మోడీ కేబినెట్: ప్రమాణం చేసిన మంత్రులు వీరే
posted on May 26, 2014 @ 8:17PM
భారత 15 వ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణ స్వీకారోత్సవ సోమవారం సాయంత్రం దేశదేశాలనుంచి వచ్చిన ఆత్మీయ అతిథులమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో అట్టహాసంగా జరిగింది, గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు నాలుగువేలమంది అతిథులు తరలిరాగా ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈశ్వర్ కీ శపథ్ లేతా హూం అంటూ మోదీ దేవునిపై ప్రమాణం చేశారు.
మోడీ కేబినెట్: ప్రమాణం చేసిన కేంద్ర మంత్రులు వీరే:
రాజ్‌నాథ్ సింగ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లక్నో నుండి గెలుపొందారు. మంత్రిగా పని చేసిన అనుభవం.
సుష్మా స్వరాజ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విదిష నుండి గెలుపొందారు. మూడుసార్లు మంత్రిగా పని చేసిన అనుభవం.
అరుణ్ జైట్లీ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయశాఖ మంత్రిగా అనుభవం. అదనపు సొలిసిటర్‌గా పని చేశారు. రాజ్యసభ సభ్యులు.
వెంకయ్య నాయుడు - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు. రాజ్యసభకు మూడుసార్లు వెళ్లారు. గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు.
నితిన్ గడ్కరీ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. నాగపూర్ నుండి గెలుపొందారు.
సదానంద గౌడ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరు నుండి ఎంపీగా గెలుపొందారు. రెండుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు.
ఉమాభారతి - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.
నజ్మా హెఫ్తుల్లా - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్. బిజెపి ఉపాధ్యక్షురాలు. ఐదుసార్లు లోకసభకు వచ్చారు.
గోపినాథ్ ముండే - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు.
రామ్ విలాస్ పాశ్వాన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హాజీపూర్ నుండి గెలుపొందారు. లోకసభకు ఎనిమిదిసార్లు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం. ఎన్డీయే భాగస్వామి ఎల్జేపీ అధ్యక్షులు.
కల్రాజ్ మిశ్రా - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.దేవరియా నుండి గెలుపొందారు. యూపి రాష్ట్ర మంత్రిగా పని చేసిన అనుభవం. రాజ్యసభ సభ్యుడిగా అనుభవం.
మేనకా గాంధీ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పిలిపిత్ నుండి గెలుపొందారు. పర్యావరణవేత్త, జంతుసంరక్షణ ఉద్యమాకారిణి. గతంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఆంగ్లంలో ప్రమాణం చేశారు.
అనంత్ కుమార్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరు దక్షిణనుండి గెలుపొందారు. కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం. ఆరుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు.
రవిశంకర ప్రసాద్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సభ్యులు. సుప్రీం కోర్టు న్యాయవాదిగా అనుభవం. గతంలో పలు శాఖలకు మంత్రిగా పని చేశారు.
అశోక గజపతి రాజు - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయనగరం నుండి గెలుపొందారు. ఎపిలో పలు శాఖల్లో మంత్రిగా పని చేశారు. రాజకీయాల్లో 36 ఏళ్ల రాజకీయ అనుభవం. టిడిపి ఎంపీ.
అనంత్ గీతే - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రమంత్రిగా అనుభవం. ఐదుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు.
హర్ స్మిత్ కౌర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భటిండా (పంజాబ్) నుండి గెలుపొందారు. మూడుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. సామాజిక ఉద్యమకారిణి.
నరేంద్ర సింగ్ తోమర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్వాలియర్ నుండి గెలుపొందారు. మున్నాభయ్యాగా అభిమానుల్లో గుర్తింపు.
జ్యూయల్ ఓరమ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుందర్ ఘడ్ నుండి గెలుపొందారు. నాలుగుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. గతంలో కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం.
రాధా మోహన్ సింగ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పూర్వీ చంపారన్ నుండి గెలుపొందారు. బిజెపిలో పలు కీలక పదవులు నిర్వహించారు. నాలుగుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు.
టిసి గెహ్లాట్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు.
స్మృతి ఇరానీ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సభ్యురాలు. బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు. రాహుల్ గాంధీ పైన పోటీ చేసి ఓడిపోయారు. గతంలో గుజరాత్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
హర్షవర్ధన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చాందినీ చౌక్ నుండి గెలుపొందారు. ఢిల్లీ మాజీ మంత్రి. గత ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి.
జనరల్ వికె సింగ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఘజియాబాద్ నుండి గెలుపొందారు. మాజీ సైన్యాధిపతి. రక్షణ శాఖలో విశిష్ట సేవలు అందించారు.
రావ్ ఇంద్రజిత్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురుగావ్ నుండి గెలుపొందారు. నాలుగుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం.
సంతోష్ గ్యాంగ్ వర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బరేలీ నుండి గెలుపొందారు. ఏడుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. సామాజికవేత్తగా సుపరిచితులు.
శ్రీపాద్ నాయక్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తర గోవానుండి గెలుపొందారు. బిజెపిలో పలు కీలక పదవులు. మూడుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు.
ధర్మేంద్ర ప్రదాన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సభ్యులు. బిజెపి యువమోర్చా నాయకుడు. గతంలో రెండుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు.
శర్వానంద్ సోనోవాల్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లఖింపూర్ నుండి గెలుపొందారు. బిజెపిలో పలు కీలక పదవులు నిర్వహించారు. రెండుసార్లు లోకసబకు ఎన్నికయ్యారు.
ప్రకాశ్ జవదేకర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సభ్యులు. రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. బిజెపి అధికార ప్రతినిధి.
పీయూష్ గోయల్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి కోశాధికారి. 27 ఏళ్ల రాజకీయ అనుభవం. రాజ్యసభ సభ్యులు.
జితేంద్ర సింగ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉదంపూర్ నుండి గెలుపొందారు. బిజెపి జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు. జమ్మూ కాశ్మీర్‌లో కీలక బిజెపి నేత.
నిర్మలా సీతారామన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి అధికార ప్రతినిధి. జాతీయ మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు. ప్రముఖ రాజకీయ విశ్లేషకురాలు. ఆంగ్లంలో ప్రమాణం చేశారు.
గౌడర్ మల్లికార్జునప్ప సిద్దేశ్వర - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దావణగెరె నుండి గెలుపొందారు. ఆంగ్రంలో ప్రమాణం చేశారు. వరుసగా మూడోసారి లోకసభకు ఎన్నికయ్యారు.
మనోజ్ సిన్హా - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గాజీపూర్ నుండి గెలుపొందారు. మూడుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం మాజీ అధ్యక్షుడు.
నిహాల్ చంద్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉపేంద్ర కుశ్వాహా - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. కరాకట్ నుండి గెలుపొందారు. రాష్ట్రీయ లోకసమతా పార్టీ నాయకుడు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
సిపి రాధాకృష్ణన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోయంబత్తూర్ నుండి గెలుపొందారు. తమిళనాడు బిజెపి అధ్యక్షుడు. కి
రెన్ రిజిజు - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ నుండి గెలుపొందారు. రెండుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు.
క్రిషన్ పాల్ గుజర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫరీదాబాద్ నుండి గెలుపొందారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు.
సంజీవ్ కుమార్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముజఫర్ నగర్ నుండి గెలుపొందారు. తొలిసారి లోకసభకు ఎన్నికయ్యారు.
వాసవ మన్సూక్ భాయ్ ధనాజీ భాయ్- కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బారుచ్ (గుజరాత్) నుండి గెలుపొందారు. నాలుగుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు.
రావ్ సాహెబ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు.
విష్ణుదేవ్ సాయి - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాయగఢ్ నుండి గెలుపొందారు. రెండుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు.
సుదర్శన్ భగత్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి లోకసభకు ఎన్నికయ్యారు.