పిన్నెల్లి పిల్లి మీద అనర్హత వేటు?
posted on May 22, 2024 @ 11:24AM
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంత దుర్మార్గ, దుష్ట, నీచ, నికృష్ణ, కమీనేనా అని ఎన్నికల కమిషన్ అధికారులు నోళ్ళు తెరిచారట. ఇలా నోళ్ళు తెరిచింది ఎప్పుడూ.... పోలింగ్ బూత్‌లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు, వీవీ ప్యాట్లు నేలకేసి కొట్టడం, పోలింగ్ బూత్‌ల దగ్గర మహిళల మీద విరుచుకుపడటం.. ఇలాంటి వీడియో ఆధారాలు చూశాకగానీ ఈసీకి అసలు విషయం అర్థం కాలేదు. కెమెరాల దయవల్ల ఈ వీడియోలు ఉన్నాయిగానీ, లేకపోతే ఎన్నికల కమిషన్ కూడా పిన్నెల్లి పిల్లి కాదు పులి అని అనుకుంటూ వుండేదేమో. పిన్నెల్లి పోలింగ్ స్టేషన్లో దూరి అంత రచ్చ చేస్తుంటే గాడిదల్లాగా చూస్తూ నిల్చున్న పోలీసులు, పిన్నెల్లి రాగానే దణ్ణాలు పెట్టేసిన అధికారులు, జరిగిన తతంగాన్నంతా వీడియో తీసిన ఉద్యోగులు ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ని చెప్పాలి కదా.. అలా చెప్పలేదు. పిన్నెల్లి టైమ్ బాగాలేక సీసీ టీవీ ఫుటేజ్ చూడాలని అనుకోవడం వల్ల పిన్నెల్లి దారుణాలు బయటపడ్డాయి. పిన్నెల్లి విషయంలో ఈసీ చాలా సీరియస్‌గా వుందన్న వార్తలు వస్తున్నాయి. అరెస్టుకు ఆదేశాలు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం వస్తోంది. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, పిన్నెల్లిని ఎమ్మెల్యే పదవికి, ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించే అవకాశాలను కూడా ఈసీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసీ ఏ నిర్ణయమైనా లాగకుండా త్వరగా తీసుకుంటే మంచిది.