నేడు మోడీ తొలి కేబినెట్ భేటి
posted on May 27, 2014 @ 12:32PM
నరేంద్ర మోడీ భారత ప్రధాన మంత్రి మంగళవారం ఉదయం పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ ఉదయం 9 గంటలకు ప్రధాన మంత్రి కార్యాలయంలో అడుగుపెట్టిన మోదీ మొదటగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. పీఎంవో అధికారులు అందజేసిన మొదటి ఫైల్‌పై నరేంద్ర మోదీ సంతకం చేయడంతో ఆయన లాంచనంగా ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర కేబినెట్ తొలిసారిగా భేటీ కానుంది. మరోవైపు కేంద్ర మంత్రుల శాఖను రాష్ట్రపతి భవన్ ఈ ఉదయం అధికారికంగా ప్రకటించింది.
కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు :
* రాజ్‌నాథ్ సింగ్ - హోంశాఖ
* సుష్మాస్వరాజ్ - విదేశీ వ్యవహరాలు
* అరుణ్‌జైట్లీ - రక్షణ, ఆర్థిక కార్పొరేట్ వ్యవహరాలు
* అనంతకుమార్ - రసాయనాలు, ఎరువుల శాఖ
* రవిశంకర్‌ప్రసాద్ - న్యాయ, సమాచార ప్రసార శాఖ
* మేనకాగాంధీ - స్త్రీ, శిశు సంక్షేమం
* వెంయ్యనాయుడు - పట్టణాభివృద్ధి హౌసింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
* స్మృతి ఇరానీ - మానవవనరులు
* ఉమాభారతి - జలవనరులు, గంగా ప్రక్షాళన
* నితిన్ గడ్కరీ - రవాణా శాఖ
* ప్రకాశ్ జవదేకర్ - అటవీ పర్యావరణ(స్వతంత్ర)
* నిర్మలా సీతారామన్ - వాణిజ్యశాఖ (స్వతంత్ర)
* వీకే సింగ్ - విదేశాంగ సహాయమంత్రి
* సదానందగౌడ - రైల్వేశాఖ
* జ్యూయల్ ఓరమ్- గిరిజన సంక్షేమం
* నజ్మా హెస్తుల్లా - మైనార్టీ వ్యవహారాలు
* గోపీనాథ్ ముండే - గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్
* హర్‌సిమ్రాత్‌కౌర్ బాదల్ - ఫుడ్ ప్రాసెసింగ్
* రాధా మోహన్‌సింగ్ - వ్యవసాయం
* నరేంద్రసింగ్ తోమర్ - గనులు, స్టీల్, కార్మిక, ఉపాధి
* హర్షవర్ధన్ - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
* పీయూష్ గోయల్ - విద్యుత్, బొగ్గు(స్వతంత్ర)
* నిహాల్‌చంద్ - ఎరువులు, రసాయనాలు సహాయమంత్రి
* ఉపేంద్ర కుష్వాహా - గ్రామీణాభివృద్ధి
* పి. రాధాకృష్ణన్ - భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు
* సంజీవ్‌కుమార్ బాలియా - వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్
* క్రిష్ణన్ పాల్ - రోడ్డు రవాణా, హైవే, షిప్పింగ్