అదిరిందమ్మా అమ్రపాలీ...!
posted on Jun 24, 2024 @ 1:14PM
ఐఏఎస్ ఆఫీసర్ అమ్రపాలి ఆరేళ్ల క్రితం వరంగల్ జిల్లా కలెక్టర్.గా వున్నప్పుడు అప్పుడు అధికారం చెలాయిస్తున్న కేటీఆర్ ఆమె మీద అధికారం చెలాయించారు. అమ్రపాలి సమర్థురాలైన అధికారిగా పేరు తెచ్చుకున్నప్పటికీ, కేటీఆర్ తన అధికారం చూపించడం కోసం ఆమె మీద ఫైర్ అయ్యారు. పైగా అమ్రపాలి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం వల్ల కూడా ఆమె అభద్రతాభావంలో పడిపోయారు. తన మీద ఫైర్ అవుతున్న కేటీఆర్‌కి నమస్కారం పెట్టి బతిమాలుకున్న ధోరణిలో మాట్లాడారు. అప్పటికీ ఇగో చల్లారని కేటీఆర్ ఆమెతో చాలా బిల్డప్పుగా మాట్లాడారు. పద్ధతి మార్చుకోకపోతే బాగుండదని హెచ్చరించారు. ఆ తర్వాత అమ్రపాలి ఈ దరిద్రులతో తనకెందుకని కేంద్ర సర్వీసుకి వెళ్ళిపోయారు. ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయంలోనే పోస్టింగ్ పొందారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన పోవడంతో ఆమె మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఇప్పుడు అమ్రపాలిని జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో అమ్రపాలి శకం ప్రారంభం కానుంది. ఆరోజు ఆమెను అవమానించిన కేటీఆర్ అధికారం కోల్పోయి, తన పార్టీనే కాపాడుకోలేని పరిస్థితిలో పడిపోయారు. ఏదైనా అవసరం వుంటే, అమ్రపాలి దగ్గరకే వెళ్ళి గౌరవంగా మాట్లాడాల్సిన పరిస్థితికి చేరుకున్నారు. కర్మ ఎవరినీ ఊరికే వదిలిపెట్టదు అంటే ఇదే!