పాఠశాల స్థలంలో వైసీపీ కార్యాలయం!

జగన్ ఐదేళ్ల పాలన నిబంధనల ఉల్లంఘనలో కొత్త పుంతలు తొక్కింది. జగన్ హయాంలో స్కూళ్లు, గుడులు అన్న విచక్షణ లేదు. ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ అక్రమ నిర్మాణాలు వెలిసిపోయాయి. కొండలు, పర్యావరణం అన్న స్ఫృహే లేదు. రుషికొండకు కొట్టిన గుండే అందుకు నిదర్శనం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ అక్రమాలు, అక్రమ నిర్మాణాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఆయా నిర్మాణాలను అక్రమ కట్టడాలుగా ప్రకటింంచి అధికారులు నోటీసులు ఇస్తున్నారు. తాజాగా మచిలీపట్నంలో వైసీపీ కార్యాలయ నిర్మాణం చేపట్టిన స్థలం విషయంలో జగన్ గ్యాంగ్ ఏ స్థాయిలో అరాచకానికి పాల్పడిందో వెలుగులోకి వచ్చింది.  ఔను వైసీపీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా, మంచి, చెడు అన్న  దానితో సంబంధం లేకుండా పార్టీ కార్యాలయాన్ని ఏకంగా పాఠశాల స్థలంలో నిర్మించేసింది. దాదాపు వెయ్యి చదరపు గజాల స్థలాన్ని అక్రమంగా ఆక్రమించేసి పార్టీ కార్యాలయాన్ని నిర్మించేసింది. ఈ నిర్మాణం కోసం మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ నుంచి అనుమతి తీసుకోలేదు. మునిసిపాలిటీ అనుమతులు కూడా లేవని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు  ఈ నిర్మాణం అక్రమమని పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అనుమతులూ లేకుండా, స్కూలు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ఈ కట్టడాన్ని ఎందుకు కూల్చివేయరాదో చెప్పాలంటూ నోటీసులు ఇచ్చారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎవరన్నది తెలియకపోవడంతో మునిసిపాలిటీ అధికారులు పార్టీ కార్యాలయ సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. వారి వివరణను బట్టి భవిష్యత్ కార్యాచరణ అంటుందని అధికారులు చెబుతున్నారు.   

ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గానే తిరుమల దర్శనాల దందాకు తెరలేపిన రోజా!

రోజా అక్రమాలు, అవినీతి అంటూ వచ్చిన ఆరోపణలు, విమర్శలు అన్నీ కూడా ఆమె మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచే అని అంతా  భావిస్తున్నారు. ఔను ఆమె మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె తీరు పూర్తిగా మారిపోయింది. మంత్రి పదవి కోసం చకోరపక్షిలా వేచి చూసిన రోజాకు ఎట్టకేలకు వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత జగన్ తన కేబిన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా టూరిజం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు అప్పగించారు. అంతకు ముందు కూడా ఆమెనేమీ తీసి పక్కన పెట్టలేదు. ఆమెకు  ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా కీలక బాధ్యతలు అప్పగించారు.  అప్పుడు ఆమె ఏమీ సుద్దపూసలా వ్యవహరించలేదు. ఆ హోదాలో కూడా ఆమె  ముడుపుల మూటల వ్యవహరాంలో ఎలాంటి ముఖమాటాలకూ పోలేదు.   ఆ విషయానికి వచ్చే ముందు మంత్రిగా ఆమెకు ఆమె పార్టీ వారే ఇచ్చిన బిరుదు ఏమిటంటే కలెక్షన్ క్వీన్.  మంత్రి పదవి రాగానే, ముడుపులు ముట్ట రాదు, లంచాలు పుచ్చుకోరాదు అని రూలు ఏమైనా  ఉందా అన్నట్లుగా ఆమె మంత్రిపదవి చేపట్టిన వంద రోజులకే క్యాష్  కౌంటర్ ఓపెన్ చేసి ఓపెన్ గా ముడుపులు స్వీకరించడం మొదలు పెట్టేశారని వైసీపీ వర్గాల నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.   మినిస్టర్ రోజా.. అప్పాయింట్మెంట్ కే రూ. 50 వేలు తీసుకుంటారనీ, పోస్టింగులకు ఇంత అన్నట్లుగా ఆమె అందివచ్చిన ఏ అవకాశాన్నీ విడవకుండా రేట్ల కట్టి మరీ ముడుపులు తీసుకున్నారన్న విమర్శలూ ఉన్నాయి.  సరే ఇప్పుడు విషయానికి వస్తే ఆమె మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి చాలా ముందు నుంచే అంటే ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా ఉన్నప్పుడు కూడా అడ్డగోలు సంపాదన కోసం అర్రులు చాచారని ఇప్పడు వెలుగులోనికి వస్తుంది. మంత్రిగా ఆమె వారం వారం వందల మందితో చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు పెద్ద కుంభకోణమని, తిరుమలేశుని దర్శనం పేరిట ఆమె కోట్లు దండుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈ వీఐపీ బ్రేక్ దర్శనాల దందా ఆమె ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా ఉన్నప్పుడే మొదలు పెట్టారని ఇప్పుడు వెల్లడైంది. ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా ఉన్న సమయంలోనే ఆమె ఒకే  సిఫారసు లేఖ మీద 20 మందికి వీఐపీ బ్రేక్ దర్శనం చేయించినట్లు ఆధారాలతో సహా తేలింది. ఒక లేఖపై ఆరు లేదా ఏడుగురికి మించి బ్రేక్ దర్శనానికి అనుమతిలేదని టీటీడీ నిబంధనలు పేర్కొంటాయి. అయితే రోజా సిఫారసు లేఖ ఉంటే నిబంధనలు బేఖాతరే అని టీటీడీ ఆచరణలో చూపింది. ఆనం వెంకట్రామరెడ్డి వీఐపీ బ్రేక్ దర్శనాల పేర రోజా కోట్లలో దండుకున్నారని చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేదిగా ఆమె ఒకే లేఖలో పదుల సంఖ్యలో బ్రేక్ దర్శనాలకు సిఫారసు చేయడం నిలుస్తోంది. 

జవహర్ రెడ్డి పట్ల బాబు ఉదారత.. మాజీ సీఎస్ సిగ్గుతో చితికిపోయి ఉంటారుగా?

జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఆయన అడుగులకు మడుగులొత్తి, ఆయన తొత్తులుగా పని చేసిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు జగన్ సర్కార్ కూలిపోయిన తరువాత చంద్రబాబు సర్కార్ లోనూ మంచి హోదాలలో కొనసాగుతున్నారు. సహజంగానే ఇది తెలుగుదేశం అభిమానులు, శ్రేణులలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది.  ఎందుకంటే ఈ అధికారులు జగన్ కు వీర భక్త హనుమాన్ స్థాయిలో జగన్ కు ఊడిగం చేశారు. జగన్  చూసి రమ్మంటే వీరు కాల్చి వచ్చిన చందంగా వ్యవహరించారు. జగన్ మెప్పు పొందడమే లక్ష్యంగా విపక్ష నేతలను, కార్యకర్తలను నానా ఇబ్బందులకూ గురి చేశారు. నిబంధనలనేవి ఉండవనీ, జగన్ కు నచ్చినట్లుగా వ్యవహరించడమే ఏపీలో ఉన్న ఏకైక నిబంధన అని వాళ్లు నమ్మడమే కాుద, జనం కూడా నమ్మి తీరాలు, విపక్షాలూ అందుకు అంగీకరించాలని అన్నట్లుగా కొందరు అధికారుల తీరు జగన్ హయంలో ఉండింది.  గతంలో అంటే ఎన్నికలకు ముందు పలు సందర్భాలలో చంద్రబాబు క సీనియర్ మోస్ట్ అధికారి ఒకరు హైదరాబాద్ లో తన నివాసానికి మారు వేషంలో వచ్చి జగన్ తీరు గురించి వివరించి ఆయన ఆదేశాలు పాటించకుంటే ప్రాణాలతో ఉంటామన్న నమ్మకం లేదని అన్న సంగతిని చెప్పారు. అయితే చంద్రబాబు ఆ అధికారి పేరు బయటపెట్టలేదు. అదీ చంద్రబాబు మంచితనం, హుందాతనం. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే హుందాతనాన్ని మంచి తనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన తీరు పట్ల సొంత పార్టీ నేతలూ, క్యాడర్ లో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతున్నప్పటికీ బై అండ్ లార్జ్ చంద్రబాబు తీరు ఆయన గొప్పతనానికి నిదర్శనమన్న అభిప్రాయమే వ్యక్తం అవుతోంది.  జగన్ హయాంలో ఆయనకు తొత్తుగా, నిబంధనలు అన్నవి ఉంటాయన్న స్ఫృహే లేకుండా ఇష్టారీతిగా వ్యవహరించిన మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి బాబు ఎంతో ఉదారంగా, హుందాగా ఆయన రిటైర్ అయ్యే చివరి రోజు పోస్టింగ్ ఇచ్చారు. అలాగే నిబంధనలను తుంగలోకి తొక్కి జగన్ అడుగులకు మడుగులొత్తేలా పని చేసిన మరో ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్యకూ ఆమె రిటైర్మంట్ కు ముందు రోజే పోస్టింగ్ ఇచ్చి గౌరవంగా రిటైర్ అయ్యే అవకాశం కల్పించారు.  కక్షలూ కార్పణ్యాలూ తన నైజం కాదనీ ఈ చర్యల ద్వారా చంద్రబాబు విస్పష్టంగా చాటారు. సరిగ్గా రిటైర్మెట్ రోజున పోస్టింగ్ ఇచ్చి మర్యాదగా, గౌరవంగా రిటైరయ్యే అవకాశం దక్కడం నిజంగా జవహర్ రెడ్డి కూడా ఊహించి ఉండరు. చంద్రబాబు హుందాతనం, ఉదారత్వం చూసి ఆయన సిగ్గుతో తలదించుకునే ఉంటారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీ విషయంలో జగన్ ఆదేశాల మేరకు తానెంత కర్కశంగా, కృూరంగా వ్యవహరించానో జవహర్ రెడ్డికి గుర్తొచ్చే ఉంటుంది. అప్పటి తన తీరు పట్ల కచ్చితంగా రిపెంట్ అయ్యే ఉంటారు. సిగ్గుతో చితికిపోయే ఉంటారు.

బాబు మొదలెట్టేశారు.. పాలన ఇక పరుగులే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మార్క్ పని తీరును చూపుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై   వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. అలాగే శాఖల వారీగా సమీక్షలకు సైతం ఆయన రెడీ అయిపోయారు. వర్షా కాలం కావడంతో ఆయన తొలుత వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష చేయాలని నిర్ణయించారు. శుక్రవారం (జూన్ 28) సాయంత్రం నాలుగు గంటలకు ఆయన వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నివారణకు తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. అలాగే ఆ శాఖలో తక్షణం చేపట్టాల్సిన చర్యలు, దీర్ఘకాళిక ప్రణాళికపై చర్చించనున్నారు.  అదలా ఉండగా ఆయన అధికారుల నియామకాలపై కూడా దృష్టి పెట్టారు. ఇప్పటికే తన ముఖ్య కార్యదర్శిగా పీయూష్ కుమార్ ను నియమించారు. ఆర్థిక శాఖ బాధ్యతలను కూడా ఆయనకు అదనంగా అప్పగించారు. ఇక కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డాను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే చంద్రబాబు లడ్డాను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేసి రాష్ట్రానికి పంపాలని లేఖ రాశారు. ఆయన లేఖ మేరకు లడ్డాను రాష్ట్ర సర్వీసుకు పంపిస్తే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 1988 ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన లడ్డా 2019లో విశాఖ పోలీసు కమిషనర్ గా పని చేశారు.  నిజయతీపరుడు, సమర్ధుడైన అధికారిగా పేరున్న లడ్డాను ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించే అవకాశాలున్నాయని అంటున్నారు.  ఇక జగన్ హయాంలో  ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు అధికారులకు సైతం చంద్రబాబు సర్కార్ పోస్టింగులు ఇచ్చింది.  వారిలో జగన్ ఆడమన్నట్లల్లా ఆడి ఆయన తొత్తుగా పని చేశారన్న ఆరోపణలు ఎదుర్కొని చంద్రబాబు సర్కార్ వచ్చాకా సెలవుపై వెళ్లిన మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ లభించింది. ఆయన త్వరలో పదవీ విరమణ చేయనున్న సంగతి విదితమే. ఇక జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యకు సాధారణ పరిపాలన శాఖలో ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు.   అదే విధంగా తొలి కేబినెట్ లో నిర్ణయించిన విధంగా శ్వేతపత్రాల విడుదల విషయంలోనూ చంద్ర బాబు స్పీడ్ పెంచారు. ముందుగా ప్రకటించినట్లుగా పోలవరంపై శుక్రవారం (జూన్ 28) శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై వాస్తవాలను చంద్రబాబు సర్కార్ ఈ శ్వేత పత్రంలో విడుదల చేయనుంది. కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం పరిశీలనకు శనివారం (జూన్ 29)న రానున్న సంగతి తెలిసిందే. పోలవరం నిర్మాణాలను పరిశీలించి ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కేంద్ర బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా పోలవరం పునులను చేపట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. 

సీఎం ముఖ్య కార్యదర్శిగా పీయూష్ కుమార్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్య కార్యదర్శిగా ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి పియూష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ క్యాడర్ ఐఎఎస్ అధికారి అయిన పీయూష్ కుమార్ కేంద్రంలో డెప్యూటేషన్ పై పని చేస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వ వినతిపై కేంద్రం ఆయనను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేసింది. కాగా పీయూష్ కుమార్ కు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తే ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.   కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఏపీ కేడర్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పీయూష్ కుమార్‌ ను రాష్ట్రానికి పంపించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వినతికి కేంద్రం సానుకూలంగా స్పందించింది.   కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగంలోని అదనపు కార్యదర్శిగా ఉన్న పీయూష్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగానే కాకుండా అదనంగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా కూడా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది. జగన్ తన హయాంలో ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసేశారు. జగన్ ఆర్ధిక అరాచకత్వం కారణంగా రాష్ట్ర ఖజానా దాదపు ఖాళీ అయిపోయింది. జగన్ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలను వెలికితీసి, రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టేందుకు పీయూష్ కుమార్ అయితేనే సరిపోతారని భావించిన చంద్రబాబు ఆయనకు కీలకబాధ్యతలు అప్పగించారు. 

గోదావరికి వరద.. పాపికొండల విహార యాత్రకు బ్రేక్!

ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరదనీరు పోటెత్తుతోంది. దీంతో పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పాపికొండలకు వెళ్లే మార్గంలో బోట్లను టూరిజం అధికారులు నిలిపివేశారు. మళ్లీ ప్రకటించేంత వరకూ ఈ మార్గంలో బోట్ల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇలా ఉండగా దేవీపట్నం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. ధవళేశ్వరం, భద్రాచలం వద్ద కూడా గోదావరి ప్రవాహం పెరుగుతున్నది. ఏపీలో వచ్చే మూడు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదవరి పరీవాహక ప్రాంతాలలో నిఘా పెంచారు. ఎటిగట్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికలు జారీ చేశారు.  

బాబు మార్క్ కనిపిస్తోంది.. సుపరిపాలన పరుగులు పెడుతోంది!

సీఎం చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీలో  సుపరిపాల‌న ప‌రుగులు పెడుతోంది. సీఎంగా బాబు ప్ర‌మాణ స్వీకారం చేసిన నాటినుంచి నిత్యం అధికారుల‌తో స‌మీక్షలు నిర్వ‌హిస్తూ బిజీబిజీగా గ‌డుపుతున్నారు. మ‌రోవైపు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సైతం త‌మ‌త‌మ శాఖ‌ల్లోని అధికారుల‌తో స‌మీక్ష‌లు జ‌రుపుతూ శాఖాప‌రంగా చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల‌పై ప్ర‌ణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే  వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రించిన ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారుల‌పైనా వేటు ప‌డింది. మొత్తానికి గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో ఎప్పుడూలేని విధంగా ప‌దిహేను రోజుల వ్య‌వ‌ధిలోనే చంద్ర‌బాబు, మంత్రులు ఏపీలో పాల‌న‌ను ప‌రుగులు పెట్టిస్తుండ‌డంతో ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, తాజాగా తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం మ‌రో కీలక నిర్ణ‌యం తీసుకుంది.  జులై 1వ తేదీనే రాష్ట్రంలోని అర్హులంద‌రికీ పింఛ‌న్లు అందించేందుకు సిద్ధ‌మైంది.  వైసీపీ  హ‌యాంలో వాలంటీర్ల ద్వారా ప్ర‌తీనెలా అర్హుల‌కు ఇంటింటికి పింఛ‌న్లు అందించింది. అయితే, ఎన్నిక‌ల ప్ర‌చార  స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌లు ఇదే అంశాన్ని ప్ర‌జ‌ల్లో విస్తృత ప్ర‌చారం చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే ప్ర‌తీనెలా ఇంటింటికి పింఛ‌న్ రాద‌ని, మీ పింఛ‌న్లు తీసేస్తార‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌స్తే వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తీసేస్తుంద‌ని, వారు లేకుంటే మీ ఇంటికి నేరుగా పింఛ‌న్లు, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు రావ‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేశారు. కానీ, చంద్ర‌బాబుపై న‌మ్మ‌కంతో ప్ర‌జ‌లు  తెలుగుదేశం కూట‌మికి మ‌ద్ద‌తుగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం చంద్ర‌బాబు నాయుడు తొలుత జూలై 1న పింఛ‌న్లు పంపిణీ చేసే కార్య‌క్ర‌మంపై దృష్టిసారించారు. జూలై 1వ తేదీన అర్హులైన ప్ర‌తీ పింఛ‌న్ దారుడికి ఇంటింటికి వెళ్లి న‌గ‌దు అందించాల‌ని అధికారుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ మేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్టారు.   వైసీపీ హ‌యాంలో అర్హుల‌కు రూ. 3వేలు పింఛ‌న్ అందించారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకివ‌స్తే పింఛ‌న్ రూ. 4వేలు అందిస్తామ‌ని, అదికూడా ఏప్రిల్ నెల‌నుంచి అమ‌లు చేస్తామ‌ని చంద్ర‌బాబు నాయుడు హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇచ్చిన హామీ మేర‌కు.. ఏప్రిల్‌, మే, జూన్‌ నెల‌ల‌కు సంబంధించి  తాను పెంచుతానన్న  వెయ్యి ప్లస్ ఇప్పటికే అమలులో ఉన్న రూ. 3వేలు కలిపి  జులై ఒకటిని పింఛనుదార్లందరికీ రూ. 7 వేలు చొప్పున పింఛ‌న్ అంద‌నుంది. పెంచిన పింఛ‌న్లతో క‌లిపి రూ.4,399.89 కోట్లను 65లక్షల 18వేల 496 మంది లబ్దిదారులకు ఒక్క రోజులోనే పంపిణీ చేయ‌నున్నారు. పింఛ‌న్ల పంపిణీ బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. ఒక్కొక్క ఉద్యోగికి 50 గృహాలు కేటాయించారు. జూలై 1న ఉదయం 6 గంటలకు పింఛ‌న్ల‌ పంపిణీ ప్రారంభ‌మై.. సాయంత్రం వ‌ర‌కు పూర్త‌య్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 29వ తేదీ శనివారం రోజే బ్యాంకుల నుండి నగదును డ్రా చేసుకుని పింఛన్ల పంపిణీకి సిద్ధం కావాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. పింఛ‌న్లు పెంపు వ‌ల్ల ప్ర‌తినెలా రాష్ట్ర ప్ర‌భుత్వంపై అద‌నంగా రూ. 819 కోట్ల మేర భారం ప‌డుతుంది. ప్ర‌స్తుతం చెల్లించాల్సిన బ‌కాయిల భారం రూ. 1650 కోట్లు.  వైసీపీ హ‌యాంలో పింఛ‌న్ల కోసం ఏడాదికి రూ. 22,273.44 కోట్లు  ఖ‌ర్చు కాగా.. కూట‌మి ప్ర‌భుత్వం హ‌యాంలో జూలై నెల‌లో 33,099.72 కోట్లు వ్య‌యం అవుతుంది. అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచే ప్ర‌తీనెలా ఇంటింటికీ పింఛ‌న్ అందిస్తామ‌ని ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేర‌కు జూలై 1న అర్హులైన ప్ర‌తీఒక్క‌రికి పింఛ‌న్ సొమ్ము అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయ‌డంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌నితీరుప‌ట్ల ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

రుషికొండ ప్యాలెస్‌లు కూల్చేయాలి.. కేంద్రానికి లేఖ!

విశాఖలోని రుషికొండ మీద వెలసిన వివాదాస్పద కట్టడాలు జగన్ ప్రభుత్వ తెలివితక్కువ తనానికి నిదర్శనంగా నిలిచి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ కట్టడాలను ఎలా ఉపయోగించుకోవాలో అర్థంకాక చంద్రబాబు ప్రభుత్వం బుర్ర వేడెక్కుతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం జనం రకరకాల సూచనలు చేస్తున్నారు. అయితే రుషికొండ ప్యాలెస్‌లను కూల్చాలంటూ మాత్రం ఎవరూ అడగటం లేదు. అయితే, ఇప్పుడు ఆ డిమాండ్ కూడా బయటకి వచ్చింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి, విశాఖపట్నం వాస్తవ్యుడు అయిన ఈఏఎస్ శర్మ రుషికొండ కట్టడాలను కూల్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కట్టడాలన్నిటినీ కూల్చడమే కరెక్ట్ అని ఆయన అంటున్నారు.  ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.  ఈఏఎస్ శర్మ  లేఖ ఇప్పుడు మాత్రమే రాయలేదు.. గతంలో అంటే, జగన్ ప్రభుత్వం వున్నప్పుడు కూడా ఆయన కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ అసలు గుట్టు రట్టు కావడంతో ఈఏఎస్ శర్మ రాసిన లేఖకు కూడా ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్ర అడవులు, పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖ కార్యదర్శి లీనా నందన్‌కి శర్మ ఈ లేఖ రాశారు. రుషికొండలో వున్న కట్టడాలన్నీ వెంటనే కూల్చేయాలని, రుషికొండలూ సిఆర్‌జడ్ నిబంధనలు ఉల్లంఘించి కట్టడాలు కట్టరాదని కమిటీ ఇప్పటికే తేల్చిందని, కమిటీ నివేదికను కాదని చేపట్టిన ఈ నిర్మాణాలను వెంటనే కూల్చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. రుషికొండ ప్యాలెస్‌ల నిర్మాణానికి అయిన ఖర్చు మొత్తం ఆ నిర్మాణంతో సంబంధం వున్న అధికారుల నుంచి వసూలు చేయాలని సూచించారు. కేరళలో కూడా గతంలో ఇలాంటి నిర్మాణాలే చేసినప్పుడు సుప్రీం కోర్టు కూలగొట్టాలని ఆదేశించిందని, ఆ ఆదేశాల ప్రకారమే వాటిని కూలగొట్టారని ఈఏఎస్ శర్మ గుర్తుచేస్తున్నారు.  రుషికొండ కట్టడాలు పర్యావరణానికి తీరని ద్రోహం చేసిన కట్టడాలని, పర్యాటక భవనాల పేరుతో పర్యావరణాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదని శర్మ చెబుతున్నారు. రుషికొండ భవనాలు 500 కోట్ల రూపాయల ఖర్చుతో కట్టారు కాబట్టి, కూలగొట్టకూడదు అనుకోవడం కరెక్ట్ కాదని, ఈ స్థాయిలో వున్న భవనాలు కూలగొడితే, భవిష్యత్తులో ఇలాంటి సాహసం ఇంకెవ్వరూ చేయరని ఆయన చెబుతున్నారు. పర్యవరణాన్ని పాడుచేసే కట్టడాలు కట్టడానికి పర్యాటకం అనే పేరు చెప్పడం ఫ్యాషన్ అయిందని ఆయన అంటున్నారు. కేంద్రానికి శర్మ రాసిన లేఖలో ఉదహరించిన చట్టాలు, నిబంధనలు చూస్తుంటే కళ్ళు తిరిగేలా వున్నాయి. ఇన్ని చట్టాలు, ఇన్ని నిబంధనలు వున్న ఎంతమాత్రం ఖాతరు చేయకుండా రుషికొండ కట్టడాలు కట్టారన్న విషయం అర్థమవుతోంది. మరి శర్మ రాసిన లేఖ మీద కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

వామ్మో.. హరీష్‌రావుది పెద్ద ప్లానే!

బీఆర్ఎస్‌ పార్టీకి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ బొంద పెట్టేశారు. ఇప్పుడు ఆ పార్టీకి పెదకర్మ పెట్టడానికి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారు వున్నారు. ఈ రెండు పార్టీలకు పోటీగా బీఆర్ఎస్‌ని గుటకాయస్వాహా చేయడానికి మరో నాయకులు పథక రచన చేస్తున్నారు. ఆయన ఎవరో ఈ ఆర్టికల్ హెడ్డింగ్ చూస్తేనే మీకు అర్థమైపోయి వుంటుంది. ఎస్. ఆయన ఎవరో కాదు.. కేసీఆర్ ముద్దుల మేనల్లుడు హరీష్ రావు.  బీఆర్ఎస్ పార్టీలో ఎంపీలు ఎవరూ లేరు. అసెంబ్లీ ఎన్నికలలో 39 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్‌లో ఇప్పుడు మిగిలింది కేవలం 33 మందే. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఉప ఎన్నికలో ఆ స్థానం కాంగ్రెస్‌ సొంతమైంది. మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ఇప్పుడు బీఆర్ఎస్‌లో మిగిలిన ఎమ్మెల్యేల సంఖ్య 33 మంది. ఈ 33 మందిలో కేసీఆర్ కుటుంబం ముగ్గుర్ని పక్కన పెడితే, మిగిలింది 30 మంది. ఈ 30 మందిని తమ సొంతం చేసుకోవడానికి ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో వున్న అధికారాన్ని ఎరగా చూపించి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో వున్న అధికారాన్ని తాయిలంగా చూపించి బీజేపీ ఈ ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాలు చేన్నాయి. అయితే ఈ రెండు పార్టీలు కాకుండా ఆ పనేదో తానే చేస్తే ఓ పనైపోతుందిగా అనే ఆలోచనలో హరీష్ రావు వున్నట్టు సమాచారం. హరీష్‌రావు ఎంత గింజుకున్నా బీఆర్ఎస్‌లో ఆయన స్థానం నాలుగు గానో, ఐదుగానో వుంటుందే తప్ప కేసీఆర్ తర్వాతి స్థానానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. టైమ్ బ్యాడ్ అయిందిగానీ, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి, లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ దుమ్ముదులిపి వుంటే, కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ ఢిల్లీలో హడావిడి చేసేవారే. తెలంగాణ ప్రజల అదృష్టం బాగుండి అలా జరగలేదు. దీని మీనింగ్ ఏమిటంటే, కేసీఆర్ నీడలో వుంటే హరీష్ రావు ఎన్నటికీ ఎదగరు. అందుకే, మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెసో, బీజేపీనో గద్దల్లాగా ఎగరేసుకు పోకముందే, తానే రంగంలోకి దిగితే మంచిదని హరీష్ రావు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక కేసీఆర్ని ప్రజలు విశ్వసించే అవకాశం లేదు కాబట్టి, నేను బీఆర్ఎస్‌కి సమర్థమైన నాయకత్వం వహిస్తానని ఎమ్మెల్యేలను ఒప్పించి తన నాయకత్వంలో బీఆర్ఎస్‌ని చీల్చే ఉద్దేశంలో హరీష్ రావు వున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా పార్టీని చీల్చకపోతే తనకు ఫ్యూచర్లో ఇక చాన్సే వుండదనేది హరీష్ రావు ఆలోచనగా పరిశీలకులు చెబుతున్నారు. బీఆర్ఎస్‌ని చీల్చి, తనదే అసలు బీఆర్ఎస్ అని నిరూపించుకుని, పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకునే ఉద్దేశంలో హరీష్ రావు వున్నట్టు సమాచారం. 

రామోజీరావు ఒక వ్యవస్థ... చంద్రబాబు!

మీడియా దిగ్గజం, వ్యాపార ప్రముఖుడు, సినీ ప్రముఖుడు దివంగత చెరుకూరి రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని కానూరులో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రామోజీరావు వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ అని చంద్రబాబు నాయుడు ఈ సందర్బంగా అన్నారు. ఏ రంగంలో అయినా రామోజీరావు నంబర్‌వన్‌గా రాణించారని చెప్పారు. ఒక ఎన్టీఆర్‌ని, ఒక రామోజీరావుని ఎవరూ అధిగమించలేరని చంద్రబాబు అన్నారు.  ‘‘అమరావతిలో రామోజీరావు విజ్ఞానకేంద్రం ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ అభివృద్ధిలో రామోజీరావు పాత్ర ఎంతో వుంది. నవ్యాంధ్రకు ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్న సమయంలో రామోజీరావు ‘అమరావతి’ పేరును సూచించారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి రామోజీరావు. పనిచేస్తూనే చనిపోవాలని కోరుకున్న వ్యక్తి రామోజీరావు తాను కోరుకున్నట్టుగానే కన్నుమూశారు. తెలుగు జాతి అన్నా, తెలుగు భాష అన్నా రామోజీరావుకు ఎంతో ఆప్యాయత. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు రావాలి. ఎన్టీఆర్, రామోజీరావు ఇద్దరూ యుగపురుషులు, వీరికి భారతరత్న సాధించడం మన బాధ్యత. రాష్ట్రంలో ఒక రోడ్డుకు రామోజీరావు పేరు పెడతాం. విశాఖలో రామోజీ చిత్రనగరి ఏర్పాటు చేస్తాం. రామోజీరావు ప్రజల ఆస్తి. ఆయన స్థాపించిన వ్యవస్థలను భావితరాలకు అందించాలి’’ అని చంద్రబాబు అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ‘‘రామోజీరావు మాట్లాడే విధానం నన్ను ఎంతో ఆకర్షించింది. ఆయన ఏం మాట్లాడినా ప్రజా సంక్షేమం కోణంలోనే మాట్లాడేవారు. పత్రికా స్వేచ్చ సమాజానికి ఎంత అవసరమో ఆయన చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారు. అమరావతిలో రామోజీరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి’’ అన్నారు.  రామోజీరావు కుమారుడు కిరణ్ మాట్లాడుతూ, ‘‘నాన్నగారు క‌ల‌లు క‌న్న న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి రామోజీ గ్రూపు త‌ర‌ఫున‌... నాన్న‌గారి జ్ఞాప‌కార్ధం 10 కోట్ల రూపాయ‌ల విరాళం ఇస్తున్నాం’’ అని ప్రకటించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని రామోజీరావు ఔన్నత్యాన్ని కొనియాడారు.

కాంగ్రెస్, బిఆర్ఎస్ ల మధ్యట్వీట్ ల యుద్దం 

కాంగ్రెస్ బిఆర్ఎస్ ల మధ్య ట్వీట్ ల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. వ్యక్తిగతంగా దాడులు, ప్రతి దాడులు చర్చనీయాంశమయ్యాయి.  సీతారామ ప్రాజెక్ట్ ద్వారా 10 లక్షల ఎకరాలకు నీరు అందనుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‍‌పై 'తెలంగాణ కాంగ్రెస్' ఎక్స్ హ్యాండిల్ స్పందించింది. 'కల్వకుంట్ల డ్రామారావా!' అంటూ ట్వీట్ చేసింది. 2014 లోనే రూ.3000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని, మీ కమిషన్ల కోసం రీడిజైన్ పేరుతో రూ.18,500 కోట్లకు పెంచి పదేళ్లు ఆలస్యం చేశారని పేర్కొంది. ప్రాజెక్టుకు అవసరమైన అనుమతుల్లో, భూ సేకరణలో, బాధితులకు పునరావాసం అందించడంలో నిర్లక్ష్యం చేసి, మీరు మాత్రం అందినకాడికి దోచుకున్నారని ఆరోపణలు గుప్పించింది. ప్రజా ప్రభుత్వం వచ్చాక జనవరి 7, 2024 నాడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాజెక్ట్ పురోగతిపై రివ్యూ నిర్వహించి, ఆరు నెల్లలో పనులు పూర్తయ్యేలా కార్యాచరణ ప్రారంభించారని పేర్కొంది. దాని ఫలితమే ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ గోదావరి జలకళ అని పేర్కొంది.అవినీతితో ఆగమాగం ప్రాజెక్టులు కట్టి, పడగొట్టడం, పంపుహౌజులను కట్టి, వరదతో ముంచెత్తడం, మంచిచేసే వారిపై దుష్ప్రచారాలతో బురద జల్లడమే మీకు తెలుసునని ఎక్స్ వేదిగా విమర్శలు గుప్పించింది. 'ఇప్పడు చెప్పు.. కాంగ్రెస్ వస్తే ఏమొచ్చే! ఎగిసిపడే గోదావరమ్మ జల కల వచ్చే! తెలంగాణ రైతన్నల జీవితాల్లో వెలుగొచ్చే!' అని పేర్కొంది. కాగా, సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తై... ఈరోజు ట్రయల్ రన్‌ను నిర్వహించింది.  

జగన్ పార్టీ రాజభవనాల నిర్మాణ రహస్యం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పార్టీ ఆఫీసులను వైసీపీ నిర్మిస్తోంది. అధికారంలో వున్న సమయంలో చాలా ఖరీదైన భూములను అప్పనంగా లీజుకు తీసుకుంది. ఆయా భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్యాలెస్‌ల రేంజ్‌లో వుండే భారీ కట్టడాలు అనుమతుల్లాంటివేవీ లేకుండా నిర్మిస్తోంది. ఈ కట్టాడాల్లో కొన్ని నిర్మాణం పూర్తయితే, కొన్ని నిర్మాణ దశలో వున్నాయి. కొన్ని నిర్మాణం ప్రారంభమయ్యే దశలో వున్నాయి. అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న ఒక నిర్మాణాన్ని మాత్రం ప్రభుత్వం కూల్చేసింది. మిగతా అక్రమ కట్టడాలన్నిటికీ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు సంతృప్తికరమైన వివరణ లభించని పక్షంలో ప్రభుత్వం ఏంచేస్తుందో చూడాలి. ఈ నేపథ్యంలో మా కట్టడాలు కూల్చొద్దంటూ వైసీపీ కోర్టును ఆశ్రయించింది. ఇవీ జగన్ పార్టీ ఆఫీసుల ఇష్యూలో ఇప్పటి వరకు అందరికీ తెలిసిన విషయాలు. అయితే ఈ పార్టీ ఆఫీసుల విషయంలో ఇంకా చాలా రహస్యాలు వున్నాయి. ముఖ్యంగా ఇంతింత రాజభవనాల నిర్మాణం వెనుక వున్న రహస్యాలు తెలుసుకుందాం. ఏపీలోని ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో మాంఛి బిజీ ఏరియాలో చాలా విలువైన గవర్నమెంట్ భూమి ఎక్కడుందో జిల్లాకు సంబంధించిన ఎంపీ, ఎమ్మెల్యేలు సెర్చ్ చేసి కనుక్కోవాలి. ఫలానా చోట భూమి వుంది. దాన్ని మన పార్టీ ఆఫీసుకి నొక్కేసుకోవచ్చు అని వాళ్ళు జగన్‌కి సమాచారం అందిస్తారు. అప్పుడు జగన్ రాజధాని లెవల్లో చక్రం తిప్పి, ఆ ప్రభుత్వ భూమి నేపథ్యం ఏదైనా, అన్నిటినీ పక్కకి నెట్టేసి, అభ్యంతరం చెప్పిన వారిని అణిచేసి సదరు భూమిని పార్టీకి అధికారికంగా కేటాయించేసుకుని, తానే అనుమతులు ఇచ్చేసుకుంటారు. మొత్తం 26 జిల్లాలో భూమిని కేటాయించడం వరకే జగనన్న పని ఆ తర్వాత జగనన్నకి ఎంతమాత్రం సంబంధం లేదు. పార్టీ ఆఫీసు నిర్మించడానికి పార్టీ అకౌంట్ నుంచి సింగిల్ రూపీ కూడా ఇవ్వరు. మరి జగనన్న సింగిల్ రూపీ కూడా ఇవ్వకుండా అంతంత ఇంద్రభవనాలు ఎలా నిర్మించారు? ఇక్కడే జగనన్న మార్కు ‘క్విడ్‌ప్రోకో’ స్కీమ్ అమల్లోకి వస్తుంది. ‘నేను మీకు ఈ ప్రయోజనం చేకూరుస్తా.. నువ్వు నాకు ఈ ప్రయోజనం చేకూర్చు’ స్కీము కింద రాష్ట్రంలో వైసీపీ భవనాల నిర్మాణం జరిగింది. స్థానికంగా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందినవారు, తాయిలాలు అందుకున్న వారు... వాళ్ళు తిరిగి చెల్లించాల్సిన తృణమో, పణమో డబ్బు, బిల్డింగ్ మెటీరియల్... ఇతరత్రా ఖర్చు రూపంలో చెల్లిస్తూ వుంటారు. అలాగే కొంతమంది మీద సామ, దాన, బేద, దండోపాయాలను ఉపయోగించి భవన నిర్మాణానికి అవసరమైన డబ్బును సేకరిస్తారు. ఇదంతా స్థానిక ఎమ్మెల్యేల నాయకత్వంలో జరుగుతుంది. ఈ విధంగా పార్టీకి పైసా ఖర్చు లేకుండా ఇంద్రభవనాల నిర్మాణం పూర్తవుతుంది. ఇదీ ఈ రాజభవనాల వెనుక వున్న రహస్యం.

తెలంగాణలో వారం రోజుల పాటు తేలిక పాటి వర్షాలు

తెలంగాణలో రానున్న వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది. గురువారం నుంచి శుక్రవారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో బలమైన ఉపరితలగాలులు వీస్తాయని పేర్కొంది.శుక్రవారం నుంచి శనివారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ఉపరితల గాలులువీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.

పుంగనూరు పుడింగికి భారీ షాక్!

మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పెద్దిరెడ్డికి.. పార్టీ పరాజయం తరువాత సొంత నియోజకవర్గంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా పుంగనూరులో పెద్దిరెడ్డి విజయం సాధించినప్పటికీ..సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే భయపడేలా పరిస్థితులు మారిపోయాయి. భయానికో మరింకెందుకో వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఒక్క పుంగనూరులోనే కాకుండా మొత్తం చిత్తూరు జిల్లాపైనే రామచంద్రారెడ్డి తిరుగులేనిపట్టు సాధించారు. కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యత జగన్ పెద్దిరెడ్డికి అప్పగించారంటేనే జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ స్థాయిలో పెత్తనం చేలాయించేవారో అర్ధం అవుతుంది. ఏపీలో గ‌త ఐదేళ్ల కాలంలో  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హయాంలో అరాచ‌క పాల‌న సాగింది. అవినీతి, అక్ర‌మాల‌తో ప్ర‌జా సొమ్మును వైసీపీ గ‌ద్ద‌లు అప్ప‌నంగా దోచేశారు. ప్ర‌శ్నించిన వారిపై దాడులు చేయ‌డంతోపాటు కొంద‌రిని మ‌ట్టుబెట్టారు. జ‌గ‌న్‌, ఆయ‌న బ్యాచ్ చేసిన అరాచ‌కాల‌తో ప్ర‌జ‌లు నోరువిప్పేందుకు సైతం భ‌య‌ప‌డ్డారు. చిత్తూరు జిల్లాలో మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు  అడ్డూ అదుపూలేకుండా సాగాయి.  ప్ర‌భుత్వానికి ఫేక్ బ్యాంకు గ్యారెంటీ పెట్టి వంద‌ల కోట్లు దోచుకున్న ఘనత పెద్దిరెడ్డిది. అటువంటి పెద్దిరెడ్డికి ఇప్పుడు సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తేరుకోలేని షాక్ ఇచ్చింది. పుంగనూరు మునిసిపల్ చైర్మన్ అలీం బాష 20 మంది కౌన్సిలర్లతో కలిసి వైసీపీకి రాజీనామా చేసి.. తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ చార్జ్ చల్లా బాబు సమక్షంలో సైకిలెక్కేశారు.  దీంతో పుంగనూరు మునిసిపాలిటీ  తెలుగుదేశం వశమైనట్లే. అధికారికంగా పుంగనూరు మినిసిపల్ చైర్మన్  గిరి తెలుగుశం పార్టీకి దక్కినట్లు ప్రకటన వెలువడటానికి కొంత సమయం పట్టొచ్చు. కానీ  పుంగనూరు మున్సిపాలిటీని వైసీపీ  కోల్పివడం మాత్రం తథ్యం అన్న పరిస్థితి ప్రస్తుతం ఉంది.  

మంత్రి పొంగులేటి నివాసంలో కస్టమ్స్ అధికారుల  సోదాలు 

తెలంగాణ మంత్రి పొంగులేటి నివాసంలో కస్టమ్స్  అధికారులు సోదాలు నిర్వహించారు.  బ్రాండెడ్ వాచీల స్మగ్లింగ్ కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్షారెడ్డి ఉన్నారు.   పొంగులేటి హర్షారెడ్డి నివాసంలోనూ కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు.  గతంలోనే పొంగులేటి హర్షా రెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారుల నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 4న విచారణకు రావాల్సిందిగా సమన్లు ఇస్తే   డెంగ్యూ ఫీవర్‍తో బాధపడుతున్నట్టు రిప్లై ఇచ్చారు హర్షారెడ్డి.  ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానన్నారు కానీ హాజరు కాలేదు. దాంతో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  ఫిబ్రవరి ఐదో తేదీన  చెన్నై విమానాశ్రయంలో రెండు లగ్జరీ వాచీలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  మహమ్మద్‌ ఫహెర్దీన్‌ ముబీన్‌ అనే వ్యక్తి హాంకాంగ్‌ నుంచి సింగపూర్‌ మీదుగా భారత్‌లోకి తీసుకొచ్చారు.  వాచీల్లో ఒకటి పాటెక్‌ ఫిలిప్‌ 5740, రెండోది బ్రెగ్యుట్‌ 2759 ఉన్నాయి.  పాటెక్‌ ఫిలిప్‌ వాచ్‌కు మన దేశంలో ఎక్కడా డీలర్లు లేరు.  బ్రెగ్యుట్‌ కంపెనీల వాచీలు ఇండియా మార్కెట్‌లో స్టాక్‌ లేకపోవటంతో కస్టమ్స్‌ అధికారులకు అనుమానం వచ్చింది. వాచీల విలువ ఏకంగా రూ.1.70 కోట్లపైగా ఉండటం తో స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు.  ముబీన్‌ను అరెస్టు చేసి, కోర్టు అనుమతితో విచారణ చేయగా మధ్యవర్తి నవీన్‌కుమార్‌ పేరును వెల్లడించారు.   

వార్నీ.. ఈ ఎటకారం అమెరికా లెవల్లో వుందిగా!

ఏ రాజకీయ నాయకుడైనా ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఏమని స్టేట్‌మెంట్ ఇస్తాడు? ‘‘మా పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి.. మా పార్టీకి అధికారం దక్కుతుంది’’ అని స్టేట్‌మెంట్ ఇస్తాడు. అయితే మన జగన్ మాత్రం ‘‘వైనాట్ 175’’ అని ఎక్కడబడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు గొంతు చించుకుని మరీ అరిచాడు. తమ నాయకుడు ఇలా అరుస్తూ వుండేసరికి, అది నిజంగా జరుగుతుందేమోనని భ్రమపడి ఆయన వందిమాగధులు కూడా ‘వైనాట్ 175’ అంటూ గొంతుతోపాటు బట్టలు కూడా చించుకుంటూ అరిచారు. చివరికి ఏమైంది? జగన్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. అప్పటి నుంచి జగన్ అంటే 11 అన్నట్టు, 11 అంటే జగన్ అన్నట్టు మారిపోయింది. ఈ అంకె మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రోలింగే ట్రోలింగ్. ఇప్పుడీ ట్రోలింగ్ తెలుగు రాష్ట్రాలను దాటి అమెరికా దేశానికి కూడా చేరుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘Y NOT 11’ అనే అక్షరాలు, అంకెలతో వున్న వెహికల్ నంబర్ ప్లేట్ జగన్ పరువుని (వుందంటారా?) అమెరికాలో కూడా తీసిపారేసింది. ఓహియో రాష్ట్రానికి చెందిన ఒక తెలుగు ఎన్నారై తన వాహనానికి ‘Y NOT 11’ అనే నంబర్ ప్లేట్ తీసుకున్నాడు. ఆ రాష్ట్రంలో వాహనాల యజమానులు తమకు కావలసిన నంబర్ తీసుకునే అవకాశం వుంటుంది. వీటిని వానిటీ నంబర్ ప్లేట్లుగా పిలుస్తారు. అమెరికాలో వున్న ఈ ఫెసిలిటీ ఇండియాలో కూడా ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తోంది కదూ!

రామమందిరం బీజేపీ రాజకీయలబ్ధి కోసమేనా?

ఎంతో ప్రతిష్టాత్మక నిర్మించిన అయోధ్య రామాలయం పై కప్పు ఒక్క వర్షానికే లీక్ అవుతుంది.  ఈ సంవత్సరం జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన  ఈ ఆలయానికి కేవలం ఆరునెలలకే మరమ్మతులకు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల ముందు హడావుడి నిర్మాణం, ప్రారంభం ఏమిటని అప్పట్లోనే పరిశీలకులు విమర్శలు గుప్పించారు. బీజేపీ భక్తి రాముడి మీద కాదు.. రాజకీయ లబ్ధి మీదేనని అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు రామమందిరం గర్భగుడి లీకేజీ అప్పటి విమర్శలు నిజమేననిపించేలా ఉంది.   అయోధ్య రామాలయం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అయోధ్య రామాలయం గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే మోదీ ఈ లీకేజిపై సమాధానం ఇవ్వాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది. దీనివల్ల మోదీ ప్రభుత్వంపై అవినీతి మరకలు అంటినట్టయ్యింది. గర్బగుడి పై కప్పు ఒక్క వర్షానికే లీక్ కావడం బిజెపి వర్గాల్లో ఆందోళన వ్యక్తమౌతుంది. రామాలయంలోకి వెళ్లే 13 దారుల్లో నీరు నిలిచి పోతుంది. అయోధ్య రామాలయ నిర్మాణం ఎన్నికల స్టంట్ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అయోధ్య రామాలయం పై కప్పు నీరు కారడం చర్చనీయాంశమైంది.  ఉత్తర్‌ప్రదేశ్,అయోధ్యలోని రామాలయంలో గర్భగుడి పైకప్పు నుండి నీరు లీక్ అయిందని దాని ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్  తెలిపారు. భారీ వర్షం తర్వాత ఇలా జరగడం భక్తుల్లో ఆందోళ కలిగిస్తుంది. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పూజారి ఆరోపించారు. శనివారం అర్ధరాత్రి జల్లులు పడిన తర్వాత ఆలయ ప్రాంగణం నుండి వర్షపు నీరు వెళ్లే ఏర్పాటు కూడా లేదని, అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ప్రధాన పూజారి కోరారు. ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆలయానికి చేరుకుని పైకప్పును  నిశితంగా పరిశీలించారు.  అయోధ్య రామాలయానికి మరమ్మతులు చేసి వాటర్‌ప్రూఫ్‌గా మార్చాలని ఆదేశాలు ఇచ్చారని ఆలయ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి.ఆలయ నిర్మాణ పురోగతి గురించి మిశ్రా విలేకరులతో  మాట్లాడారు. మొదటి అంతస్తు పనులు కొనసాగుతున్నాయని, ఈ ఏడాది జూలై నాటికి పూర్తవుతాయని, డిసెంబర్ నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆచార్య సత్యేంద్ర దాస్ విలేకరులతో మాట్లాడుతూ ఆలయ గర్భగుడి పైకప్పు నుండి భారీ లీకేజీ ఏర్పడింది అని అన్నారు.  రామ్ లల్లా విగ్రహం ముందు పూజారి కూర్చునే స్థలం , విఐపి దర్శనం కోసం ప్రజలు వచ్చే ప్రదేశం నుండి నేరుగా పైకప్పు నుండి వర్షపు నీరు కారుతోంది. జల్వాన్‌పురా నుంచి హనుమాన్‌గర్హి భక్తిపథ్‌ వరకు, తేది బజార్‌ నుంచి లోపలి ప్రాంతాల వరకు నీటి ముంపు ఎక్కువగా ఉందని స్థానికులు తెలిపారు. వర్షం సమయంలో రాంపథ్‌లోని సందుల్లో మురుగు నీరు ఇళ్లలోకి చేరుతుంది.  . ఇళ్ల నుండి నీటిని తొలగించడానికి మున్సిపాలిటీ సిబ్బంది నానా యాతన పడుతున్నారు.  ఇదిలా ఉండగా, ఆలయ నిర్మాణంలో అధికార భారతీయ జనతా పార్టీ  అవినీతికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది.. దేశంలో విశ్వాసం , స్వచ్ఛత యొక్క చిహ్నాలు కూడా  దోచుకునే అవకాశాలు అయ్యాయని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ అన్నారు.  బిజెపి వరుసగా మూడో పర్యాయం అధికారంలో రావడానికి రామాలయ నిర్మాణం అని విమర్శకులు అంటున్నారు. 

సజ్జల పోయి.. పేర్ని వచ్చే!

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాంఢాంఢాం.. అన్నట్లుగా ఇప్పుడు వైసీపీలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని చెప్పవచ్చు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లుగా ఇన్నాళ్లూ జగన్ కు కళ్లు, చెవులూ, ముఖం అన్నట్లుగా వ్యవహరించి, జగన్ సర్కార్ లో సకల శాఖల మంత్రిగా సర్వ అధికారాలూ చెలాయించిన గత ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జలకు ఇప్పుడు పార్టీలో సీన్ అయిపోయింది. ఆయన సినిమాకు శుభం కార్డు అని చెప్పలేం కానీ ఎండ్ కార్డ్ పడిపోయింది. ఇప్పుడు ఆయన జగన్ పక్కన కాదు కదా అయన కంటి చూపుకు కూడా కనిపించకుండా దూరం దూరంగా మెలుగుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని పార్టీ సమావేశాలలో ఎక్కడో వెనుక సీట్లో కనిపించీ కనిపించకుండా ఉన్న ఆయన ఉనికే ఇందుకు నిదర్శనం. అసలు జగన్ వైసీపీ పేరిట సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచీ పార్టీలో నంబర్ 2 స్థానంలో ఉన్న జగన్ కేసులలో ఏ2 అయిన విజయసాయిరెడ్డి స్థానాన్ని2019 తరువాత సజ్జల ఆక్రమించారు. అప్పటి నుంచీ పార్టీ పరాజయం వరకూ సజ్జల దాదాపు షాడో సీఎంగా వ్యవహరించారు. అలాగే పార్టీ వ్యవహారాల్లో కూడా తన మాటే ఫైనల్ అన్న స్థాయిలో పెత్తనం చెలాయించారు.  అయితే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకున్న క్షణం నుంచీ సజ్జల ప్రభ మసకబారుతూ వచ్చింది. ముఖ్యంగా పార్టీలో ఇంకా మిగిలిన నేతలు, క్యాడర్ కూడా ఓటమి బాధ్యత అంతా సజ్జలదే అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో అంటే ఎన్నికలకు ముందు ఒక దశలో పార్టీలో సజ్జల వ్యతిరేకులంతా ఏకమై ఆయనకు వ్యతిరేకంగా జగన్ కు ఫిర్యాదు చేయడానికి కూడా రెడీ అయ్యారు. అయితే జగన్ ఎవరి మాటా వినే రకం కాకపోవడంతో వారి ఫిర్యాదు ఏమిటి అన్న విషయాన్ని పట్టించుకునేందుకు కూడా ఆయన ఇష్ట పడలేదు. అదే విధంగా అంత కంటే ముందు.. అంటే జగన్ తన క్యాబినెట్ ను పునర్వ్యవస్థీకరించిన సమయంలో మంత్రి పదవులు పోయిన వారు, పదవి ఆశించి నిరాశ చెందిన వారూ కూడా సజ్జలనే టార్గెట్ చేస్తూ ఆందోళనలకు దిగారు, విమర్శలు గుప్పించారు. అయితే వాటిని వేటినీ జగన్ ఖాతరు చేయకపోవడంతో వారు అప్పటికి మౌనం వహించారు.  ఇప్పుడు పార్టీ చరిత్ర ఎన్నడూ చూడని విధంగా అత్యంత అవమానకరమైన ఓటమిని మూటగట్టుకుంది. దీంతో పార్టీలో ఇప్పుడు సజ్జలకు వ్యతిరేకంగా గళాలు గట్టిగా వినిపిస్తున్నాయి.  జగన్ కూడా పార్టీ పరాజయం తరువాత సజ్జన పనితీరు పట్ల ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశారనీ పార్టీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పార్టీలో సజ్జల స్థానాన్ని దక్కించుకునేది ఎవరన్న చర్చ సహజంగానే మొదలైంది.   అయితే పార్టీ వ్యవహారాల్లో ఇటీవల అంటే వైసీపీ ఘోర పరాజయం తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు ముఖం చాటేస్తుంటే.. పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి అధికార తెలుగుదేశంపై దూషణలతో ప్రసంగాలు దంచేస్తున్నారు. దీంతో ఇప్పుడు జగన్ కు ఇప్పుడు పేర్ని నాని కళ్లూ, చెవులుగా వ్యవహరిస్తున్నారా? సజ్జలను వెనక్కు నెట్టేసి ఆ స్థానాన్ని ఆక్రమించారా అన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. దీంతో ఈ మార్పుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ముల్లూ పోయి కత్తీ వచ్చే అంటే సజ్జల లూప్ లైన్ లోకి వెళ్లి లైమ్ లైట్లోకి పేర్నివచ్చాడంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లు పెడుతున్నారు. సజ్జల వల్ల పార్టీకి జరిగిన నష్టానికి ఎన్నో రెట్లు ఎక్కువ నష్టం ఇప్పుడు పేర్ని నాని తన నోటి దూలతో చేయబోతున్నారని జోస్యం చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా  జగన్ తన హయాంలో తమ్మినేని సీతారాం ను స్పీకర్ గా ఎన్నుకున్నప్పటి చంద్రబాబు కానీ, తెలుగుదేశం సభ్యులు కానీ ఆయనను స్పీకర్ స్థానం వరకూ తోడ్కొని వెళ్లలేదని పేర్ని నాని చెప్పడాన్ని ఎత్తి చేపుతున్నారు. అయితే పేర్ని నాని చెప్పింది పూర్తి అవాస్తవమని చెప్పేందుకు నాడు తమ్మినేని సీతారాం ను స్పీకర్ స్థానం వరకూ తోడ్కొని వెళ్లిన వారిలో తెలుగుదేశం సభ్యులు అచ్చెంనాయుడు, నిమ్మల రామానాయుడు ఉన్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ ను పోస్టు చేస్తూ..  అలవోకగా పచ్చి అబద్ధాలు మాట్లాడి అడ్డంగా బుక్కైపోవడం పేర్ని నానికి కొత్తేమీ కాదని అంటున్నారు.  అదే విధంగా అచ్చెన్నాయుడు జగన్ ను హత్య చేయాలన్నారంటూ పేర్ని నాని చేసిన ఆరోపణ కూడా అభూత కల్పనే అంటున్నారు. అచ్చెన్నాయుడు తన ప్రసంగంలో జగన్ ను రాజకీయంగా లేకుండా చేయాలని అన్నారని వారు సోదాహరణంగా వివరిస్తున్నారు. అదే సమయంలో మాజీ స్పీకర్ అంటే జగన్ హయాంలో సభాపతిగా ఉన్న తమ్మినేని సీతారాం చంద్రబాబునాయుడిపై నేరుగా అనుచితంగా, ఒక విధంగా ఆయనను బెదరిస్తూ మాట్లాడిన వీడియోలను కూడా   సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తూ పేర్ని నాని వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు.