అభద్రతా భావంలో జగన్ ....30 మంది ప్రయివేటు సెక్యురిటీ సిబ్బంది
posted on Jun 18, 2024 @ 11:43AM
అవగాహనా రాహిత్యం వల్ల మనిషి అభద్రతా భావానికి గురవుతుంటాడు. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతుంటాడు. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సమాజం పట్ల , జీవితం ఎంత ఎక్కువ అవగాహన ఉంటే అంత ఆత్మ స్థైర్యం కలుగుతుంది. హేతుబద్దంగా ఆలోచించగలుగుతారు. మాజీ ముఖ్యమంత్రి వైఎష్ జగన్ గత ఐదేళ్లు చేసిన అధికార దుర్వినియోగం వల్ల పదవీచ్యుతుడయ్యాడు. ఆయనకున్న సెక్యురిటీ తగ్గిపోవడంతో పూర్తి అభధ్రతలో పడ్డారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి 30 మంది ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బంది వచ్చేసింది.
ఏపీ మాజీ సీఎం జగన్ ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియమించుకున్న సెక్యురిటీ సిబ్బంది సోమవారం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అధికారం కోల్పోవడం, ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ప్రభుత్వ పరంగా జగన్‌కు భద్రత కుదించే అవకాశం ఉండడంతో ఆయన ప్రైవేటుగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.
ఇకపై జగన్ మాజీ సీఎంగా, సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగానే ఆయన భద్రతలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా జగన్ ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. గతంలో కూడా జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, పాదయాత్ర సమయంలో ప్రైవేటు భద్రతా సిబ్బందిని భారీ మొత్తంలో నియమించుకున్న విషయం తెలిసిందే. కాగా, జగన్ సీఎంగా ఉన్న సమయంలో తనకు, తన ఫ్యామిలీకి భద్రత కోసం స్పెషల్ సెక్యూరిటీ గ్రూపును ఏర్పాటు చేస్తూ ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. లండన్ లో ఉన్న తన కూతుళ్ల కోసమే ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. కొడుకుతో తనకు రక్షణ లేదని జగన్ తల్లి విజయమ్మ విదేశాల్లో ఉన్న మనవడు రాజారెడ్డి ఇంట్లో ఉంటోంది. ఎపికి ఇప్పటివరకు పని చేసిన 17 ముఖ్యమంత్రులు ఒక ఎత్తయితే జగన్ మరో ఎత్తుగా మారింది. పేదవాడిగా చెప్పుకునే జగన్ తరచూ లండన్ వెళ్లేవారు. ఆ సమయాల్లో జగన్ సెక్యురిటీ కోసం వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది.