రుషికొండ ప్యాలెస్‌లో జగన్‌ని పనోడిగా పెట్టాలి!
posted on Jun 19, 2024 7:33AM
రుషికొండ స్వరూపాన్ని దెబ్బతీసి, ఆయిదారు వందల కోట్లు ఖర్చుపెట్టి జగన్ నిర్మించిన ప్యాలెస్, అందులోని సదుపాయాలు, వాటికి అయిన ఖర్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాలు నోళ్ళు తెరిచేలా చేశాయి. ఈ ప్యాలెస్ బండారం ఎన్నికల ముందు బయటపడివుంటే, ఇప్పుడున్న 11 సీట్లు కూడా వచ్చేవి కావన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రుషికొండ ప్యాలెస్ గుట్టు ఎప్పుడైతే రట్టయిందో, అప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలుగా జరగడం లేదు. చాలా ట్రోలింగ్స్ నవ్వు తెప్పించే విధంగా వుంటే, మరికొన్ని ట్రోలింగ్స్ ఆలోచింపజేసేవిగా వున్నాయి. వాటిలో ఒకటి... దాన్ని ట్రోలింగ్ అనాలో, సజెషన్ అనాలోగానీ.. ఇలా చేస్తే ఒక పనైపోతుంది కదా అనిపించేలా వుంది.
అదేంటంటే, ఇంత ప్రజాధనం వృధా చేసినందుకు జగన్‌కి శిక్ష విధించాలి. ఆ శిక్ష ఏంటంటే, జగన్‌ని జీవితాంతం ఆ ప్యాలెస్‌లో పనోడిలా వుంచాలి. గార్డెనింగ్ దగ్గర్నుంచి టాయ్‌లెట్స్ క్లీన్ చేసే వరకూ అన్ని పనులూ జగన్ చేతే చేయించాలి. 16 లక్షల ఖరీదైన టాయ్‌లెట్ కమోడ్స్, 30 లక్షల విలువైన బాత్‌టబ్‌లు క్లీన్ చేసే అవకాశం జగన్‌కే ఇవ్వాలి. తాను ఎంజాయ్ చేయాలనుకుని నిర్మించిన ప్యాలెస్‌లో తానే పనోడిగా పనిచేయడానికి మించిన శిక్ష జగన్‌కి మరొకటి వుండదు అనేది ఆ ట్రోలింగ్ సారాంశం. నిజానికి ఇది సాధ్యమయ్యేది కానప్పటికీ, జగన్ జనం దృష్టిలో అంత చులకన అయిపోయాడనేది ఇలాంటి ట్రోలింగ్ వల్ల అర్థమవుతూ వుంటుంది. ఐదేళ్ళ పదవీ కాలంలో జగన్ పోగొట్టుకున్న పరువు ఒక ఎత్తు అయితే, రుషికొండ ప్యాలెస్ ఉదంతం మరొక ఎత్తుగా నిలుస్తోంది.