విడదల రజినీ... జంప్ జిలానీ!
posted on Jun 18, 2024 @ 11:11AM
సైబరాబాద్ మొక్క విడదల రజినీ వైసీపీ నుంచి జంప్ జిలానీ అవబోతున్నారు. త్వరలో పార్టీ మారడానికి విడుదల రజినీ సన్నాహాలు చేసుకుంటున్నారు. అప్పట్లో తాను చంద్రబాబు సైబరాబాద్‌లో నాటిన మొక్కని అని స్టోరీలు చెప్పి, తెలుగుదేశం పార్టీలో అందలం ఎక్కిన విడదల రజినీ, ఆ తర్వాత జంప్ జిలానీ అయ్యి వైసీపీలో చేరారు. అక్కడ కూడా తన మార్కు భజన కార్యక్రమం చేపట్టి జగన్ అనుగ్రహాన్ని పొందారు. మంత్రిగా పనిచేసే అవకాశాన్ని కూడా పొందారు. మొన్నటి ఎన్నికలలో వైసీపీ తరఫున గుంటూరు వెస్ట్ నుంచి ఈమె పోటీ చేస్తే, గుంటూరు వెస్టోళ్ళు నువ్వు మాకు వేస్టు అని ఓడించారు. ఇక వైసీపీలో వుంటే తనకు రాజకీయ భవిష్యత్తు లేదని అర్థం చేసుకున్న ఈ సైబరాబాద్ మొక్క పార్టీ మారడానికి సిద్ధమైనట్టు సమాచారం. వైసీపీలో కీలక నాయకుల మాటలు నమ్మి తానెంతో మోసపోయానని ఆమె తన సహచరుల దగ్గర కన్నీరుమున్నీరు అయినట్టు తెలుస్తోంది. ఇదిగో సైబరాబాద్ మొక్కమ్మా.. నువ్వు పార్టీ మారితే మారుగానీ, ఈ ఏడుపు డ్రామాలు చేయకు.. నీ డ్రామాలు ఎవరూ నమ్మరు.