుబాటులో ఉన్నారంటే అంత‌క‌న్నా కావాల్సింది మ‌రొక‌టి ఉండ‌దు. దీంతో పాటు ఇత‌ర రాష్ట్రాలు, ఇత‌ర దేశాల‌కు వెళ్లి 50వేల నుంచి ల‌క్ష జీతంతో ఉద్యోగం చేస్తున్న వారు సొంత రాష్ట్రంలో అదే జీతంతో ఉద్యోగం దొరుకుతుందంటే త‌ప్ప‌కుండా స్వ‌రాష్ట్రానికి వ‌చ్చేస్తారు. ఇలా చంద్ర‌బాబు నాయుడు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఐదో సంత‌కం చేసిన స్కిల్ సెన్సెస్ రాష్ట్ర అభివృద్ధిలో కీల‌క భూమిక పోషించ‌బోతున్నది. ఒక‌ విధంగా చెప్పాలంటే.. బీసీ జ‌న‌ గ‌ణ‌న కంటే స్కిల్ సెన్సెస్ దేశంలో కీల‌కంగా మారే అవ‌కాశం ఉంది. బీసీ జ‌న‌గ‌ణ‌న అనేది రాజ‌కీయ ల‌బ్ధి కోసం చేసేది.. స్కిల్ సెన్సెస్ అనేది యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేది. మొత్తానికి చంద్ర‌బాబు నాయుడు అమ‌ల్లోకి తీసుకురాబోతున్న స్కిల్‌ సెన్సెస్ కార్య‌క్ర‌మం దేశానికే ఆదర్శంగా  మార‌బోతుంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.

బీజేపీ వనంలోకి వైసీపీ రోజా?

ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకోబోతున్నాయా..?  మూలిగే న‌క్క‌పై తాడిపండు ప‌డిన చందంగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌బోతుందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు అధికార మ‌దంతో కొంద‌రు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై బూతుల‌తో దండ‌యాత్ర చేశారు. చంద్ర‌బాబు ఫ్యామిలీని సైతం వ‌ద‌ల్లేదు. భువ‌నేశ్వ‌రితో పాటు నారా లోకేశ్‌, బాల‌కృష్ణ వంటి నేత‌ల‌పైనా అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. అధికారంలో ఉన్నాం.. మ‌న‌ల్ని ఎవ‌రూ ఏమీ చెయ్య‌లేర‌న్న అహంతో  విర్రవీగారు. మొద‌టి నుంచి వీరి ప్ర‌వ‌ర్త‌న‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తూ వ‌చ్చిన ప్ర‌జ‌లు ఓటు ద్వారా దిమ్మ‌ తిరిగే షాకిచ్చారు. గ‌త ఐదేళ్ల కాలంలో బూతుల‌తో ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌పై రెచ్చిపోయిన నేత‌లంద‌రూ ఓట‌మి పాల‌య్యారు. తెలుగుదేశం కూటమి భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ నేత‌ల‌పై ఇష్టారీతిలో వ్యాఖ్య‌లు చేసిన వారిని వ‌దిలేది లేద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. దీంతో అధికారంలో ఉన్న‌ప్పుడు బూతుల‌తో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై రెచ్చిపోయిన వైసీపీ నేత‌ల్లో వ‌ణుకు మొద‌లైంది. ఈ క్ర‌మంలో కొంద‌రు నేత‌లు వైసీపీని వీడి సేఫ్ జోన్‌లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు  పెట్టారు.    సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, దేశంలోని ఎన్డీయే ప‌క్ష పార్టీల నేత‌లు హాజ‌ర‌య్యారు. ఈ ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, మోదీల మ‌ధ్య అనుబంధాన్ని చూసిన వైసీపీ నేత‌లు రాబోయే రోజుల్లో వైసీపీకి గ‌డ్డుకాల‌మేన‌న్న నిర్థారణకు వచ్చేశారు.   అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు, ప‌వ‌న్ పై బూతుల‌తో రెచ్చిపోయిన కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, ఆర్కే రోజా, అంబ‌టి రాంబాబు, అనిల్ కుమార్ యాద‌వ్ వంటి నేత‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది. అధికారంలో ఉండగా చేసిన అక్రమాలు, అరాచకాల కారణంగా   త‌మ అరెస్ట్ ఖాయ‌మ‌ని వారు భావిస్తున్నార‌ట‌. చంద్ర‌బాబు యాక్ష‌న్‌లోకి దిగ‌క‌ముందే వైసీపీని వీడి సేఫ్ జోన్‌లోకి వెళ్లాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యంలో ఆర్కే రోజా ముందు వ‌రుస‌లో ఉన్న‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. చంద్రబాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ పై అధికారంలో ఉన్న‌ప్పుడు ఆర్కే రోజా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. రోజాపై తెలుగుదేశం నేత‌ల‌తో పాటు జ‌న‌సేన నేత‌లుసైతం ఆగ్ర‌హంతో ఉన్నారు.  తెలుగుదేశం కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి ఆర్కే రోజా ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు. ఆమె చెన్నై వెళ్లారా?  బెంగ‌ళూరు వెళ్లారా అనే విష‌యంపైనా స్పష్ట‌త లేదు. పోలింగ్ రోజే రోజా తన ఓటమిని అంగీకరించేసి, వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఆ తరువాత ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ ప్రారంభ‌మైన కొద్ది గంట‌ల‌కే  ఓటమి తథ్యమని అర్థం చేసుకుని రోజా అక్క‌డి నుండి వెళ్లిపోయారు. మీడియాతో కూడా మాట్లాడలేదు. అంతే అప్పటి నుంచి ఇప్పటి వరకూ రోజా అజ్ఞాత వాసం చేస్తున్నారు.  వైసీపీని వీడి సేఫ్ పార్టీలోకి చేరలన్న ఉద్దేశంతో ఉన్నారని ఆమె వర్గీయులు చెబుతున్నారు.   రోజాకు తెలుగుదేశం, జనసేన తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయి. ఇక మిగిలింది బీజేపీ మాత్రమే.  అందుకే ఆమె కమలం గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే  మూడో సారి ప్రధానిగా మోడీ  ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని మోడీకి, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు అభినందనలు తెలుపుతూ రోజా ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్ల ద్వారా బీజేపీ వర్గాలతో టచ్ లోకి వెళ్లి ఆ పార్టీ గూటికి చేరాలని ఆమె విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అయితేఅవేమంత ఫలించే అవకాశాలు పెద్దగా లేవనీ అంటున్నారు. మొత్తం మీద రోజా వైసీపీకి సాధ్యమైనంత దూరం జరిగితేనే తనకు సేఫ్ అని భావిస్తున్నారన్నది మాత్రం వాస్తవం.  

జగన్‌కి కొత్త భయం పట్టుకుంది!

ఒకపక్క నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలోనే వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీలతోపాటు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కనిపించకుండా పోయారని అందరూ వెతుకుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ సమావేశంలో  కనిపించారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు భారీ సంఖ్యలో పార్టీ మారే అవకాశం వుందని జగన్‌కి సమాచారం అందడంతో ఆయన అప్రమత్తం అయ్యారు. వాళ్ళు చేజారిపోకుండా చేసేందుకే జగన్ ఈ సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఈ ఐదు సంవత్సరాలు కళ్ళుమూసి తెరిచేలోగా అయిపోయాయని, ఇంకో ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని, అప్పటి వరకు ఓర్పుగా వుండాలని ఎమ్మెల్సీలకు సూచించారు. ‘ఓర్పుగా వుండటం’ అంటే అర్థం మరేదో కాదు.. పార్టీ వదిలి వెళ్ళిపోవద్దని అన్యాపదేశంగా చెప్పడమే. అధికారం పోయిన తర్వాత కష్టాలు రావడం సహజమని, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా వుండాలని ఆయన ఎమ్మెల్సీలకు ఉద్బోధించారు. మరి జగన్ కోరుకుంటున్నట్టు ఆయన పార్టీ ఎమ్మెల్సీలు కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా వున్నారో లేదో కాలమే తెలియజేస్తుంది.

లాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత జగన్ ప్రభుత్వం రైతుల భూముల మీద కన్నేసి తీసుకు వచ్చిన లాండ్ టైటిలింగ్ యాక్ట్.ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేశారు. గురువారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన కీలక ఫైల్స్ మీద సంతకం చేశారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన రెండో ఫైల్ మీద ఆయన సంతకం చేయడంతో, ఆంధ్రప్రదేశ్ రైతుల భూములకు పట్టిన గ్రహణం వదిలింది. చాలా లోపాలు కలిగి వుండటంతోపాటు రైతులు తమ భూముల మీద హక్కులు కోల్పోయే విధంగా వున్న ఈ యాక్ట్.ని రద్దు చేయాలని రైతులు ఎంత ప్రాధేయపడినా, వందలాది మంది లాయర్లు నిరసన వ్యక్తం చేసినా జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా ఈ చట్టాన్ని ఆమోదించారు. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు ఈ చట్టం వల్ల ప్రజలకు కలిగే నష్టాన్ని వివరించారు. తాను అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నెరవేరుస్తూ ఈ దారుణమైన చట్టాన్ని రద్దు చేశారు.

చంద్రబాబు స్వర్ణయుగం ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని తన ఛాంబర్లో వేద పండితుల ఆశీర్వచనాలు, దీవెనలతో బాధ్యతలు స్వీకరించారు. దారి పొడవునా భారీ స్వాగతాలతో రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న ఆయన అధికారిక ఫైళ్ళ మీద సంతకాలు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు సచివాలయానికి వెళ్తున్న సమయంలో రాజధాని రైతులు, ఉద్యోగులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. దారి పొడవునా ఆయనకు స్వాగతం పలుకుతూ భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. జై చంద్రబాబు అని నినాదాలు చేస్తూ ఆయనపై పుష్పవర్షం కురిపించారు.

ఏపీ బేవరేజస్ మాజీ ఎండీకి ముందస్తు బెయిలు నిరాకరించిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. ఏపీ సీఐడీ ఇప్పటికే ఆయన నివాసంలో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన ముందస్తు బెయిలు మంజూరుకు తిరస్కరించిన హైకోర్టు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. జగన్ ప్రభుత్వం అవలంబించిన మద్యం విధానంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అధికారం కోల్పోయిన వెంటనే   ఆంధ్రప్రదేశ్ సీఐడీ మద్యం కుంభకోణంపై దృష్టి సారించింది.  ఆంధ్రప్రదేశ్ బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి హైదరాబాద్‌  గచ్చిబౌలీలోని నివాసంలో  సోదాలు నిర్వహించింది.  

సన్నీ లియోన్ ప్రదర్శిస్తానంటే నో అన్నారు!

నటి సన్నీ లియోన్ దేంట్లో స్పెషలిస్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడామె ఆ స్పెషలిస్టు పనులు చేయకుండా, చక్కగా సినిమాల్లో యాక్ట్ చేస్తూ టైమ్ పాస్ చేస్తోంది. అడపాదడపా పలు ప్రాంతాల్లో ఈవెంట్లు నిర్వహిస్తూ నాలుగు డబ్బులు వెనకేసుకోవడంతోపాటు కుర్రకారుకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది. అయితే సన్నీ లియోన్ లేటెస్ట్.గా కేరళలోని తిరువనంతపురం యూనివర్సిటీ క్యాంపస్‌లో తన ఈవెంట్ ప్రదర్శన ఏర్పాటు చేయాలని అనుకుని సదరు యూనివర్సిటీ వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంది. అయితే నీ ప్రదర్శనకు అనుమతి ఇవ్వం బాబోయ్ అని ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ఎందుకంటే, గత సంవత్సరం కేరళలోనే వున్న ఎర్నాకుళం జిల్లాలోని కొచ్చిన్ యూనివర్సిటీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సన్నీ లియోన్ పాల్గొంది. సన్నీ లియోన్ వస్తుందంటే పరిస్థితి ఎలా వుంటుంది? స్టూడెంట్ కుర్రాళ్ళు వేల సంఖ్యలో లొట్టలేసుకుంటూ వచ్చేశారు. వాళ్ళందరూ ఒకేసారి వచ్చేసరికి భారీగా తొక్కిసలాట జరిగింది. నలుగురు కుర్రాళ్ళు అక్కడికక్కడే చనిపోయారు. 60 మంది గాయపడ్డారు. దాంతో సన్నీ లియోన్ ప్రదర్శన అంటేనే కుర్రాళ్ళు కాదుగానీ, పెద్దోళ్ళు భయపడిపోతున్నారు. సన్నీ లియోన్ ఇచ్చే ‘ప్రదర్శన’ సంగతి దేవుడెరుగు.. కుర్రాళ్ళు అన్యాయంగా దేవుడి దగ్గరకి వెళ్ళిపోతారని భయపడుతున్నారు. అందుకే తిరువనంతపురం యూనివర్సీటీ వైస్ ఛాన్సలర్ సన్నీ లియోన్ ప్రదర్శనకు నో చెప్పేశారు. 

జగన్ బొమ్మ ఉన్నా సరే  ఆ కిట్ లే పంపిణీ చేయాలన్న చంద్రబాబు 

ముఖ్యమంత్రిగా చంద్రబాబు  ప్రమాణస్వీకారం తీసుకున్న రోజే తన కాన్వాయ్ లో  కొత్త కార్లను కొనుగోలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారి చేశారు. జగన్ కాన్వాయ్ లోని   పాత ఫార్చునర్ కార్లను వినియోగించాలని ఆదేశాలు జారి చేసిన సంగతి తెలిసిందే.  ప్రమాణ స్వీకారం తీసుకున్న మరుసటి రోజే  తన మార్కు పాలన చంద్రబాబు ఆరంభించారు. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మార్కు పాలన మొదలైంది  ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు, పగ  ఉండవని నిరూపించారు. రాష్ట్రంలో స్కూల్స్ పున:ప్రారంభమైన నేపథ్యంలో జగన్ ఫొటో ఉన్నా సరే విద్యార్థులకు ఆ కిట్ లనే పంపిణీ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేయవద్దంటూ చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. చంద్రబాబు నిర్ణయంపై టీడీపీ ఆసక్తికర ట్వీట్  ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఎంత తేడా అంటూ తెలుగుదేశం పార్టీ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు పేరొస్తుందని, వైఎస్ జగన్ తన హయాంలో పేదలకు తక్కువ ఖర్చుతో అన్నం పెట్టే  అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టాడని పేర్కొంది. కానీ చంద్రబాబు మాత్రం ప్రజాధనం వృథా అవకూడదని భావించి మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిట్స్ ను విద్యార్థులకు అలాగే పంపిణీ చేయాలని ఆదేశించారు.  ప్రజాధనం వృధా అవకూడదని ఆలోచించే చంద్రబాబుకు, మాజీ సీఎం జగన్ కు చాలా వ్యత్యాసం ఉందని టీడీపీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. తన పాలనలో కక్ష సాధింపు చర్యలు ఉండవని, పగ ప్రతీకారాలకు తావులేదని, తుగ్లక్ నిర్ణయాలు అసలే ఉండవని చంద్రబాబు చెప్పారు. తాను చెప్పిన మాట మేరకు.. పాలనలో పగ ప్రతీకారాలకు చోటు ఉండకూడని భావించి జగన్ బొమ్మ ఉన్న స్కూల్  కిట్స్ ను విద్యార్థులకు అలాగే పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారని పేర్కొంటూ ఓ న్యూస్ క్లిప్‌ను టీడీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది

సీఎం చంద్రబాబు చేసే మొదటి మూడు సంతకాలు ఇవే!

నారా చంద్రబాబునాయుడు అనే నేను.. అంటే ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి రాష్ట్రంలో అభివృద్ధి వేవ్స్ కనిపిస్తున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. ఐదేళ్ల నరకాసుర పాలన అంతమైందన్న ఆనందం సర్వత్రా కనిపిస్తోంది.  జగన్ పాలనలో  రాష్ట్రంలో అన్ని వర్గాల వారూ ఇబ్బందులకు గురయ్యారు. సమస్యలు పరిష్కారం కావడం అటుంచి.. అవి పెచ్చరిల్లి నానా యాతనలూ పడ్డారు. సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తే స్వేచ్ఛ సైతం లేకండా పేదవాడి ఆగ్రహం పెదవికి చేటు అన్న చందంగా తమ ఆగ్రహజ్వాలలు బయటకి కనిపించకుండా మౌనాన్నాశ్రయించారు. రాష్ట్రం ఇప్పుడు జగన్ బందిఖానా నుంచి విముక్తి పొందింది. ప్రజాస్వామ్య విలువలకు పెద్ద పీట వేసే చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన వాగ్దానాలను వరుస క్రమంలో నెరవేరుస్తారన్న విశ్వాసంతో పాటు.. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా దౌడుతీస్తాయన్ నమ్మకం కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రజలలో బలంగా వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యలోనే ఆయన సచివాలయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సంతకం చేసే ఫైళ్లు ఏమిటి అన్నదానిపైనే అందరి ఆసక్తీ నెలకొని ఉంది.  అందుకు తగ్గట్టుగానే బుధవారం (జూన్ 12) సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన తన కేబినెట్ సహచరులతో భేటీ అయ్యారు. ఆ భేటీలో తన ప్రాధాన్యతలు, ప్రాధమ్యాల గురించి వారికి విశదీకరించారు. ఆ తరువాత ఆయన కుటుంబ సమేతంగా తిరుమలకు బయలుదేరి వెళ్లారు. గురువారం (జూన్ 13)న ఆయన సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలి సంతకం మెగా డీఎస్సీపై చేయనున్నారు. అది కాకుండా ఆయన మరో రెండు దస్త్రాలపై కూడా సంతకం చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. అవేమిటంటే.. జగన్ సర్కార్ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఆయన తన రెండు సంతకం చేస్తారని చెబుతున్నారు. అదే విధంగా సామాజిక పెన్షన్ల ను  నాలుగు వేల రూపాయలకు పెంచే ఫైలుపై మూడో సంతకం చేస్తారని చెబుతున్నారు.  

ఆర్టీసి చార్జీలు పెరగలేదు : టిజిఎస్ ఆర్టీసి 

తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతున్నారన్న వార్తలపై తెలంగాణ ఆర్టీసీ  క్లారిటీ ఇచ్చింది. టోల్ ప్లాజాల వద్ద రేట్లు పెంచిన నేపథ్యంలో తెలంగాణలో టోల్ ప్లాజాలున్న మార్గాల్లో నడిచే బస్సుల్లో టికెట్ ఛార్జీలోని టోల్ రుసుమును మూడు రూపాయల చొప్పున పెంచారంటూ వార్తలు వచ్చాయి. కేంద్రం టోల్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో తెలంగాణలోని ఎక్స్‌ప్రెస్ బస్సులో టోల్ రుసుమును ఒక్కో కౌంటర్‌కు పది నుంచి 13కు, డీలక్స్, లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో 13 నుంచి 16 రూపాయలకు, గరుడ ప్లస్ బస్సుల్లో 14 నుంచి 17 రూపాయలకు, నాన్ ఏసీ స్లీపర్, హైబ్రిడ్ స్లీపర్లో రూ.15 నుంచి రూ.18కి, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ. 20 నుంచి రూ.23కు పెంచినట్లు వార్తలు వచ్చాయి.అయితే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ప్రకటన విడుదల చేసింది. సాధారణ చార్జీలు యథాతథంగానే ఉన్నాయని తెలిపింది. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుందన్న తెలంగాణ ఆర్టీసీ.. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్ లోని టోల్ సెస్‌ను సవరించుకున్నట్లు తెలిపింది. ఈ సవరించిన టోల్ సెస్ జూన్ 3వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిందని వివరణ ఇచ్చింది. టోల్ ప్లాజాలున్న రూట్లలోనే టోల్ సెస్‌ను సవరించినట్లు తెలిపింది. అలాగే సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవని ప్రకటనలో పేర్కొంది.అయితే టీజీఎస్ఆర్టీసీ సాధారణ బస్ ఛార్జీలను పెంచిందని వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ఆర్టీసీ ప్రకటనలో తెలిపింది. ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం మంచిది కాదని సూచించింది. ఆర్టీసీ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీస్ శాఖ సహకారంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

30 ఇయర్స్ ఇండస్ట్రీ... ఇన్నాళ్ళకి వచ్చింది మినిస్ట్రీ!

పయ్యావుల కేశవ్ తెలుగుదేశం సీనియర్ నాయకుడు. విషయ పరిజ్ణానం మెండుగా ఉన్న నేత. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పిలుపు మేరకు పయ్యావుల 1994లో  తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా రాజకీయ జీవితాన్ని ఆరంబించారు. 1994 ఎన్నికలలో ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలి సారి విజయం సాధించారు.  అయితే అదే నియోజకవర్గం నుంచి 1999లో కూడా పోటీ చేసిన పయ్యావుల కేశవ్ పరాజయం పాలయ్యారు. ఆ తరువాత వరుసగా 2004, 2009 ఎన్నికలలో అదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. కానీ ఆ రెండు సార్లూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో పయ్యావుల కేశవ్ పరాజయం పాలయ్యారు. ఆ తరువాత 2019 లో జరిగిన ఎన్నికలలో జగన్ వేవ్ లో కూడా ఉరవకొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే తాజా ఎన్నికలలో పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ కూడా భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో పయ్యావుల కేశవ్ ఓడిపోతే తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది అన్న అపప్రధ పూర్తిగా తొలిగిపోయింది. 1994 నుంచి ఇప్పటి వరకూ ఏడు సార్లు సాధారణ ఎన్నికలు జరగగా పయ్యావుల కేశవ్ ఐదు సార్లు విజయం సాధించారు. అయితే ఆయన విజయం సాధించిన సందర్భంలో తెలుగుదేశం విపక్షంలో ఉండటం, ఆయన పరాజయం పాలైన ప్రతిసారీ తెలుగుదేశం అధికారంలోకి రావడం ఇంత కాలం ఒక రివాజుగా మారిపోయింది. ఈ సారి ఆ ఒరవడికి బ్రేక్ పడింది. పార్టీ, పయ్యావులా ఇరువురూ గెలిచారు. అంతే కాదు చంద్రబాబు కేబినెట్ లో పయ్యావుల కేశవ్ కు స్థానం దక్కింది. దీంతో పయ్యావుల మూడు దశాబ్దాల ఎదురు చూపులు ఫలించాయి. అంతే కాకుండా ఉరవకొండ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మంత్రి కావడం అన్నది కూడా నాలుగు దశాబ్దాల తరువాత మొదటి సారిగా సంభవించింది. ఎప్పుడో 1985లో ఉరవకొండ నియోజకవర్గం నుంచి గెలిచి గుర్రం నారాయణప్ప మంత్రి అయ్యారు. ఆ తరువాత ఉరవకొండ నుంచి విజయం సాధించి మంత్రి పదవి చేపట్టిన తొలి వ్యక్త పయ్యావుల కేశవ్.  

ప్రేమ పెళ్లిళ్లలో ఊరట... అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు 

ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్న యువకులపై పెట్టే కిడ్నాప్ కేసులు ఇక చెల్లవని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  మేజర్లు తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోనివ్వకుండా, నచ్చిన చోటుకు పోనివ్వకుండా , ఇష్టమైన చోట బతకకుండా ఎవరూ నిరోధించలేరని అలహాబాద్ హైకోర్ట్ స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి ఒక్కరికీ ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛలను అందిస్తోందని కోర్టు వివరించింది. మేజర్లు అయిన ఓ జంట ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోగా.. భార్య తరపు బంధువులు భర్తపై పెట్టిన కిడ్నాప్ కేసును హైకోర్ట్ తోసిపుచ్చుతూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.భార్య మేనమామ ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేయడమే కాకుండా.. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ భార్య వాంగ్మూలాన్ని తీసుకున్న తర్వాత కూడా ఆమెను తల్లిదండ్రుల ఇంటికి తిరిగి పంపించడాన్ని అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.  21 ఏళ్ల వయసున్న ముస్లిం యువతి ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో తనకు నచ్చిన వ్యక్తిని ముస్లిం సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది. వీరి పెళ్లికి తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వివాహ ధృవీకరణ సర్టిఫికెట్‌ను కూడా జారీ చేసింది. అయితే భార్య మేనమామ ఐపీసీ సెక్షన్ 363 (కిడ్నాప్) కింద వరుడిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా భర్తను అరెస్ట్ చేశారు. అంతేకాదు భార్యను కూడా అరెస్ట్ చేసి ఆమెను మేనమామకు అప్పగించి ఇంటికి పంపించారు.

అతి త్వరలో జగన్ నోట ‘జై అమరావతి’!

‘జై అమరావతి’... ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఒకే తాటిమీద నడిపించిన నినాదం.. ‘జై అమరావతి’... ప్రపంచంలోనే అద్భుత రాజధాని కోసం ఆంధ్రజాతి చేసిన నినాదం... ‘జై అమరావతి’... మహోన్నతమైన రాజధాని కోసం 33 వేల ఎకరాల భూములను ఇచ్చిన రైతులు చేసిన నినాదం... ‘జై అమరావతి’... ఆంధ్రుల స్వప్నాన్ని దుష్టశక్తులు కాలరాయడానికి ప్రయత్నించినప్పుడు ఆంధ్రజాతి యావత్తూ ఒక్కటై చేసిన నినాదం.. ఆ దుష్టశక్తులను తరిమికొట్టిన నినాదం. ఈ నినాదం.. అద్భుతమైన ఈ నినాదం.. త్వరలో ఒక గొంతులో వినబోతున్నాం.. ఆ గొంతు ఎవరిదో కాదు.. వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిది.  అధికారం చేపట్టినప్పటి నుంచి బిడ్డను పొదిగే గర్భంలో గొడ్డలి దించే కర్కశత్వాన్ని ప్రదర్శించి, అమరావతిని ఆదిలోనే అంతం చేయడానికి భారీ స్థాయిలో కుట్ర చేసి, మూడు రాజధానులు అంటూ కొత్త వాదన తెరమీదకి తెచ్చి, అమరావతిని విజయవంతంగా ఘోస్ట్ సిటీగా మార్చిన జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ‘జై అమరావతి’ అనే మాట రాబోతోంది అని చెబితే ఎవరికీ నమ్మశక్యం కాదు.. కానీ, ఇది నిజం... త్వరలో జరగబోతున్న వాస్తవం. ఆంధ్రజాతి భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం ‘జై అమరావతి’ అనే ఉద్యమం ఐదేళ్ళుగా సాగింది. ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం జగన్ త్వరలో ‘జై అమరావతి’ అని అనబోతున్నారు. తిరుగులేని ఓటమికి గురైన తర్వాత రెండు మూడు రోజులు స్తబ్దుగా వున్న జగన్మోహన్‌రెడ్డి మళ్ళీ తన మార్కు రాజకీయాలను ప్రదర్శించడం ప్రారంభించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి రాజధానిగా స్థిరపడిపోవడం అనివార్యం. కూటమి అధికారంలో వుండే ఈ ఐదేళ్ళ కాలంలో అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందడం ఖాయం. ఐదేళ్ళ తర్వాత తాను పొరపాటున అధికారంలోకి వచ్చినా మూడు రాజధానులు, ముప్ఫై మూడు రాజధానులు అనడానికి అవకాశం వుండదు. అందుకని, అమరావతిని రాజధానిగా ఒప్పుకోవడానికి మానసికంగా సిద్ధం అయ్యారు. ఆయన మానసికంగా సిద్ధం అయిన తర్వాత, తన సొంత మీడియాని మానసికంగా సిద్ధం చేశారు. అందుకే, ఆయన మీడియాలో ఇప్పుడు అమరావతి మీద అనుకూల కథనాలు వస్తున్నాయి. ‘‘మూడు రాజధానుల సంగతి అలా వుంచితే, ఇప్పుడు అమరావతి రాజధానిని సక్రమంగా నిర్మించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి.. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలి’’ అని జగన్ అనుకూల మీడియా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. జస్ట్ ఇంకొక వారం పది రో్జుల లోపలే జగన్ ‘‘అమరావతి రాజధానిగా వుండటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అంటూ ప్రకటన విడుదల చేసే అవకాశాలు వున్నట్టు సమాచారం. జగన్ ప్రస్తుతం నివాసం వుంటున్నది అమరావతి ప్రాంతంలోనే. జగన్ నో అన్నా, అరిచి గీ పెట్టినా అమరావతి నిర్మాణం ఆగేది కాదు.. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతికి వ్యతిరేకంగా వుండటం కంటే, ‘జై అమరావతి’ అంటే ఒక పనైపోతుందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అమరావతికి అనుకూలంగా మాట్లాడి, భవిష్యత్తులో అమరావతికి సంబంధించిన అన్ని అంశాల్లోకీ దూరిపోయి ఉద్యమాలు చేయడానికి అర్హత సంపాదించుకోవాలన్నది జగన్ వ్యూహం. జగన్ వ్యూహం జగన్‌కి వుంటే, ప్రజల వ్యూహం ప్రజలకి వుంది. 2019 ఎన్నికల ముందు అమరావతికి జై కొట్టి, అధికారంలోకి రాగానే అమరావతి రైతుల నోట మట్టి కొట్టిన విషయాన్ని ఎవరూ మరచిపోలేరు. ఇప్పుడు జగన్ జై అమరావతి అన్నంత మాత్రాన జనం మురిసిపోయి జగన్ మారిపోయాడని నమ్మరు. చివరికి ప్రభుత్వం ఇస్తానని చెప్పిన కౌలు కూడా ఇవ్వకుండా రైతులను హింసించిన జగన్‌ని ప్రజలు ఎంతమాత్రం నమ్మరు. తాను జై అమరావతి అన్నప్పటికీ, జనం తనని నమ్మరని తెలిసినా, ఈ విషయంలో జగన్ వెనుకడుగు వేయరు.. తాను అనుకున్నది తాను చేస్తారు. ఎందుకంటే, ఆయన కరడుగట్టిన రాజకీయ రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి.

సీబీఎన్ కేబినెట్ పై లోకేష్ ముద్ర!?

చంద్రబాబునాయుడి కేబినెట్ పాత కొత్తల మేలుకలయికగా సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నది. అయితే పలువురు సీనియర్లకు ఆయన కేబినెట్ లో స్థానం దక్కకపోవడంపై కూడా విస్తృత చర్చ జరుగుతోంది. అదే సమయంలో చంద్రబాబు కేబినెట్ పై లోకేష్ ముద్ర విస్పష్టంగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు, రాజకీయవర్గాలు కూడా భావిస్తున్నాయి.  ఒక సందర్భంగా పార్టీ కోసం పని చేయడానికి కేబినెట్ లో స్థానం వద్దని చెప్పడానికి కూడా వెనుకాడనని లోకేష్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సీనియర్లు ఇంత వరకూ పదవులు అనుభవించారు. ఇక నుంచి పార్టీ కోసం పని చేయాలని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పలు సందర్భాలలో లోకేష్ చెప్పిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు చంద్రబాబు తన కేబినెట్ లో యువతకు పెద్ద పీట వేయడం ద్వారా సీనియర్లకు పార్టీ పనులు అప్పగించడం ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. పార్టీ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువతను ప్రొత్సహించేందుకు, తద్వారా లోకేష్ తిరుగులేని నాయకుడిగా ఎదిగేందుకు  మార్గం సుగమం చేయడంలో భాగంగానే ఆయన కొత్త కేబినెట్ కూర్పు ఉందన్న భావన వ్యక్తం అవుతోంది.   పైగా అసెంబ్లీలో ప్రతిపక్షం అనేదే లేకుండా పోయిన ఈ సందర్భం కంటే కొత్త వారికి అవకాశాలచ్చి ప్రయోగాలు చేయడానికి ఇంతకు మించిన వెసులుబాటు ఉండదని కూడా చంద్రబాబు భావించినట్లు చెబుతున్నారు.   కొత్త మంత్రులు తమ సత్తా చాటడానికి,  పని తీరును రుజువు చేసుకోవడానికి మంచి అవకాశంగా కూడా అభివర్ణిస్తున్నారు.  సభలో విపక్షం లేని ఈ పరిస్థితిలో పాతవారికి అవకాశాలు ఇవ్వడం కంటే కొత్తవారికి పెద్ద పీట వేయడం ద్వారా భవిష్యత్ లో వారు పార్టీకి గట్టి అండగా నిలిచే అవకాశం ఉంటుందని అంటున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం సమయంలో ఎన్టీఆర్ యువతకు విరివిగా అవకాశాలు ఇవ్వబట్టే నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా నిలబడిందని ఉదహరిస్తున్నారు.   అదే సమయంలో సీనియర్ల అనుభవాన్ని పార్టీ పటిష్టతకు మరింత బలోపేతం చేయడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని విస్మరించకూడాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తం మీద చంద్రబాబు కేబినెట్ పై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తోందని తెలుగుదేశం నాయకులే అంటున్నారు.