రాఖీ కట్టించుకున్న తర్వాత ఎప్పటి వరకు ఉంచుకోవాలి!
రాఖీ కట్టించుకున్న తర్వాత ఎప్పటి వరకు ఉంచుకోవాలి!
రక్షా బంధన్.. పేరులోనే సోదరి తన సోదరుడి రక్షణ కోసం రాఖీ కడుతుంది అని అర్థమైపోతుంది. ప్రతి ఏడాది అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ శ్రావణ పౌర్ణిమ రోజు రక్షా బంధన్ జరుపుకోవడం పరిపాటి. అయితే రాఖీ పండుగ రోజు రాఖీ కట్టేటప్పుడు ఎంత భక్తి, ఎంత శ్రద్ధ ఉంటుందో.. ఆ రాఖీ కట్టేసిన తరువాత అదంతా మయం అవుతుంది. అసలు రాఖీ కట్టగనే దాని గురించి ఎవరు ఎక్కువగా ఆలోచించరు. ముఖ్యంగా అక్క చెల్లెళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉన్న సోదరులు కట్టించుకున్న రాఖీని చాలా అపురూపంగా చూసుకుంటారు. కానీ చాలా వరకు రాఖీలు తొందరగా పాడవుతు ఉంటాయి. ఎక్కువ మంది రాఖీలు కట్టి ఉంటే ఆ సోదరుడి పరిస్థితి కాస్త ఇబ్బందే.. అన్ని రాఖీలు అట్లాగే చేతికి ఉంచుకోవడం ఇబ్బంది. అందుకే రాఖీలు తొలగిస్తూ ఉంటారు. రంగురంగుల దారాలు, పూసలు మొదలైనవాటితో తయారు చేసిన రాఖీలు తొందరగా పాడవుతాయి. కానీ సోదరులు తాము కట్టించుకున్న రాఖీ ఎప్పుడంటే అప్పుడు తీయకూడదు. ఇంతకు రాఖీ కట్టించుకున్న తరువాత ఎప్పుడు తీయాలి? రాఖీ లను ఎక్కడ వేయాలి? ఇవన్నీ వివరంగా తెలుసుకుంటే..
రాఖీ కట్టించుకోడమే కాదు దాని పట్ల బాధ్యతగా ఉండటం కూడా ముఖ్యం. రాఖీని కట్టించుకున్న తరువాత అది చేతికి ఇబ్బందిగా ఉందనే కారణంతో పొరపాటున కూడా దాన్ని ఎలాగంటే అలా తీయకూడదు.
రాఖీ రోజు కట్టించుకున్న రాఖీని దసరా పండుగ రోజు వరకు చేతికి అట్లాగే ఉంచుకోవడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఒకవేళ దసరా పండుగ వరకు రాఖీని ఉంచుకోలేకపోతే.. కనీసం ఆగస్ట్ 16 వ తేదీన వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు అయినా తప్పనిసరిగా రాఖీలను చేతికి ఉంచుకోవాలి.
కృష్ణాష్టమి లేదా దసరా తరువాత కావాలి అంటే రాఖీలను నది లేదా చెరువు వంటి నీటి ప్రాంతాలలో నిమజ్జనం చేయాలి. అంతేకాదు.. రాఖీ పండుగ రోజు సోదరీమణులు ఎంతో ప్రేమతో తమ సోదరులకు రాఖీ కడతారు. అంటే సోదరి ప్రేమ రాఖీలో ఉంటుందని చెప్పవచ్చు. అంత ప్రేమ ఉన్న రాఖీని తీసివేసేటప్పుడు ఎలాగంటే అలా తెంచడం, కట్ చేయడం చేయకూడదు. దాని ముడులను చాలా జాగ్రత్తగా విప్పాలి. రాఖీ కట్టించుకున్న ప్రతి సోదరుడు ఈ నియమాలను తప్పకుండా పాటించాలి.ఇలా చేస్తే సోదరి సోదరుల మధ్య ప్రేమ మరింత బలపడి వారు ఎప్పటికీ ఆప్యాయత అనురాగాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు.
*శ్రీరూప