ఏపీలో వాతలు, కోతలు తప్పవా ?
కరోనా భయం ఉన్నా దేశంలో ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలు అన్నీ యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి.కరోనా రక్షణ చర్యల నడుమ రెండు విడతలుగా సుమారు నెల రోజులకు పైగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్’ను ప్రవేశ పెట్టింది. సభ ఆమోదించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఏపీ సహా అనేక రాష్ట్రాలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
\ఆంధ్ర ప్రదేశ్’లోనూ ఇతరత్ర్రా కార్యకలాపాలన్నీ,మామములుగానే సాగుతున్నాయి. స్కూల్స్, హాల్స్,మాల్స్, బార్స్ అన్నీ యథాతథంగా నడుస్తునాయి. కానీ, అసెంబ్లీ సమావేశాలు అంటే మాత్రం ఆ ఒక్కటీ అడగొద్డంటోంది ముఖ్య మంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం. అంతే కాదు,వరసగా రెండవ సంవత్సరం కూడా ఆర్డినెన్సు రూట్లో, ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్’తో మమ అనిపించేసింది.
అయితే, ఇందుకు కరోనా లేదా నిన్న మొన్నటిదాకా జరిగిన స్థానికసంస్థల ఎన్నికలు లేదా రేపు జరగబోయే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక, జడ్పీటీసీ, ఎమ్టీపీసీ ఎన్నికలు కారణమా, అంటే, కాదనే సమాధానమే వస్తోంది.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగతున్న తెలంగాణలో బడ్జెట్ ఆగలేదు. ఒక్క కాదు తెలంగాణ అనే కాదు, అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న రాష్ట్రాలతో సహా అన్ని రాష్ట్రల శాసనసభలు బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకున్నాయి. పోనీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్న స్థితికి, చేరింది కాబటి ఉప ఎన్నికల ముందు బొక్కలు కనిపించకుండా దాచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందా అంటే, అదీ కాదని అంటున్నారు. ఎందుకంటే, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక సర్కార్ బొక్కలన్నింటినీ బయట పెట్టింది, వేయవలసిన అక్షింతలు వేసింది. అప్పు చేసి పప్పుకూడు కథలా రాష్ట్ర ఆర్థిక ఆర్థిక పరిస్థితి ఉందని కాగ్, పేర్కొంది.కాబట్టి, బడ్జెట్ పెట్టడం వలన కొత్తగా బయటపడే బొక్కలు ఏమీలేవు. రాష్ట్ర ఖజానానే నిండుకుంది. సోషల్ వెల్ఫే హాస్టల్స్ విద్యార్ధులకు పాలు, గుడ్లు పెట్టే పరిస్థితి కూడా లేదు, ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.
మరి అలాంటప్పుడు, జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ఎందుకు భయపడుతోంది? ఎందుకు ఓటాన్, అది కూడా ఆర్డినెన్సు రూట్’లో ఎందుకు తెచ్చింది? అంటే అందుకు ప్రభుత్వ అంతర్గత వర్గాలు రెండు ప్రధాన కారణాలు చెపుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థతి అద్వాన్నం కంటే అద్వాన్నంగా వుంది. రానున్న మూడు నెలల్లో, ఆదాయం కొంత పెరిగి, పరిస్థితి ఎంతో కొంత మెరుగు పడుతుందని, ప్రభుత్వం ఆశిస్తోంది. సో .. అందాకా ఓటాన్’తో నెట్టుకొచ్చి, అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడితే, ప్రభుత్వ అబోరు కాసింత అయినా దక్కుతుందని ప్రస్తుతానికి బడ్జెట్’ను దాటేసిందని, రాజకీయ వర్గాల్లో వినవస్తోంది.
అదలా ఉంటే, కొంచెం ఆలస్యంగానే అయినా, జగన్ సర్కార్’కు ఈ స్థాయిలో సంక్షేమ పథకాలను అమలుచేస్తూ పోతే, అందినకాడికి అప్పులు చేసినా,చివరకు ప్రభుత్వ అస్తులనే అమ్మినా, ఆర్థిక పరిస్థిని అదుపు చేయడం సాధ్యం కాదన్న వాస్తవం అర్థమైందని, అంటున్నారు. అందుకే ఇంటికో పథకం పేరిట సంక్షేమ పథకాల సమీక్ష జరిపి కోతలు విధించే ఆలోచన ఉందని తెలుస్తోంది.అదే విధంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు, పన్నులు, ఇతరత్రా వాతలు పెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్దమైంది. అందుకే, తిరుపతి తర్వాత బడ్జెట్ ప్రవేశ పెడితే కోతలు, వాతలు యధేచ్చగా చేస్కోవచ్చిని జగన్ సర్కార్ ఆలోచిస్తోందని అంటున్నారు. అయితే, తిరుపతి దాటక ముందే బద్వేల్ ఉపఎన్నిక అనివార్యమైంది, ఈ పరిస్తితులలో ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది,ఆసక్తికరంగా మారింది. అయితే ఒకటి మాత్రం నిజం రానున్న రోజుల్లో, జగన్న పథకాలు, వైఎసార్ వరాలు ముందులా ఉండవు, అలగే వాతలు తప్పవు, అని ఆర్థిక శాఖ పద్దులనూ చూసేపెద్దలు.. చెపుతున్నారు.