బాలల హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత!
posted on Nov 14, 2021 @ 11:28AM
బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత, పిల్లల మనసు తెలసుకుని మెలగాలి.. పిల్లలు పూలతోటలోని మొగ్గలాంటి వారు. వాళ్లను ప్రేమగా సాకాలి. నేటి బాలలే రేపటి పౌరులు. భావి భారత భాగ్య విదాతలు అని భారత తొలి ప్రధాని నెహ్రూ చాలా సందర్భాల్లో చెప్పారు.. నవంబర్ 14 తేదీన ఆయన పుట్టిన రోజు.. అదేరోజున బాలల దినోత్సవం జరుపుతారు.. చిన్న పిల్లల ద్వారానే మనం ప్రేమ సూత్రాన్ని మరింత బాగా అర్ధం చేసుకోగలం, పిల్లలు తెలివైన వారుగా ఎదగాలంటే వాళ్లకు మంచి కాల్పనిక కథలు వినిపించాలి.
ఈ రోజు పిల్లలకు పండుగ రోజు లాంటింది. ప్రపంచంలో చాలా దేశాలు ఈ దినోత్సవాన్ని ఈ నెల 20న జరుపుకుంటాయి. దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఎక్కువ కాలం ఆ హోదాలో సేవలందించారు. ఆయనకు గులాబీ అన్నా పిల్లలన్నా ఎంతో మక్కువ. చెప్పలేనంత ఇష్టం..
స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మానవహక్కులు మొదలైన వాటన్నిటికీ సుదీర్ఘ పోరాట చరిత్ర ఉంది. వాటిని సాధించే క్రమంలో గొప్ప గొప్ప అనుభవాల్ని సంపాదించినం. కానీ, ఆ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మానవహక్కుల విస్తారంలోకి పిల్లల్ని చేర్చం.
నేటి ఈ ప్రజాస్వామ్య ప్రపంచంలో సైతం తల్లిదండ్రులు, టీచర్లు, పనిచేసేచోట్ల యజమానులు ఇంకా బయట ప్రతీచోటా పిల్లల్ని కొట్టటం, తిట్టటం, అవమానించటం, స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించుకోవడం, సరియైన ఆహారం అందించకపోవడం జరుగుతోంది, ఇది ఘోరమైన చర్య అని మనం అర్ధం చేసుకోవాలి.
పిల్లల హక్కుల గురించిన జ్ఞానంగానీ, చైతన్యంగానీ, ప్రయత్నంగానీ అంతగా జరుగలేదనేది వాస్తవం. తల్లిదండ్రులకు పిల్లల మీద సర్వహక్కులు వుంటాయనుకునే దూరదృష్టి నుంచి ఇంకా బయటపడలేదు. అత్యంత విచారకరమైన విషయం ఏం అంటే బుద్ది జివులనబడే వాళ్ళుకూడా- దారిద్య్రం, నిరుద్యగం, వివక్షత వంటి పరిస్థితుల్ని ముల కారణాలుగా పరిగణిస్తూ పిల్లలకు చేస్తున్న అన్యాయాన్ని పూర్తిస్థాయిలో గుర్తించలేకపోయారు.. అందుకే పిల్లల హక్కులు, పిల్లల సంరక్షణ అనే దృక్పథాలు బలపడటానికి ఒక బృహత్ ప్రచారం, ఒక ఉద్యమం అవసరమయ్యాయి.
ఈ నేపధ్యంలోనే ఐక్యరాజ్య సమితి 1989లో బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించింది. పిల్లల పౌర రాజకీయ, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల పరిరక్షణకు పూనుకున్న ఏకైక ఒప్పందం..
భారత ప్రభుత్వం 1992 డిసెంబరు 11 న ఈ ఒడంబడికను ఆమోదించింది ఈ తీర్మానంలో బాలల హక్కుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే, అలాగే పిల్లల హక్కుల్ని పరిరక్షించడానికి ఎవరికైనా హక్కు వుంది. అని తెలియజేశారు. అన్ని పరిస్ధితుల్లోను పిల్లలందరికీ వర్తించే సార్వత్రిక ఒప్పందమిది.
తల్లితండ్రుల బాధ్యత మీద కూడా బాలల భవిష్యత్ ఆధారపడి వుంటది.. అవి క్రింద తెలిపిన విధంగా ఉండాలి..
సురక్షిత వాతావరణంలో పిల్లలు ఉండేలా చూడటం.
వీలున్నంత ఎక్కువగా పిల్లలతో సంభాషిస్తూ వారి మనసు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవడం.
పిల్లలకు సురక్షిత బాల్యమే కాక ఇంకా ఎన్నో రకాల హక్కులు ఉన్నాయని పెద్దలందరికీ తెలియజేసి, వాటిని సంరక్షించేలా చూడటం.
పిల్లలకి, వారి కుటుంబానికి వీలున్నంతగా సాయపడటం.
పిల్లల రక్షణకి ప్రమాదం కలిగించే వాటిని తెలుసుకుని, అలాంటి ప్రమాదాల నివారణకి కృషి చెయ్యటం.
అవసర సమయాల్లో పోలీసులకి / పిల్లల సంరక్షణా సంస్ధలకి ఫిర్యాదు చేసి అవసరమైన చట్టబద్ధ భద్రతని కలిగించటం. పిల్లలు కష్టపడుతున్నప్పుడు అది వారి ఖర్మ అని బావించకూడదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఇబ్బందులతోనే పెరిగారు అన్న ఉదాసీనత ఉండకూడదు. ఇది మన సంప్రదాయం. ఎప్పట్నుంచో ఇలాగే జరుగుతోందన్న ధోరణి ఉండకూడదు. పేదరికం, లంచగొండితనం వల్లే పిల్లలకి బాధలు అన్న అలక్ష్య ధోరణి పనికిరాదు. పిల్లల కష్టాలకు తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబమే కారణం అన్న భావన సరైంది కాదు. ఆ పిల్లలకి మనకి ఏం సంబంధం లేదు అన్న ఉదాసీనతా కూడదు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు ఆటపాటలకు దూరంకాకుండా చూసుకోవాలి, గత 20 నెలలుగా కరోనా చేసిన విలయతాండవం అంత ఇంత కాదు.. చదువు మీద ద్యసాలేదు , ఆటలు అడలన్న ఉత్సాహం కూడా లేదు.. వీటికి తోడు స్మార్ట్ ఫోన్ లు వచ్చి వాటిలో వచ్చే ఆన్లైన్ క్లాస్ ల కంటే వాళ్ళు అడే వీడియో గేమ్ తో ఎక్కువ సమయం గడుపుతున్నారు.. పిల్లల చదువు వారి భవిష్యత్ నీ దృష్టిలో పెట్టుకొని తల్లితండ్రులు కొందరు అప్పుచేసి మరి వేలల్లో డబ్బులు కర్చుపెట్టి స్మార్ట్ ఫోన్ కొని ఇచ్చారు.. అదికాస్తా ఆన్లైన్ క్లాస్ లు ఏమో కానీ వీడియో గేమ్స్ లో బాలలు ఫోన్ లకు విపరీతంగా అకారితులై గ్రూప్ గా కలిసి ఎక్కువ సమయం ఫోన్ తో కలక్షేపం చేస్తూన్నారు. ఈ అలవాట్లను మెల్లిమెల్లిగా బాలలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి.. అదేవిదంగా కార్పొరేట్ స్కూల్ లో చదివించే తల్లితండ్రులు కార్పొరేట్ విద్యా సంస్థల మధ్య పోటీ కారణంగా బాలలు ఒత్తిడికి గురవుతున్నారు కావున వారితో ఎక్కువ సమయం గడుపుతే కొంత వరకు పలితాలు వస్తావి అనేది వాస్తవం .. కానీ ఎంత మంది తల్లితడ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతున్నారు!
తల్లిదండ్రులు కూడా ర్యాంకులు, మార్కులకే ప్రాధాన్యం ఇవ్వడంతో బాలల వికాసానికి దోహదపడే బాల సాహిత్యం మాటే వినిపించడం లేదు. నీతి కథలు, బాల సాహిత్య పుస్తకాల జోలికి వెళ్లే తీరికే ఉండడం లేదు.
చందమామ, పేదరాశి పెద్దమ్మ, కాశీ మజిలి కథలు, అక్బర్ బీర్బల్, అరేబియన్ నైట్స్ ఇలా ఏ పుస్తకం గురించి చెప్పినా నేటి తరం బాలలు తెల్ల ముఖం వేస్తారు. ఆటలు ఆడితే సమయం వృధా అవుతుందని తల్లిదండ్రులు భావిస్తున్న ప్రస్తుత తరుణంలో పిల్లలకు శారీరక వ్యాయామం లేకుండాపోయింది. సెలవు రోజుల్లో కూడా పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టే పరిస్థితి నెలకొంది. దీంతో బాలల ఒత్తిడికి గురవుతున్నారు. బాల్యంలోని మాధుర్యాన్ని కోల్పోతున్నారు..
శిశు మరణాలు, పిల్లల మరణాల్ని తగ్గించేందుకు,
ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అభివృద్ధి చేస్తూ పిల్లలలందరికీ అవసరమైన వైద్య సహాయం, ఆరోగ్య రక్షణలు కల్పించేందుకు,
ప్రాథమిక ఆరోగ్య సంరక్షణతో పాటు తగిన పౌష్టికాహారం, పరిశుభ్రమైన త్రాగునీరు అందించడం ద్వారా, పర్యావరణ కాలుష్యం వల్ల ఏర్పడే ఇబ్బందులు ప్రమాదాలను గుర్తించడం ద్వారా పౌష్టికాహార లోపాన్ని, వ్యాధులను ఎదుర్కొనేందుకు,
తల్లులకు ప్రసవానికి ముందు, ప్రసవానంతరం తగిన ఆరోగ్య సంరక్షణలు అందించేందుకు,
సమాజంలో అన్ని శాఖలకు ప్రత్యేకించి తల్లిదండ్రులకు, పిల్లలకు విద్య పొందేందుకు, పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం గురించిన ప్రాధమిక విజ్ఞాన్నాన్ని వినియోగించటంలో సహకరించేందుకు, తల్లి పాల వల్ల ప్రయోజనాలు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ప్రమాదాల నివారణ గురించి వివరించేందుకు
వ్యాధి నిరోధక ఆరోగ్య సంరక్షణ, తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
పిల్లల ఆరోగ్యం గురించిన సంప్రదాయ విధానాలను నిర్మూలించేందుకు భాగస్వామ్య దేశాలు తగిన చర్యలు తీసుకోవాలి.
- పీలి కృష్ణ
7801004100