రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్న అతిధులు
posted on May 26, 2014 @ 5:51PM
నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్ సన్నద్దమైంది. అతిధులంతా రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్నారు. బంగాదేశ్ ప్రధాని హసీనా తప్ప మిగిలిన సార్క్ దేశాధినేతల౦తా మోడీ ప్రమాణానికి హాజరయ్యారు. మన్మోహన్ సింగ్, సోనియా, రాహుల్ గాంధీ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మన రాష్ట్రం నుంచి బాలకృష్ణ, చంద్రబాబు, కేసిఆర్, నారా లోకేష్, టిడిపి ఎంపీలు హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అంబానీ కుంటుంబం కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.
బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ కూడా రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. అద్వానీతో పాటు కూతురు ప్రతిభ కూడా వచ్చారు. అద్వానీ అబ్దుల్ కలాం తదితరులతో కరచనాలం చేశారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా వచ్చారు. సోనియా గాంధీ, ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. మన్మోహన్ సింగ్ సోనియాను పలకరించారు. తన సతీమణితో కలిసి మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం రాష్ట్రపతి భవన్‌కు చేరుకన్నారు.మోడీ సన్నిహితులు అమిత్ షా, రామ్ మాధవ్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన మన్మోహన్ సింగ్ నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలను కలిశారు.