పిడకలతో జగన్ పీడకలకి ముగింపు!

ఈ ప్రశాంత్ కిషోర్ ఒకడు.. పోలింగ్ ముందు రోజు జర్నలిస్టు రవిప్రకాష్‌తో  కలసి జగన్‌ని ఉతికి ఆరేశాడు. జగన్ గెలిచే అవకాశం లేదని చెప్పాడు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇదే మాట చెప్పాడు. ‘‘నేను చాలా ఆలోచించి చెబుతున్నాను. నేను చెప్పింది జరగకపోతే ఎదురయ్యే పర్యవసానాల గురించి కూడా ఆలోచించి చెబుతున్నాను. నేను చెప్పింది జరగకపోతే జనం నా ముఖం మీద పేడ కొడతారు. అదే, నేను చెప్పింది జరిగితే ఆ పేడ జగన్ ముఖాన పడుతుంది’ అన్నారు. అంతే, ఆంధ్రా జనం.. ముఖ్యంగా రైతులు ఆ పాయింట్ గట్టిగా పట్టుకున్నారు. జగన్ ముఖం, పేడ అనే రెండు పదాలు వాళ్ళ మనసులలో ఫిక్స్ అయిపోయాయి. రేపు జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడి జగన్ ప్రభుత్వం తుడిచిపెట్టుకుని పోగానే ప్రశాంత్ కిషోర్ ఏదైతే చెప్పాడో ఆ పని చేయడానికి రైతులు రెడీ అవుతున్నారు. 

ఐదేళ్ళ పదవీకాలంలో రైతుల్ని జగన్ పెట్టిన హింస అంతా ఇంతా కాదు. రైతులకు ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదు. రైతులకు వారసత్వంగా వచ్చిన భూములు, కష్లపడి సంపదించుకున్న భూముల పట్టాదార్ పాస్ పుస్తకాల మీద జగన్ ఫొటో ప్రింట్ చేయడం, భూముల సర్వే పేరుతో సరిహద్దు రాళ్ళ మీద జగన్ పొటో ప్రింట్ చేయడం.. అనేక రైతు వ్యతిరేక విధానాలను అవలంబించడం, ముఖ్యంగా అమరావతి రైతులను దారుణంగా అవమానించడం లాంటి కారణాలతో జగన్ మీద రైతులు చాలా గుర్రుగా వున్నారు. ఇప్పటి వరకూ అధికారంలో వున్నాడు కాబట్టి రైతులు ఎందుకొచ్చిన గొడవ అని ఊరుకున్నారు. జూన్ 4న జగన్ ప్రభుత్వం ఖతమ్ అయిపోయిన తర్వాత రైతులు తమ కార్యాచరణను మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా జగన్ ఫొటోనే ఆ ఫొటోలన్నిటి మీదా పేడ కొట్టాలని రైతులు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఐదేళ్ళపాటు పీడకలగా దాపురించిన జగన్‌కి పిడకలతో వీడ్కోలు చెప్పాలని కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. తన పొలాలకు సరిహద్దులుగా నాటిన రాళ్ళమీద వున్న జగన్ ముఖం మీద పిడకలు కొట్టడంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రైతులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పిడకల సంగతి అలా వుంచితే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తే, జగన్ ఫొటో వున్న పాస్ పుస్తకాలను కసిదీరా చించేయడానికి కూడా రైతులు ఎదురుచూస్తున్నారు. 

Teluguone gnews banner