నేడు మోడీ తొలి కేబినెట్ భేటి

      నరేంద్ర మోడీ భారత ప్రధాన మంత్రి మంగళవారం ఉదయం పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ ఉదయం 9 గంటలకు ప్రధాన మంత్రి కార్యాలయంలో అడుగుపెట్టిన మోదీ మొదటగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. పీఎంవో అధికారులు అందజేసిన మొదటి ఫైల్‌పై నరేంద్ర మోదీ సంతకం చేయడంతో ఆయన లాంచనంగా ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర కేబినెట్ తొలిసారిగా భేటీ కానుంది. మరోవైపు కేంద్ర మంత్రుల శాఖను రాష్ట్రపతి భవన్ ఈ ఉదయం అధికారికంగా ప్రకటించింది.   కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు : * రాజ్‌నాథ్ సింగ్ - హోంశాఖ * సుష్మాస్వరాజ్ - విదేశీ వ్యవహరాలు * అరుణ్‌జైట్లీ - రక్షణ, ఆర్థిక కార్పొరేట్ వ్యవహరాలు * అనంతకుమార్ - రసాయనాలు, ఎరువుల శాఖ * రవిశంకర్‌ప్రసాద్ - న్యాయ, సమాచార ప్రసార శాఖ * మేనకాగాంధీ - స్త్రీ, శిశు సంక్షేమం * వెంయ్యనాయుడు - పట్టణాభివృద్ధి హౌసింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ * స్మృతి ఇరానీ - మానవవనరులు * ఉమాభారతి - జలవనరులు, గంగా ప్రక్షాళన * నితిన్ గడ్కరీ - రవాణా శాఖ * ప్రకాశ్ జవదేకర్ - అటవీ పర్యావరణ(స్వతంత్ర) * నిర్మలా సీతారామన్ - వాణిజ్యశాఖ (స్వతంత్ర) * వీకే సింగ్ - విదేశాంగ సహాయమంత్రి * సదానందగౌడ - రైల్వేశాఖ * జ్యూయల్ ఓరమ్- గిరిజన సంక్షేమం * నజ్మా హెస్తుల్లా - మైనార్టీ వ్యవహారాలు * గోపీనాథ్ ముండే - గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ * హర్‌సిమ్రాత్‌కౌర్ బాదల్ - ఫుడ్ ప్రాసెసింగ్ * రాధా మోహన్‌సింగ్ - వ్యవసాయం * నరేంద్రసింగ్ తోమర్ - గనులు, స్టీల్, కార్మిక, ఉపాధి * హర్షవర్ధన్ - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం * పీయూష్ గోయల్ - విద్యుత్, బొగ్గు(స్వతంత్ర) * నిహాల్‌చంద్ - ఎరువులు, రసాయనాలు సహాయమంత్రి * ఉపేంద్ర కుష్వాహా - గ్రామీణాభివృద్ధి * పి. రాధాకృష్ణన్ - భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు * సంజీవ్‌కుమార్ బాలియా - వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ * క్రిష్ణన్ పాల్ - రోడ్డు రవాణా, హైవే, షిప్పింగ్

మహానాడుకి హరికృష్ణ వచ్చారు..!

      గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు కార్యక్రమానికి నందమూరి హరికృష్ణ హాజరయ్యారు. చంద్రబాబుతో విభేదాలున్నాయని భావిస్తున్న తరుణంలో హరికృష్ణ రావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా వచ్చారు. పదేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలుగు తమ్ముళ్లు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీని ఘన విజయం దిశగా నడిపించిన పార్టీ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు ను మహానాడు అభినందించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీర్మానం ప్రవేశపెట్టారు.

సమైక్య రాష్ట్రంలో టిడిపి చివరి మహానాడు

      నగరంలోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. సమైక్య రాష్ట్రంలో టిడిపి పార్టీ చివరి మహానాడు ఇది. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడకు చేరుకుని టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అలాగే బాలయోగి, ఎర్నన్నాయుడు, లాలాజాన్ పాషా, పరిటాల రవి, మాధవరెడ్డిలకు బాబు నివాళులర్పించారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన సిబిరాలను ప్రారంభించారు. టీడీపీ మహానాడుకు ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు.మహానాడులో కళాకారులు చేసిన సాంస్కతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి.

ఆరోగ్యం కోరుకొంటున్న బాలకృష్ణ

  హిందూపురం నుండి ఎన్నికయిన బాలకృష్ణ తను కూడా మంత్రిపదవి చెప్పట్టాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే ఆయన చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. బహుశః ఆయన కూడా చంద్రబాబుతో బాటే జూన్ 8న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆయన తనకు ఆరోగ్యశాఖను కోరుకొంటున్నట్లు తెలుస్తోంది. ఎందువలన అంటే ఆయన చాలా కాలంగా హైదరాబాదులో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. అప్పటి నుండే ఆయనకు నిరుపేద ప్రజలకు కూడా మెరుగయిన వైద్య సేవలు అందించాలనే తపన ఉండేది. ఇప్పుడు ఆరోగ్యశాఖ మంత్రిగా తనకు అవకాశం దక్కినట్లయితే గ్రామీణ ప్రాంతాలకి కూడా ఉన్నత వైద్య సదుపాయాలు విస్తరించాలని రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులలో సదుపాయాలను పెంచి వాటి పనితీరును మెరుగుపరిచి, కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పధకానికి మరిన్ని మెరుగులు దిద్ది అర్హులయిన ప్రజలందరికీ దానిని అందించాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. కానీ, ఇటువంటి ముఖ్యమయిన శాఖ నిర్వహణకు మంచి అనుభవం, అవగాహన, కార్యదక్షత అవసరం. బాలయ్యకు సినీ పరిశ్రమ కష్టసుఖాల గురించి మంచి అవగాహన ఉన్నందున, చంద్రబాబు ఆయనకు సమాచార, ప్రసార శాఖ లేదా అటువంటి శాఖనే ఈయవచ్చును.

మోడీ ప్రమాణ స్వీకారోత్సవం విశేషాలు

  ఈరోజు నరేంద్ర మోడీ భారతదేశ 15వ ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణం చేసారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో చాలా విశేషాలు ఉన్నాయి. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశవిదేశాలకు చెందిన దాదాపు 4,000 మంది హాజరయ్యారు. వారిలో సార్క్ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు, వివిధ దేశ ప్రతినిధులు, మన దేశం నలుమూలల నుండి వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పద్మా అవార్డు గ్రహీతలు, అధికార, ప్రతిపక్ష నేతలు, 777 మంది పార్లమెంటు సభ్యులు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, అనేకమంది కాంగ్రెస్ నేతలు, సినిమా తారలు, క్రికెట్ ఆటగాళ్ళు, కొందరు సాధువులు, పారిశ్రామిక వేత్తలు ఇంకా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.   వారందరి భద్రత నిమిత్తం రెండు రోజుల ముందు నుండే భద్రతా దళాలు డిల్లీని జల్లెడపట్టి, రాష్ట్రపతి భవన్ పరిసరాలను పూర్తిగా దిగ్బందం చేసి తమ అదుపులో ఉంచుకొన్నారు. అంతేగాక రాష్ట్రపతి భవన్, ఆ పరిసర ప్రాంతాలలో భద్రతాదళాలు హెలికాఫ్టర్లతో గగనతలం నుండి కూడా పహారా కాసాయి.   దూరదర్శన్ మరియు అనేక వందలాది ప్రవేట్ టీవీ ఛానల్స్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా, దేశ విదేశాలలో ప్రజలు వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ వారు మొత్తం 9 కెమెరాలతో, ఒక బ్రాడ్కాస్టింగ్ వ్యానుతో ఒకేసారి 15 బాషలలో ప్రత్యక్ష ప్రసారం చేసారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి యూపీయే మంత్రి వర్గానికి, మోడీ మంత్రి వర్గానికి, సార్క్ దేశాల ప్రతినిధులకు విందు ఇవ్వనున్నారు.

మోడీ కేబినెట్: ప్రమాణం చేసిన మంత్రులు వీరే

    భారత 15 వ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణ స్వీకారోత్సవ సోమవారం సాయంత్రం దేశదేశాలనుంచి వచ్చిన ఆత్మీయ అతిథులమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో అట్టహాసంగా జరిగింది, గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు నాలుగువేలమంది అతిథులు తరలిరాగా ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈశ్వర్ కీ శపథ్ లేతా హూం అంటూ మోదీ దేవునిపై ప్రమాణం చేశారు. మోడీ కేబినెట్:  ప్రమాణం చేసిన కేంద్ర మంత్రులు వీరే:   రాజ్‌నాథ్ సింగ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లక్నో నుండి గెలుపొందారు. మంత్రిగా పని చేసిన అనుభవం. సుష్మా స్వరాజ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  విదిష నుండి గెలుపొందారు. మూడుసార్లు మంత్రిగా పని చేసిన అనుభవం. అరుణ్ జైట్లీ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయశాఖ మంత్రిగా అనుభవం. అదనపు సొలిసిటర్‌గా పని చేశారు. రాజ్యసభ సభ్యులు. వెంకయ్య నాయుడు - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు. రాజ్యసభకు మూడుసార్లు వెళ్లారు. గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు. నితిన్ గడ్కరీ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. నాగపూర్ నుండి గెలుపొందారు.   సదానంద గౌడ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరు నుండి ఎంపీగా గెలుపొందారు. రెండుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. ఉమాభారతి - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. నజ్మా హెఫ్తుల్లా - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్. బిజెపి ఉపాధ్యక్షురాలు. ఐదుసార్లు లోకసభకు వచ్చారు. గోపినాథ్ ముండే - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. రామ్ విలాస్ పాశ్వాన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హాజీపూర్ నుండి గెలుపొందారు. లోకసభకు ఎనిమిదిసార్లు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం. ఎన్డీయే భాగస్వామి ఎల్జేపీ అధ్యక్షులు. కల్రాజ్ మిశ్రా - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.దేవరియా నుండి గెలుపొందారు. యూపి రాష్ట్ర మంత్రిగా పని చేసిన అనుభవం. రాజ్యసభ సభ్యుడిగా అనుభవం. మేనకా గాంధీ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పిలిపిత్ నుండి గెలుపొందారు. పర్యావరణవేత్త, జంతుసంరక్షణ ఉద్యమాకారిణి. గతంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఆంగ్లంలో ప్రమాణం చేశారు. అనంత్ కుమార్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరు దక్షిణనుండి గెలుపొందారు. కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం. ఆరుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. రవిశంకర ప్రసాద్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  రాజ్యసభ సభ్యులు. సుప్రీం కోర్టు న్యాయవాదిగా అనుభవం. గతంలో పలు శాఖలకు మంత్రిగా పని చేశారు. అశోక గజపతి రాజు - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయనగరం నుండి గెలుపొందారు. ఎపిలో పలు శాఖల్లో మంత్రిగా పని చేశారు. రాజకీయాల్లో 36 ఏళ్ల రాజకీయ అనుభవం. టిడిపి ఎంపీ. అనంత్ గీతే - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రమంత్రిగా అనుభవం. ఐదుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. హర్ స్మిత్ కౌర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భటిండా (పంజాబ్) నుండి గెలుపొందారు. మూడుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. సామాజిక ఉద్యమకారిణి. నరేంద్ర సింగ్ తోమర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్వాలియర్ నుండి గెలుపొందారు. మున్నాభయ్యాగా అభిమానుల్లో గుర్తింపు. జ్యూయల్ ఓరమ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుందర్ ఘడ్ నుండి గెలుపొందారు. నాలుగుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. గతంలో కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం. రాధా మోహన్ సింగ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పూర్వీ చంపారన్ నుండి గెలుపొందారు. బిజెపిలో పలు కీలక పదవులు నిర్వహించారు. నాలుగుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. టిసి గెహ్లాట్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. స్మృతి ఇరానీ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  రాజ్యసభ సభ్యురాలు. బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు. రాహుల్ గాంధీ పైన పోటీ చేసి ఓడిపోయారు. గతంలో గుజరాత్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. హర్షవర్ధన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చాందినీ చౌక్ నుండి గెలుపొందారు. ఢిల్లీ మాజీ మంత్రి. గత ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి. జనరల్ వికె సింగ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఘజియాబాద్ నుండి గెలుపొందారు. మాజీ సైన్యాధిపతి. రక్షణ శాఖలో విశిష్ట సేవలు అందించారు. రావ్ ఇంద్రజిత్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురుగావ్ నుండి గెలుపొందారు. నాలుగుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం. సంతోష్ గ్యాంగ్ వర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  బరేలీ నుండి గెలుపొందారు. ఏడుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. సామాజికవేత్తగా సుపరిచితులు. శ్రీపాద్ నాయక్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఉత్తర గోవానుండి గెలుపొందారు. బిజెపిలో పలు కీలక పదవులు. మూడుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. ధర్మేంద్ర ప్రదాన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సభ్యులు. బిజెపి యువమోర్చా నాయకుడు. గతంలో రెండుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. శర్వానంద్ సోనోవాల్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లఖింపూర్ నుండి గెలుపొందారు. బిజెపిలో పలు కీలక పదవులు నిర్వహించారు. రెండుసార్లు లోకసబకు ఎన్నికయ్యారు. ప్రకాశ్ జవదేకర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సభ్యులు. రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. బిజెపి అధికార ప్రతినిధి. పీయూష్ గోయల్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  బిజెపి కోశాధికారి. 27 ఏళ్ల రాజకీయ అనుభవం. రాజ్యసభ సభ్యులు. జితేంద్ర సింగ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉదంపూర్ నుండి గెలుపొందారు. బిజెపి జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు. జమ్మూ కాశ్మీర్‌లో కీలక బిజెపి నేత. నిర్మలా సీతారామన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి అధికార ప్రతినిధి. జాతీయ మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు. ప్రముఖ రాజకీయ విశ్లేషకురాలు. ఆంగ్లంలో ప్రమాణం చేశారు. గౌడర్ మల్లికార్జునప్ప సిద్దేశ్వర - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  దావణగెరె నుండి గెలుపొందారు. ఆంగ్రంలో ప్రమాణం చేశారు. వరుసగా మూడోసారి లోకసభకు ఎన్నికయ్యారు. మనోజ్ సిన్హా - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గాజీపూర్ నుండి గెలుపొందారు. మూడుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం మాజీ అధ్యక్షుడు. నిహాల్ చంద్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉపేంద్ర కుశ్వాహా - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. కరాకట్ నుండి గెలుపొందారు. రాష్ట్రీయ లోకసమతా పార్టీ నాయకుడు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సిపి రాధాకృష్ణన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోయంబత్తూర్ నుండి గెలుపొందారు. తమిళనాడు బిజెపి అధ్యక్షుడు. కి రెన్ రిజిజు - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ నుండి గెలుపొందారు. రెండుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. క్రిషన్ పాల్ గుజర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఫరీదాబాద్ నుండి గెలుపొందారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు. సంజీవ్ కుమార్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ముజఫర్ నగర్ నుండి గెలుపొందారు. తొలిసారి లోకసభకు ఎన్నికయ్యారు. వాసవ మన్సూక్ భాయ్ ధనాజీ భాయ్- కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  బారుచ్ (గుజరాత్) నుండి గెలుపొందారు. నాలుగుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. రావ్ సాహెబ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. విష్ణుదేవ్ సాయి - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాయగఢ్ నుండి గెలుపొందారు. రెండుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. సుదర్శన్ భగత్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి లోకసభకు ఎన్నికయ్యారు.

కేంద్రమంత్రిగా అశోక్ గజపతి రాజు ప్రమాణం

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్గ అనుభవం వున్న టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతి రాజు నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు.  1978లో రాజకీయ ప్రవేశం చేసిన ఆయన ఇప్పటి వరకు 7 సార్లు రాష్ట్ర శాసన సభకు ఎన్నికైయ్యారు. ఈ సారి తొలిసారిగా విజయనగరం నుంచి లోక్ సభకు పోటీ చేసి తిరుగులేని నాయకుడిగా గెలుపొందారు. ఆయన సత్ప్రవర్తన, నీతి, నిజాయితీలే ఆయనకు కేంద్ర మంత్రి పదవిని తెచ్చిపెట్టాయి. టిడిపి తరఫున కేంద్రంలో దక్కింది ఒక్క మంత్రి పదవే అయినా, ఆ పదవి కూడా ఆశోక్ గజపతికి దక్కడం విశేషం. ఆయనకు పౌర విమానయ శాఖ కేటాయించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ , చంద్రబాబు కేబినెట్ లో పలు కీలక శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు వుంది.

రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్న అతిధులు

      నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్ సన్నద్దమైంది. అతిధులంతా రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్నారు. బంగాదేశ్ ప్రధాని హసీనా తప్ప మిగిలిన సార్క్ దేశాధినేతల౦తా మోడీ ప్రమాణానికి హాజరయ్యారు. మన్మోహన్ సింగ్, సోనియా, రాహుల్ గాంధీ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మన రాష్ట్రం నుంచి బాలకృష్ణ, చంద్రబాబు, కేసిఆర్, నారా లోకేష్, టిడిపి ఎంపీలు హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అంబానీ కుంటుంబం కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.   బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ కూడా రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. అద్వానీతో పాటు కూతురు ప్రతిభ కూడా వచ్చారు. అద్వానీ అబ్దుల్ కలాం తదితరులతో కరచనాలం చేశారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా వచ్చారు. సోనియా గాంధీ, ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. మన్మోహన్ సింగ్ సోనియాను పలకరించారు. తన సతీమణితో కలిసి మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం రాష్ట్రపతి భవన్‌కు చేరుకన్నారు.మోడీ సన్నిహితులు అమిత్ షా, రామ్ మాధవ్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన మన్మోహన్ సింగ్ నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలను కలిశారు.  

మోడీ కేబినెట్ 45 మంది మంత్రులు వీరే..!

      ఈరోజు సాయంత్రం భారతదేశ 15వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న నరేంద్ర మోడీ సహా 45 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. వీరిలో 24 మంది కేబినెట్ మంత్రులుగానూ, 10 మంది స్వతంత్ర సహాయ మంత్రులుగానూ, 11 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేస్తారు. మోదీ మంత్రి వర్గంలో ఏడుగురు మహిళలకు చోటు దక్కింది.   24 మంది కేబినెట్‌ మంత్రులు: రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ, నితిన్‌గడ్కరీ, సందానంద గౌడ, ఉమాభారతి, నజ్మాహెప్తుల్లా, గోపీనాథ్‌ముండే, రాం విలాస్‌ పాశ్వాన్‌, కల్‌రాజ్‌మిశ్రా, మేనకాగాంధీ, అనంతకుమార్‌, రవిశంకర్‌ప్రసాద్‌, అశోక్‌గజపతిరాజు, అనంత్‌గీతే, హర్సిమ్రత్‌కౌర్‌ బాదల్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌, జువల్‌ ఓరమ్‌, రాధామోహన్‌సింగ్‌, థామర్చంద్‌ గెహ్లాట్‌, స్మృతి ఇరానీ, డా. హర్షవర్దన్‌ 10 మంది స్వతంత్ర సహాయ మంత్రులు: వీకేసింగ్‌, రావ్‌ ఇంద్రజిత్‌సింగ్‌, సంతోష్‌కుమార్‌ జాంగ్వార్‌, శ్రీపాద నాయక్‌, ధర్మేంద్రప్రధాన్‌, సర్బానంద సోనోవాల్‌, ప్రకాశ్‌ జవదేకర్‌, పీయూష్‌గోయల్‌, డా. జితేంద్రసింగ్, నిర్మలాసీతారామన్‌ 11 మంది సహాయ మంత్రులు: జీఎం సిద్ధేశ్వర, మనోజ్‌సిన్హా, ఉపేంద్రకుష్వాహా, పోన్‌ రాధాకృష్ణన్‌, కిరేన్‌ రిజిజూ, కిషన్‌ సార్‌గుజ్జర్‌, సంజీవ్‌ బల్యావ్‌, మన్షుఖ్‌బాయ్‌ దంజీబాయ్‌వసావా, రావుసాహెబ్‌ దాదారావు పాటిల్‌ దాన్వే, విష్ణుదేవ్‌ సహాయ్‌, సుదర్శన్‌ భగత్‌.

మోడీకి వాజ్‌పేయి ఆశీస్సులు

      ఈరోజు సాయంత్రం భారతదేశ 15వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న నరేంద్ర మోడీ బీజేపీ మాజీ ప్రధాని వాజ్‌పేయిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. దేశంలోనే ఉన్నతమైన భాధ్యతను చేపట్టబోతున్న మోదీ భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా తగిన సూచనలు, సలహాలను వాజ్‌పేయి దగ్గర తీసుకున్నారు. ఆ తరువాత రాజ్ ఘాట్ సందర్శించి పూజ్య బాపూజీకి నివాళులు అర్పించారు. ఆయన చిన్న మంత్రి వర్గంతోనే సుపరిపాలన అందించాలని భావిస్తున్నందున, కొన్ని మంత్రిత్వ శాఖలను ఒకే గొడుగు క్రిందకు తీసుకువచ్చి వాటిన్నిటి బాధ్యత ఒకే మంత్రికి అప్పగించబోతున్నారు. ఇప్పటికే వారి పేర్లతో కూడిన జాబితా రాష్ట్రపతి కార్యాలయానికి పంపడం జరిగింది. వారందరినీ రాష్ట్రపతి కార్యాలయం నుండి ప్రమాణస్వీకారానికి సిద్దంగా ఉండమని కోరుతూ ఆహ్వానాలు పంపడం జరిగింది.

మోడీ ప్రమాణం: ఢిల్లీకి చేరుకున్న నవాజ్, రాజపక్సే

      నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు సార్క్ దేశాధినేతలు ఒక్కక్కరు భారత్‌కు చేరుకుంటున్నారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కొద్ది సేపటి క్రితం న్యూఢిల్లీ విమానాశ్రయంకు చేరుకున్నారు. ఆయనకు భారత దౌత్యాధికారులు ఘన స్వాగతం పలికారు. తాను శాంతి సందేశం ఇచ్చేందుకే భారత్‌కు వచ్చానని షరీఫ్ తెలిపారు. నవాజ్ షరీఫ్ రేపు భారత కొత్త ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉంది. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఢిల్లీకి చేరుకున్నారు. కొద్ది సేపటికి క్రితం రాజపక్సే ఇక్కడి విమానాశ్రయంకు చేరుకుని అక్కడ నుంచి ఆయన తనకు ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం నరేంద్రమోడీ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి హాజరుకావడానికి ఆయన ఇక్కడకు వచ్చారు. కాగా, రాజపక్సే రాకను తమిళ పార్టీలు నిరసిస్తున్న కారణంగా రాజపక్సేకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.  

మోడీ క్యాబినెట్ మంత్రుల జాబితా?

  ఈరోజు సాయంత్రం భారతదేశ 15వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న నరేంద్ర మోడీ కొద్ది సేపటి క్రితం రాజ్ ఘాట్ సందర్శించి పూజ్య బాపూజీకి నివాళులు అర్పించారు. ఆ తరువాత డిల్లీలో గల గుజరాత్ భవన్ లో తన పార్టీ నేతలతో సమావేశమవుతారని సమాచారం. ఆయన చిన్న మంత్రి వర్గంతోనే సుపరిపాలన అందించాలని భావిస్తున్నందున, కొన్ని మంత్రిత్వ శాఖలను ఒకే గొడుగు క్రిందకు తీసుకువచ్చి వాటిన్నిటి బాధ్యత ఒకే మంత్రికి అప్పగించబోతున్నారు. ఉదాహరణకు రైల్వేస్, రోడ్డు రవాణా, షిప్పింగ్ మరియు విమానయాన శాఖలను ఒకే మంత్రి వర్గంగా మార్చబోతున్నారు. అదేవిధంగా మరికొన్ని ఇతర శాఖలను కూడా వాటి ప్రధాన శాఖలలో విలీనం చేయబోతున్నారు. మోడీ క్యాబినెట్ లో దాదాపు 16 క్యాబినెట్ హోదా గల మంత్రులు, మరో 14మంది సహాయ మంత్రులు ఉండవచ్చని తాజా సమాచారం. ఇప్పటికే వారి పేర్లతో కూడిన జాబితా రాష్ట్రపతి కార్యాలయానికి పంపడం జరిగింది. వారందరినీ రాష్ట్రపతి కార్యాలయం నుండి ప్రమాణస్వీకారానికి సిద్దంగా ఉండమని కోరుతూ ఆహ్వానాలు పంపడం జరిగింది.   తాజా సమాచారం ప్రకారం మోడీ క్యాబినెట్ లో స్థానాలు దక్కించుకోబోతున్న వారు ఎవరంటే: రాజ్ నాథ్ సింగ్-హోం శాఖ, అరుణ్ జైట్లీ-ఆర్ధిక శాఖ, నితిన్ గడ్కరీ-రైల్వే మరియు రోడ్లు రవాణ శాఖ, సుష్మ స్వరాజ్- విదేశాంగ శాఖ, రవి శంకర్ ప్రసాద్-ఐ.టీ., సమాచార, ప్రసార శాఖ హర్ష వర్ధన్-ఆరోగ్య శాఖ వీరితిబాటు మన రాష్ట్రం నుండి వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజు మోడీ క్యాబినెట్ లో కేంద్రమంత్రులుగా చేరనున్నారు. వీరుగాక మేనక గాంధీ, వీకే సింగ్.పీయూష్ గోయల్ తదితరులు కూడా మోడీ మంత్రి వర్గంలో సహాయ మంత్రులుగా చేరే అవకాశం ఉంది.