వాట్ ఎ ఐడియా గురు..
posted on Mar 30, 2021 @ 12:04PM
ఎండకాలం వచ్చిందా.. తిప్పలు తప్పవు.. ఎండ నుండి ఉపశమనం పొందాలంటే బుర్రకు పదును పెట్టాల్సిందే.. ఎండ నుండి ఉపశమనం పొందడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం.. కానీ కొంత మందికి వచ్చిన ఐడియా కి అవ్వాక్కు అవ్వకుండా ఉండలేం. వారి ఐడియాను చూస్తే మెచ్చుకోలేకుండా ఉండలేం.. ఒక్కక్కరి థాట్ ప్రాసెస్ ఒక్కోలా ఉంటుంది. కర్ణాటకు చెందిన ఓ వ్యక్తి ఐడియా చూస్తే వాట్ హే ఐడియా గురు అనాల్సిందే. తన ఐడియా చూసిన అందరూ తనకు హ్యాండ్స్ అప్ చెప్పాల్సిందే .. ఇంతకీ ఆ ఐడియా ఏంటని అనుకుంటున్నారా.. మీరే చదవండి తెలుస్తుంది..
కర్ణాటకు చెందిన ఇక వ్యక్తి శ్రీవారి దర్శనార్ధం తన సొంత కారులో తిరుమలకు చేరుకున్నాడు. అక్కడికి వచ్చిన జనం పార్కింగ్ లో ఉన్న తన కారుని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు.. ఎండ భారీనుండి ఉపశమనం పొందడానికి తన కారుకు మొత్తానికి పేడ, బంకమట్టి పట్టించారు.. ఎండ నుండి ఉపశమంకోసం ఇలా చేశారని డ్రైవర్ చెప్పాడు. నందకం కార్ల పార్కింగ్ దగ్గర నిల్చున్న ఈ కారుని భక్తులంతా ఆసక్తిగా తిలకిచ్చారు.